నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మన హృదయాలను ఉజ్జీవింపజేయబోవు చున్నాడు. ఆయన మనతో మాట్లాడిన ప్రతిసారీ, మనం ఉన్నతముగా లేవనెత్తబడుటకు దైర్యమును దయచేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 6:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము నుండి ఆయన మాట్లాడిన మాట స్వయంగా మనము విందాం: " కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పి న ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మన యొద్ద కోరుకొనునది విధేయత. కనుకనే, దేవుడు ఇక్కడ విధేయతను గూర్చి స్పష్టముగా తెలియజేయుచున్నాడు. కాబట్టి, మీరు దేవుని పట్ల విధేయత చూపించినట్లయితే, మీకు ఎంతో మేలు జరుగుతుందని మరియు మీరు దేశంలో ఉన్నత స్థాయికి వర్థిల్లుతారనియు ఈ వచనములో నొక్కి చెప్పబడియున్నది. అయినప్పటికిని విధేయత అంత సులభం కాదు, ఎందుకంటే మన తల్లిదండ్రులు, పెద్దలు, పాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు ఉన్నతాధికారుల కు విధేయత చూపమని మనం ఏర్పరచుకొనబడియున్నాము. ఎవరైనా మనకు ఏదైనా చేయమని ఆజ్ఞాపించినప్పుడు మనకు అది తరచుగా నచ్చదు మరియు మనం వారి యొక్క ఆజ్ఞలకు బానిసలమైనట్లు భావిస్తాము. కనుకనే, అది మనకు ఏమాత్రం నచ్చదు.
అయితే, నా ప్రియులారా, దేవుడు విధేయతకు గల ప్రాముఖ్యతను స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఎందుకంటే, మన జీవితాలలో పెద్దలైన అటువంటి వారిని కూడా మనకు అనుగ్రహించినది ఆయనే. మనకు మార్గనిర్దేశం చేయడానికి, ఉన్నతమైన దృక్పథం మరియు గొప్ప అనుభవం ఉన్న పెద్దలను ఆయన నియమించియున్నాడు. కనుకనే, వారు చెప్పినది మనం పాటించినప్పుడు, అది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక సులభమైన మార్గంగా మారుతుంది. కొన్నిసార్లు మనం వాటిని కూడా అధిగమించవచ్చును. సలహా తీసుకునేవారు, సరైన సలహా తీసుకునేవారు తెలివైనవారు. ఎందుకంటే, అది మనకు ఎంతగానో సహాయపడుతుంది మరియు మనలను గొప్ప వ్యక్తులనుగా తీర్చిదిద్దుతుంది. అనేకసార్లు, దేవుని ఆజ్ఞలను వారి ద్వారానే మనకు బయలుపరచబడతాయి. కాబట్టి, దేవుడు మన జీవితాలలో మనకు దయచేసిన పెద్దలను మనం గౌరవిద్దాం.
బైబిల్‌లో కానా ఊరిలో జరిగిన వివాహ విందులో, ద్రాక్షారసం ఖాళీ అయిపోయినప్పుడు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న యేసుప్రభువు తల్లియైన మరియ తన పరిచారకులతో, 'యేసు మీకు చెప్పినదంతయు చేయుడి' అని చెప్పెను. యేసు రక్షకుడని గానీ, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని గానీ వారికి తెలియదు, అయినప్పటికి తమపై పెద్దగా నియమించబడిన ఆమె యొక్క ఉపదేశమును వారు విశ్వసించారు. అయితే, ' యేసు, ఖాళీ రాతి భానలను నీటితో నింపండి' అని చెప్పినప్పుడు, వారికి దాని కారణం అర్థం కాలేదు, కానీ వారు ఆయన మాటకు విధేయత చూపించారు. మరియు వారు ఆలాగున చేసినప్పుడు, వారు నింపిన నీరు ద్రాక్షారసంగా మారిపోయినది. నా ప్రియులారా, కొంతమంది అనేకసార్లు, ఒక పని చేయమని మనలను ఎందుకు అడుగుచున్నారో మనకు అర్థం కాదు, కానీ మనం దానికి విధేయత చూపినప్పుడు, దాని నుండి ఒక గొప్ప అద్భుతం మరియు అభివృద్ధి కలుగుతుంది. ఆలాగుననే, మా వ్యక్తిగత జీవితంలో కూడా, మా నాన్న నాకు ఇచ్చిన అవకాశాలను పాటించడం ద్వారా నేను ఆశీర్వదించబడియున్నాను. కొన్నిసార్లు నాకు అది నచ్చకపోయినప్పటికిని, 'నేను సరే' అని చెప్పినప్పుడు, ప్రభువు నన్ను శక్తివంతంగా వాడుకుంటున్నాడు మరియు గొప్ప వేదికలను దేవుడు నాకు తెరచియున్నాడు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఉన్నత స్థితికి ఎదగడానికి విధేయత చూపించే ఈ అవకాశాన్ని దేవుడే మీకు ఇచ్చుచున్నాడు. కనుకనే, ఇప్పుడే మీరు ఈ గొప్ప సదావకాశమును అంగీకరిస్తారా? ఆలాగున మీరు అంగీకరించి, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు, నిశ్చయముగా, ఆయన మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించను గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, దయచేసి నేడు మాకు విధేయతగల ఒక హృదయాన్ని మాకు దయచేయుము. దేవా, నీ యెదుట మమ్మును మేము తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మాకు ఏమియు అర్థం కానప్పుడు కూడా, మేము గొప్ప చిత్రాన్ని చూడలేనప్పుడు కూడా, నీకు విధేయత చూపడానికి మాకు కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితంలోనికి సరైన ఆలోచనలను వచ్చునట్లుగాను మరియు దానిని ఇష్టపూర్వకంగా అంగీకరించే హృదయాన్ని మాకు దయచేసి, మమ్మును సరిదిద్దే సూచనలు కూడా, మా పెద్దలు మరియు ఉన్నతాధికారుల సూచనలను కూడా మాకు అనుగ్రహించి మరియు వారి ద్వారా నీ స్వరాన్ని పాటించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నేటి నుండి నీకు విధేయతను ఎంచుకున్నప్పుడు, మమ్మును ఘనపరచుము, మమ్మును ఉన్నతంగా ఆశీర్వదించి మరియు నీ యొక్క దైవీక ఆశీర్వాదాలతో మమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించుము. ప్రభువా, మేము భూమిలో గొప్పవారముగా ఎదుగునట్లుగాను మరియు నీ వాగ్దానములు మా జీవితంలో నిజము అగునట్లుగా మాకు నీ కృపను చూపుము. దేవా, మా హృదయాన్ని విధేయతతోను, నీకు మరియు పెద్దలకు, అధికారులకు లోబడునట్లుగా తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


