నా ప్రియ స్నేహితులారా, తన యందలి జీవమును మనకు ఇవ్వడానికి ఈ రోజు ప్రభువు మన యొద్దకు వచ్చియున్నాడు. ఆయన జీవమును బట్టి మనము జీవించుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' ప్రకారము ఆయన మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనియున్నాడు. కనుకనే, యేసుయందలి విశ్వాసము చేత మనము జీవించుచున్నాము. ఎందుకనగా, ఆయన మనలను ప్రేమించుటకు తన్నుతాను సిలువకు సమర్పించుకున్నాడు. కొంతమంది మనలను ఈలాగున అడుగుతుంటారు, 'మీరు చాలా రకముల సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా, మీకు ఎదురుగా చాలా శత్రుత్వము ఉన్నది కదా, మీరు అపజయముల ద్వారా వెళ్లుచున్నారు కదా, ఇంకను యేసును ఎందుకు అంటిపెట్టుకొని ఉంటారు? ఆయనను వెంబడిస్తూ, ఆయన నామమునకు సేవచేయుచున్నారు ఎందుకు? అని ప్రశ్నిస్తారు. నా ప్రియులారా, ఈ వచనము మాత్రమే దానికి జవాబుగా ఉన్నది. మనము యేసునందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాము. ఎందుకనగా, ఆయన మనలను ప్రేమించి, తన్నుతాను సమర్పించుకున్నాడు, అది మాత్రమే ఇందుకు కారణము. ఈ ప్రేమ ప్రతి సమస్యకంటే బలమైనది మరియు ప్రతి బాధ కంటే లోతైనది. అందుకే మనం ఆయనను అంటిపెట్టుకుని ఆనందంతో ఆయనను సేవించెదము. ఎందుకంటే, మన జీవితం క్రీస్తులో దేవునిలో దాగి ఉన్నది. కనుకనే, మనము అటువంటి విశ్వాసముతో ముందుకు సాగుదాము.
నా ప్రియులారా, ఆయన మన కోసము చేసిన త్యాగమునందు మనము విశ్వాసము కలిగి ఉంటున్నాము. ఆయన చేసియున్న త్యాగములో ఆయన కనుపరచియున్న ప్రేమ మాత్రమే. ఈ త్యాగమును బట్టి, మనము స్వతంత్రించుకొనుచున్న ఆశీర్వాదములేవనగా, మనము పొందుకొనుచున్న స్వస్థత, మనము పాపము నుండి పొందుచున్న విడుదల, పాపము దాని శాపము నుండి విడుదల, ఇవన్నియు ఆయన తన్ను తాను మన కోసము సమర్పించుకోవడము ద్వారా మాత్రమే జరిగినది. మనము ఈ సత్యమును ఎరిగియున్నందుకై దేవునికి వందనములు. మనము మన విశ్వాసమును ఈ సత్యమునందు ఉంచగలుగుచున్నాము. మనము ప్రతిరోజు ఈ సత్యమునందు విశ్వాసము ఉంచుచుండగా, 'ప్రభువా, నీవు మమ్మును ప్రేమించి, సమర్పించుకున్నందుకై నీకు వందనములు' అని చెప్పుచుండగా, మనము సంపూర్ణమైన విడుదలను పొందుకుంటాము. మనము ప్రతిరోజు దైవాశీర్వాదములను స్వతంత్రించుకుంటాము. ఇంకను మనము మన పాపము నుండి మరియు రోగము నుండి విడిపించబడుచున్నాము. ఎందుకనగా, సిలువలో మన నిమిత్తము తాను చిందించబడియున్న యేసు రక్తమును బట్టి, కేవలము ఇందును బట్టి, 'యేసయ్యా నీకు వందనములు' అని ప్రతిరోజు చెల్లిస్తూ, విశ్వాసముతో జీవించండి. ఈ సత్యమునందలి విశ్వాసముంచండి. ఆయన సంపూర్తి చేసిన పనిలో మీరు మీ విశ్వాసాన్ని బలపరచుకొనండి మరియు మీరు ఆ విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు, మీరు సంపూర్ణమైన విడుదలను అనుభవిస్తారు. మీరు పాప బంధకముల నుండి, అనారోగ్య బాధ నుండి మరియు రేపటి భయం నుండి విడుదల పొందుతారు. యేసు సిలువపై చిందించిన రక్తం కారణంగా, మీరు దేవుని యెదుట స్వస్థత పొంది స్వస్థచిత్తులగుతారు. మన చుట్టూ ఉన్న సమస్తమును కదిలించబడినప్పుడు కూడా ఆయన త్యాగంపై విశ్వాసం మనలను స్థిరంగా నిలిచి ఉండునట్లుగా చేస్తుంది. మన జీవితం మనలను ఎన్నిసార్లు పడగొట్టినా, తిరిగి లేవడానికి ఇది మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది.
నా ప్రియ స్నేహితులారా, కొంతమందికి ప్రభువు మన కొరకు ఏమి చేసియున్నాడని వారికి తెలియదు. వారు విడుదల కొరకు ఎక్కడికి వెళ్లతారు? వారి జీవితములో విశ్వాసము కలిగియుండి పునాది లేకుండా వారు ఎక్కడికి వెళ్లగలుగుతారు? వారికి పునాదులు లేవు, కనుకనే వారు సులభంగా కదిలిపోతారు. కానీ, మనలను బట్టి, దేవునికి వందనములు, ఆయన ఈ సత్యమును మనకు బయలుపరచియున్నాడు. నిరంతరాయముగా దేవునికి వందనాలు చెబుతూ, విశ్వాసముతో జీవించండి. అప్పుడు క్రీస్తు మీ జీవితములో చేసిన కార్యములన్నిటిని కూడా మీ జీవితములో మీరు అనుభూతి చెందగలుతారు. మరొక ఫర్యాయము ఈ సత్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. కాబట్టి, ఈ విశ్వాసాన్ని మనం దృఢంగా పట్టుకుందాం. సిలువ నిమిత్తము, మనలను రక్షించిన ప్రేమ కోసం, మరియు ఆయన మనలో ఉంచిన జీవితం కోసం ప్రతిరోజూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీరు యేసుపై విశ్వాసంతో జీవించడం కొనసాగిస్తున్నప్పుడు, ఆయన సిలువ నుండి విడుదల చేసిన క్షమాపణ, స్వస్థత, ఆనందం మరియు విజయం వంటి ప్రతి ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. మీ హృదయం సమాధానముతో నింపబడియుంటుంది, మీ ఇల్లు ఆయన రక్షణతో కప్పబడి ఉంటుంది మరియు మీ జీవితం ఆయన విడుదల చేసిన ప్రేమకు సాక్ష్యంగా ప్రకాశిస్తుంది. కనుకనే, నా ప్రియులారా, ప్రతిరోజూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం కొనసాగించినట్లయితే, ఆయన శక్తి మీ ద్వారా పనిచేస్తుందని మీరు చూడగలరు. ఇది ్రకైస్తవ జీవిత రహస్యం - దృష్టితో కాదు, మనకోసం తనను తాను అర్పించుకున్న యేసునందు విశ్వాసం ద్వారా జీవించుటకు మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకొని, విశ్వాసముతో జీవించినట్లయితే, నిశ్చయముగా, మీ విశ్వాసము వలన మీరు జీవించెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, ఈ వాగ్దానము కొరకై వందనములు. ప్రభువైన యేసయ్య, మేము నిన్ను ప్రేమించుటకును, నీవు మమ్మును ప్రేమించి, మా కొరకు నిన్ను నీవు అర్పించుకున్నందుకు నీకు వందనాలు. యేసయ్యా, నీ సిలువ నుండి మాలోనికి ప్రవహించే జీవితాలకు నీకు వందనాలు. ప్రభువా, నీయందలి విశ్వాసం ద్వారా ప్రతిరోజూ జీవించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీవు మా నిమిత్తము చేసిన ఇట్టి త్యాగము నిమిత్తము మేము జీవించుచున్నాము. సిలువలో నుంచి నీవు విడుదల చేసిన, ఆశీర్వాదములను మేము విశ్వసించుట ద్వారా జీవించుచున్నాము. ప్రభువా, మేము విశ్వాసము ద్వారా జీవించుచున్నామని నమ్ముచున్నాము. యేసయ్యా, నీవు మా పాపముల నుండి, రోగముల నఉండి మమ్మును విడిపించి, నీ గాయముల నుండి మాకు స్వస్థపరచబడుటకు నీ కృపను మాకు దయచేయుము. యేసయ్యా, నీ రక్తము ద్వారా మేము కడగబడి, నీ యొక్క ఆశీర్వాదములను స్వతంత్రించుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. ఓ ప్రభువా, ప్రతి బలహీనత మరియు భయం నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, నీ సమాధానముతోను, స్వస్థతతోను మరియు బలముతోను మమ్మును నింపుము. దేవా, మా జీవితం పట్ల నీవు చేసిన త్యాగానికి మహిమను తీసుకొని వచ్చునట్లుగా మేము నీ యందలి విశ్వాసంలో దృఢంగా నిలిచిఉండుటకు సహాయము చేయుము. ప్రభువా, అనుదినము మా జీవితములో నీ యొక్క ఆశీర్వాదాలను బయలుపరచుము. దేవా, నీవు నీ కుమారుని ద్వారా మా పట్ల చేసిన కార్యములను బట్టి మేము ధైర్యముగా జీవించుటకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


