నా ప్రియమైన వారలారా, దేవుడు మీకు విరోధముగా వచ్చుచున్న ప్రతి విధమైన దుష్టశక్తులను మరియు కీడుకరమైన దాడులను అధిగమించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 54:17వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు'' అని ప్రభువు సెలవిచ్చియున్నాడు. దుష్టుడైన అపవాది మరియు వాని యొక్క ప్రజలు మిమ్మును నాశనము చేయు నిమిత్తము మీ వైపున ఆయుధములను ఎక్కుపెట్టియుండవచ్చును. మీ మీద తప్పుగా నిందారోపణలు చేయబడు నిమిత్తము అనేకమైన నాలుకలు విడుదల చేయబడియుండవచ్చును. కానీ, దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ' నా బిడ్డలారా, నేను నిశ్చయముగా జరిగించెదను, ఇంకను మీకు విరోధముగా రూపింపబడు యే ఆయుధము కూడా వర్థిల్లదు మరియు మీ మీద అన్యాయముగా, తప్పుగా మాటలాడుటకు లేచియున్న ప్రతివిధమైన నాలుకయు కూడా ఖండించబడుతుంది. ఏ దుష్టత్వము మిమ్మును తాకకుండా, ఎటువంటి నిందారోపణ మీ మీద రుజువుపరచలేకుండునట్లుగా జాగ్రత్త వహించెదను తెలియజేయుచున్నాడు. మరియు నేను మీ జీవితములకు న్యాయ తీర్పు జరిగించెదను' అని చెప్పబడిన లేఖనము ఇది మీ కొరకు ఇవ్వబడియున్న దేవుని వాగ్దాన వచనమై యున్నది. 'ఇట్టి స్వాస్థ్యమును నేను మీకు అనుగ్రహించుచున్నాను, ఇది నా యొద్ద నుండి ఒక నిరూపణగా మీకు వచ్చుచున్నదని' ప్రభువు మీకు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రములు. మనకు న్యాయము చేయు దేవుని మనము కలిగియున్నాము. ఆయ న నిశ్చయముగా మీకు న్యాయమును జరిగించి, మీ పట్ల సత్యమును కనుపరచును.

ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుని పరిశుద్ధత మీ మీదికి వచ్చియున్నప్పుడు, ఈలాగున ఆయన మీ కొరకు జరిగించును. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 10:4వ వచనమును మనము చూచినట్లయితే, "మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి'' ప్రకారము మనము పోరాడునది లోక సంబంధములైన ఆయుధములతో కాదు, విభిన్నముగా బలమైన దుర్గముగా నాశనము చేయు ఆయుదములను కలిగియున్నాము. ఆ దైవీకమైన శక్తియే దేవుని యొద్ద నుండి వచ్చు పరిశుద్ధతయై యున్నది. దేవుని యెదుట మరియు నరుల యెదుట నీతిమంతులుగా ఉండుటయే. అందుకే బైబిల్ నుండి లూకా 24:19వ వచనములో చూచినట్లయితే, "ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను'' అని చెప్పబడినట్లుగానే, యేసు తన వాక్కునందు మరియు చర్యలలోను బలీయమైన ప్రవక్తయై యున్నాడు. రెండవదిగా, దుష్టులైనవారిని, నిందారోపణనను మరియు నాశనమునకు తగిన బలమును దేవుడు మీకు అనుగ్రహించబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 9:18వ వచనములో చూచినట్లయితే, "యుద్ధాయుధములకంటె జ్ఞానము శ్రేష్ఠము'' అని చెప్పబడినట్లుగానే, జ్ఞానము యుద్ధాయుధములకంటె శ్రేష్ఠమైనది. నా ప్రియులారా, మీకు దేవుని యొక్క జ్ఞానము వస్తుంది. మీకు విరోధముగా పంపబడియున్న ఆయుధములన్నిటి మధ్యలో కూడా మరియు మీకు విరోధముగా మోపబడు నిందారోపణలన్నిటి మధ్యలో కూడా మీరు మరి, మరి ఎక్కువగా వర్థిల్లతను పొందడము కొరకై మీకు జ్ఞానమును అనుగ్రహించును. మీరు వెళ్లి, మీ నిందారోపణ మీ మీద రుజువుపరచడము కొరకై మీరు జాగ్రత్త తీసుకోవలసిన ఆవశ్యకత లేదు. మీరు వెళ్లి ఆయుధములతో పోరాడవలసిన నిమిత్తము లేదు. మీరు గొప్ప స్థాయిలోను, వర్థిల్లతతోను, దేవుని దయయందును మరియు మనుష్యుల దయయందును, మరి ఎక్కువగా, మరి ఎక్కువగా వర్థిల్లవలెను. మీ యొక్క స్వంత ఎదుగుదలయే మీ మీద నిందారోపణ చేయుచున్న వారి యొక్క నోర్లను మూసివేయుచున్నది. మీకు విరుద్ధముగా ఉన్న నిందారోపణలు, ఆయుధముల మధ్యలోను కూడా మీరు వర్థిల్లతను పొందు నిమిత్తము దేవుడు అటువంటి జ్ఞానమును మీకు అనుగ్రహించుచున్నాడు.

మూడవదిగా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు శత్రువుల యొక్క ఆయుధములను ఆర్పివేయుదురు. అందుకే బైబిల్ నుండి న్యాయాధిపతులు 14:5,6వ వచనములలో చూచినట్లయితే, " కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను'' అని చెప్పబడినట్లుగానే, యెహోవా ఆత్మ సమ్సోను మీదికి వచ్చినప్పుడు, బొబ్బరించుచూ అతని యెదుటికి వచ్చిన కొదమసింహమును మేకపిల్లను చీల్చునట్లుగా అతడు కేవలము అతని చేతుల చేతను మాత్రమే దానిని చీల్చివేసెను. అవును, నా ప్రియులారా, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు అటువంటి శక్తిని మీకు నేడు అనుగ్రహించబోవుచున్నాడు. ఎంత ఎక్కువగా మీకు నేరారోపణ వస్తుంటుందో, ఎంత ఎక్కువగా మీకు విరోధముగా ఆయుధములు శిక్షణ పొందుతాయో, అంత ఎక్కువగా మీకు బలమును ఇస్తాడు. అందుకే బైబిల్ నుండి మార్కు సువార్త 16:17వ వచనములో చెప్పబడినట్లుగానే, "నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీ చేతుల ద్వారా మరి ఎక్కువగా అద్భుత కార్యములను జరిగించబోవుచున్నాడు. మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు, వారు స్వస్థపరచబడుదురు. మీరు దురాత్మలను త్రోలివేయుదురు, మీరు క్రొత్త భాషలతో మాట్లాడెదరు. మీరు దేవునితో సంభాషించుదురు. ప్రజలు మీ ద్వారా దేవుని స్వరమును ఆలకించెదరు. కనుకనే, మీరు భయపడకండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు ఆయన హస్తముల వలె బలముగా ఉండెదరు. నా ప్రియులారా, ఈ రోజు ఇటువంటి ఆశీర్వాదములను మీకు అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. మీరు దీనిని ఎలా స్వీకరించవలెను? మీరు పరిశుద్ధతను ఎలా స్వీకరించవలెను? ఎలా జ్ఞానమును పొందుకోవాలి? ఆధ్యాత్మిక శక్తిని ఎలాగున స్వీకరించవలెను? అని మనము చూచినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారానే ఇటువంటి గొప్ప శక్తిని మనము పొందుకొనగలము. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:8వ వచనములో చూచినట్లయితే, " అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను'' అన్న వచనము ప్రకారముగా యేసు యొక్క ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు, మీరు యేసునకు సాక్షులుగా ఉండెదరు. నా ప్రియులారా, ఈ రోజున ఆయన తన ఆత్మ ద్వారా మిమ్మును నింపవలెనని మీ పట్ల కోరుచున్నాడు. తద్వారా, మీకు విరుద్ధముగా రూపింపబడు యే ఆయుధము కూడా వర్థిల్లకుండునట్లుగా, మీ మీద నిందారోపణ చేసియున్న నాలుకను, లేక భాషను మీరు ఖండించువారుగా ఉండెదరు. అంతమాత్రమే కాదు, మీరు దేవుని మహిమార్థమై గొప్ప వర్థిల్లతతో పైకి లేవనెత్తబడుదు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదని చెప్పినందుకై నీకు వందనములు. దేవా, మేము నీ యెదుటను, మనుష్యుల చెదుటను నీతిమంతులుగా నిలువబడునట్లుగాను, ప్రతి నిందను అధిగమించడానికి మాకు దైవీక జ్ఞానమును పొందుటకు నీ పరిశుద్ధతతో మమ్మును నింపుము. దేవా, మా యొక్క ప్రతి నిందారోపణ స్వరమును నిర్మూలము చేయుచు, మా జీవితము నీ కృప, దయను మరియు సత్యములో వృద్ధిపొందునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క ప్రతి దుష్ట దాడులను జయించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు శక్తినిచ్చి, మాటలోను, క్రియలోను శక్తిమంతులైన నీ పాత్రగా మమ్మును మార్చుము. దేవా, నీ న్యాయము మరియు నీ నిర్దోషత్వము మా జీవితంలో కనబడునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును కాపాడి ఉన్నత స్థితికి హెచ్చిస్తావని మేము నమ్ముచున్నాము. తండ్రీ, నీ బలమైన పరిశుద్ధాత్మ మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నిందారోపణను గురించి చింతించుటకు ప్రతిగా మరియు మమ్మును నాశనము చేయుట కొరకు మాకు విరుద్ధముగా లేచిన ఆయుధములకు బదులుగా, మమ్మును నీ ఆత్మ చేత నింపుము. ప్రభువా, మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపుము. యేసయ్యా, మరి ఎక్కువగా సింహము వంటి సమస్యలను మరియు దేవుని చిత్తము జరిగించుటకు నీ ఆత్మ చేత మమ్మును నింపుము. ప్రభువా, సింహము నోటిని చీల్చివేయు సమ్సోను వలె మమ్మును లేవనెత్తుము. దేవా, ఇతరులకు మా చేతుల ద్వారా అద్భుతములను మరియు దైవకార్యములను జరిగించునట్లుగా, మమ్మును నీ ఆత్మచేత నింపి, మాకు కావలసిన జ్ఞానమును దయచేయుము. ప్రభువా, మా మీద ఎటువంటి నిందారోపణ చేయకుండా, అపవాది మా మీద దుష్టకార్యములు జరిగించకుండా ఉండునట్లుగా మాకు నీ యొక్క పరిశుద్ధతను మాకు దయచేయుము. దేవా, మా జీవితములో సత్యము గెలుపు పొందునట్లుగా మరియు మా యొక్క ప్రతి విషయములో మాకు విజయమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.