నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మీకు అందించడం మరియు మిమ్మును ఆశీర్వదించడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. ఈ లేఖన వచనము ఆశ్చర్యకరమైన ఎంతో వాస్తవమైనది. ఈ వచనము దేవుని నుండి తీసుకొని వచ్చు ప్రేమను మహిమపరు స్తుంది, ఇది మానవ ప్రేమ కాదు, దైవీకమైన ప్రేమ మాత్రమే. ఈ లేఖనము లో చెప్పబడినట్లుగానే, మనకు ప్రేమ పరిపూర్ణతను తీసుకొని వస్తుంది. అది మనలో దేవుని స్వభావంలోని ఇతర గుణాతిశయాలను కూడా పరిపూర్ణం చేయుచున్నది. ఆ గుణాతిశయములు, ఆయనలో ఉన్న దయ, కనికరము, సహనము, సాత్వికము మరియు శక్తి, అధికారము - ఇవన్నియు కూడా ప్రేమ ద్వారా పరిపూర్ణతను పొందుతాయి. ప్రేమ లేకుండా మన క్రియలన్నియు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. కానీ, ప్రేమతో అన్నియు కూడా సంపూర్ణమవుతాయి. ప్రేమ అనేది ఇతర సద్గుణాలను ఏకమయ్యేలా చేయు కిరీటం వంటిది. మన గుణాతిశయ పరిపూర్ణత, మనలో పని చేయుచున్న దేవుని శక్తి యొక్క పరిపూర్ణత, దేవుని మార్గాల నిచ్చు పరిపూర్ణత- ఇవన్నియు కూడా ప్రేమ ద్వారానే ప్రారంభమవుతాయి.

నా ప్రియులారా, మనము ప్రజల యెదుట నిలువబడినప్పుడు, వారి పోరాటా లను, భారములను, విన్నపములను వింటున్నప్పుడు, ప్రజల మధ్య ఒక శక్తివంతమైన కార్యము జరుగుతుంది. పరిశుద్ధాత్మ మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించును మరియు ఆ ప్రేమ మనలను క్రియ జరిగించడానికి నడిపిస్తుంది. అది ఒక సాధారణమైన దయగల స్వభామునకు ఆహ్వానము అందించుచున్నది లేదా అనేకమంది జీవితాలలోనికి పరిష్కారాలు తీసుకొని వచ్చు దేవుని యొక్క గొప్ప ప్రణాళికలను బయలుపరచుటకు సహాయపడుతుంది. కొన్నిసార్లు, ఇది అద్భుతాలు చేయడానికి, ప్రవచన వాక్కులను మాట్లాడటానికి లేదా ఒక ఆత్మను యేసుక్రీస్తు ప్రేమ మరియు రక్షణలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయుచున్నది. ఇవన్నీ దైవీక ప్రేమ నుండి ప్రవహిస్తాయి. మానవ ప్రేమ తరచుగా షరతులతో కూడినది మరియు తాత్కాలికమైనది. కానీ, దేవుని ప్రేమ శాశ్వతమైనది, పరిశుద్ధమైనది మరియు కనికరంతో నిండినది. ఈ ప్రేమ మన జీవితాలలో మరియు ఇతరుల జీవితాలలో దేవుని ఆశీర్వాదాలను తెరిచే తాళపు చెవిగా ఉంటున్నది. అందుకే వాక్యంలో, 'ప్రేమను ధరించుకోండి' అని మనలను ప్రోత్సహించుచున్నది. ఆ ప్రేమ లేనట్లయితే, మన యొక్క మంచి పాత్ర కూడా స్వార్థపూరితమైన పాత్రగా మారవచ్చును. కానీ ఆ ప్రేమతో, మన పాత్ర దైవభక్తిగా రూపాంతరం చెందుతుంది, మనకోసం కాదు, ఇతరుల కొరకు పనిచేయుచూ, క్రీస్తు హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేవుని నుండి వచ్చు ప్రేమను మనం వెదకుదాము. మన పరిమితమైన మానవ ప్రేమ మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ మన హృదయాలను దైవీక ప్రేమతో నింపడానికి అనుమతిద్దా ము. ప్రియులారా, మనం ఈ ప్రేమను ధరించుకున్నప్పుడు, అది మనలను క్షమించడానికి, ప్రోత్సహించడానికి, సేవ చేయడానికి మరియు దేవుని మహిమపరచే విధంగా పరిచర్య చేయడానికి శక్తినిస్తుంది. ఇది మన ్రకైస్తవ జీవనయాత్రలో పరిపూర్ణతను తీసుకువస్తుంది, దేవుని రాజ్యంలో మనలను ఫలవంతంగా మరియు ప్రభావవంతులుగా ప్రభావవంతంగా చేయుచున్నది. కాబట్టి, దేవుని ప్రేమ ఎన్నటికి విఫలం కాదు, ఎందుకంటే ప్రేమ అంటే దేవుడు మనలో మరియు మన ద్వారా పని చేయడమే. అయితే, ఈ రోజు మనం అటువంటి ప్రేమను ధరించుకుందామా? ఆయన కనికరము, దయ, కరుణను పొందడానికి మన హృదయాలను తెరుద్దామా? మనం అలాగున చేసినట్లయితే, ఆయన తన ప్రణాళికలను నెరవేర్చడానికి, మన పట్ల తన అద్భుతాలను జరిగించడానికి మరియు మన ద్వారా అనేకమంది జీవితాలను ఆశీర్వదించడానికి మనలను ఉపయోగించుకుంటాడు. నిజంగా, నా ప్రియులారా, ప్రేమ అనేది పరిపూర్ణత యొక్క అనుబంధమై యున్నది. కనుకనే, దేవుని ప్రేమను ధరించుకొనుటకు మిమ్మును మీరు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు ప్రేమను గురించి మాకు బోధించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, ప్రేమ పరిపూర్ణత యొక్క అనుబంధమని మాకు బయలుపరచినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయాన్ని నీ దైవీక శాశ్వతమైన ప్రేమతో నింపుము. ప్రభువా, నీ ప్రేమ ద్వారా మానవ స్వభావాన్ని మించి దైవీక స్వభావాన్ని పొందడానికి మాకు సహాయం చేయుము. తండ్రీ, పరిశుద్ధాత్మ ద్వారా నీ దయ, కనికరమును మాలో కుమ్మరించుము. ప్రభువా, నీ ప్రేమ ద్వారా మాకంటే ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి మమ్మును అనుమతించుము. యేసయ్యా, నీ ప్రేమ మా ద్వారా దయగల కార్యాలను మరియు శక్తివంతమైన ప్రణాళికలను తెరచుటకు తాళపు చెవిని మాకు దయచేయుము. దేవా, మానవుల ప్రేమ అస్థిరమైనది. కానీ, నీ ప్రేమ నిరంతరము నిలుచునది. కనుకనే, నీ యొక్క నిత్యమైన ప్రేమ మాకు దయచేసి, నీ ప్రేమతో నింపబడిన పరిపూరణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క ప్రేమ ద్వారా ఇతరుల జీవితాలలో అద్భుతాలు, రక్షణ మరియు నిరీక్షణను తీసుకురావడా నికి మమ్మును ఉపయోగించుము. యేసయ్యా, ఈ లోకములో మమ్మును నీ పరిపూర్ణ ప్రేమకు సాధనంగా మార్చుమని యేసు క్రీస్తు శక్తివంతమైన ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.