నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 52:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృప యందు నమ్మిక యుంచుచున్నాను'' ప్రకారం మనము దేవుని కృపయందు నమ్మకము కలిగియుండాలి. మరొక తర్జుమాలో ఈ అద్భుతమైన వచనమును మనము చూద్దాము. ఆ వచనము, "నేనైతే, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను'' ప్రకారం మనము కూడా దేవుని మందిరములో జీవించాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యెదుట మీరు ఎలాగున జీవించుచున్నారు? బైబిల్లో కీర్తనలు 11:4వ వచనములో చూచినట్లయితే, "యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు'' ప్రకారం మనము దేవుని ఆలయమై యున్నాము. అదేవిధంగా, 1 కొరింథీయులకు 3:16,17వ వచనములలో చూచినట్లయితే, "మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు'' ప్రకారం ఒక పచ్చని ఒలీవ చెట్టువలె మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొని, మరియు మీరు ఆశీర్వాదమును ఆయన ఆలయముగా మారుతారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారని చెప్పబడింది. కనుకనే, 2 కొరింథీయులకు 6:16 మరియు ఎఫెసీయులకు 2:21వ వచనములో ఈలాగుననే, వ్రాయబడియున్నది, "దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము మరియు ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు'' ప్రకారం మీరు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టువలె ఉంటారు. అనగా, అభివృద్ధిని కలిగి ఉంటారు.
నా ప్రియులారా, మీరు, 'అయ్యో, నాకు సమాధానము లేదు, నాకు ఆనందము లేదు, నాకు డబ్బులేదు, నాకు ఇది లేదు మరియు అది లేదు' అని అనుకుంటూ, కుటుంబ జీవితమును గురించి సణగుతూ ఉంటారు. అయితే, మీరు దేవుని ఆలయముగా మారినప్పుడు, మీరు దేవుని యొక్క అభివృద్ధిని పొందుకుంటారు. బైబిల్ నుండి హగ్గయి 2:7వ వచనములో చూచినట్లయితే, "నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు'' ప్రకారం మీరు దేవుని ఆలయముగా మారినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీలో, మీతో నివసిస్తాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయమును చదివినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శిష్యులందరు ఇటువంటి అనుభూతిని చెందారు. ఇంకను బైబిల్లో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయమును చదివినట్లయితే, కొర్నేలీ అను అన్యుడు కూడా ఈ అనుభవమును పొందుకున్నాడని పేర్కొనబడినది. వారందరు ఆత్మలో అభివృద్ధిని పొందుకొని ఉన్నారు. ఒకవేళ, లోకపరంగా వారు అభివృద్ధిని పొందుకొనలేదమో కానీ, వారు దేవునిలో జీవించుచూ, ఆత్మలో వారు అభివృద్ధిని పొందుకున్నారు.
నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని శక్తిని పొందుకున్నప్పుడు, మీరు దేవుని ఆలయముగా మీరు మారతారు. హల్లెలూయా! మనము దేవుని ఆలయముగా మారినప్పుడు, మనము దేవుని శక్తితోను మరియు సన్నిధానముతోను నింపబడతాము, అంతమాత్రమే కాదు, ప్రభువు మీ కొరకు అన్నిటిని మేలు కొరకు జరిగిస్తాడు. తద్వారా, మీరు దేవుని నామానికి మహిమను తీసుకొని వచ్చెదరు. ప్రియులారా, ప్రభువు ఈ రోజే అటువంటి జీవితముతో మిమ్మును నింపుతాడు. మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను మీరు చూచెదరు. కనుకనే, నేడు మీరు నమ్ముచున్నారా? ఆలాగైతే, మీరు ప్రార్థించి, ఇప్పుడే దేవుని యొక్క శక్తితో నింపబడండి. దేవుడు మిమ్మును తన ఆలయముగా చేసుకొని, మీలో వచ్చి నివసిస్తాడు, మిమ్మును దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె మారుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీవు చేసినటువంటి సమకూర్పుకై మరియు పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు. ప్రభువా, దేవుని ఆలయముగా మమ్మును చేసినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీ మహిమను మేము చూచునట్లుగా, ఇప్పుడే, మా గృహములు నీ యొక్క శక్తితో మరియు నీ సన్నిధానముతో నింపుము. దేవా, నీ యొక్క మహిమార్థమై మేము ప్రకాశించునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టులా వర్ధిల్లాలనే కోరికతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మాలో నివసించడానికి ఎంచుకున్నందుకు, మమ్మును నీ నివాస స్థలంగా చేసుకున్నందుకు, మరియు నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మా జీవితం నుండి ప్రతి సణుగుట మరియు కొరత యొక్క ఆత్మను తొలగించి, బదులుగా మమ్మును నీ శాంతి, ఆనందం మరియు దైవిక వర్థిల్లతతో నింపుము. దేవా, నీ మహిమ మా మీద నిలిచి ఉండునట్లుగాను మరియు మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని మోయువారముగా మమ్మును మార్చుము. యేసయ్యా, కొర్నేలి మరియు నీ శిష్యుల వలె నీ శక్తి యొక్క సంపూర్ణతను మేము అనుభవించునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మమ్మును నీ మహిమ కొరకు వాడుకొనుము. దేవా, ఈ రోజు మేము జీవించే దేశంలో ప్రభువు మంచితనాన్ని చూస్తానని నమ్ముచున్నాము. దేవా, మాలో ఉన్న సణుగుడును తొలగించి, మమ్మును నీ బిడ్డలనుగా మార్చుకొని, నీవు మాలోను మరియు మాతో నివసించుచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.