నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీతో కలిసి దేవుని సందేశమును ధ్యానించుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ఈ రోజున విశ్వాసముతో ఈ వాగ్దాన సందేశమును స్వీకరించబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 13:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము'' ప్రకారముగా మీ కోరిక సఫలము కాలేదు అని చింతించుచున్నారా? అయితే, మీ హృదయమును కలవరపడనీయకండి. మీ మనోవాంఛను సిద్ధింపజేస్తాడు.

ఒక సహోదరి, తన జీవితములో జరిగిన ఒక సంఘటనను వ్రాత పూర్వకముగా మాకు ఈలాగున తెలియజేసియున్నారు. ఆమె ఒక బ్యాంకులో ఉద్యోగినిగా పనిచేయుచుండెను. కర్ణాటకలో ఆమె వివాహము ఘనంగా జరిగించబడియున్నది. వారు ఎంతగానో సంతోషముగా ఉండియున్నారు. వారు సంతోషముగా కలిసి జీవించుచున్నారు. కానీ, ఆరు నెలల తర్వాత, ఆకస్మాత్తుగా ఆమె యొక్క భర్త, ఆమెను తిట్టడము, దెబ్బలు కొట్టడము, ఈలాగు ఆమెను బాధించడము ప్రారంభించాడు. అయితే, చివరికి అది చాలా దుఃఖభరితమైన వివాహముగా మారిపోయినది. తన యొక్క సంతోషభరితమైన ఆశలన్నిటిని కూడా, చీకటిగా మారిపోవడము ఆరంభించినది. ఆమెకు ఏమి చేయాలో తెలియడములేదు. ఆలాగున వారు ఒక సంవత్సరము పాటు విడివిడిగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆమె భర్త తనను విడిచివెళ్లిపోయాడు. ఇకవారు విడాకులు తీసుకుందాము అని అనుకున్నారు. అయితే, అటువంటి సమయములో కూడా ఆమె తన నిరీక్షణను కోల్పోలేదు. ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును సంప్రదించారు. తన యొక్క పరిస్థితిని గూర్చి మా తండ్రిగారికి ఆమె వ్రాత పూర్వకంగా తెలియజేశారు. వెంటనే, మా తండ్రిగారు ఆమె కొరకు ప్రార్థించి, 'దేవుడు మీ జీవితములో సమస్తమును కూడా చక్కపరుస్తాడు' అని తెలియజేశారు. ఇంకను, ' మీ జీవితమునకు సంబంధించిన సమస్తమును కూడా దేవుడు మారుస్తాడు' అని జవాబును పంపించారు. ఆమె ఆ వాగ్దానమును అంటిపెట్టుకొని ఉండెను. తన యొక్క నిరీక్షణ రాహిత్యమైన పరిస్థితులలోనే, ఆ వాగ్దానము ఆమెకు ఎంతో విశ్వాసమును ఇచ్చియున్నది. ఆమె విడాకులు తీసుకొను పనులను నిర్వహించుట కొరకు ఆమె తన యొక్క జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి ఆమె నిర్ణయించుకొనెను. అయితే, మహా అద్భుతమైన రీతిలో, ఆకస్మాత్తుగా తన భర్త దగ్గర నుండి ఆమెకు పిలుపు రావడము జరిగినది. అతడు వ్యక్తిగతంగా ఆమె యొద్దకు వచ్చి, 'నేను నిన్ను కర్ణాటకకు తీసుకొని వెళ్లాలని కోరుకుంటున్నాను' అని చెప్పాడు. ప్రభువు జరిగించియున్న మహిమాన్వితమైన కార్యముగా ఇది ఉండియున్నది. దేవుడు ఆమె వివాహమును ఆశీర్వదించాడు, వారిని రక్షించాడు. ఆ తర్వాత, వారు ఎంతో ఆనందముగా జీవించుచుండెను. ఒక సంవత్సరము తర్వాత దేవుడు వారికి ఒక కుమార్తెను అనుగ్రహించిన సంగతిని కూడా ఆమె మాకు సంతోషముగా తెలియజేశారు. నా ప్రియులారా, ఇది ఎంత అద్భుతమైన సంగతి కదా!

నా ప్రియులారా, ఎంత మహా అద్భుతమైన కార్యము కదా! మీ కోరిక దేవుని చేత ఆర్పివేయబడదు. మీరు ఈలాగున జరగవలెనని సుదీర్ఘకాలముగా వేచియున్నారేమో? మీ ఆశ నెరవేర్చబడాలని వేచియున్నారేమో? కానీ, ఇప్పుడైతే, మీ ఆశ నెరవేర్చబడబోవుచున్నది. దేవుడు మిమ్మును జీవవృక్షమువలె చేయబోవుచున్నాడు. దేవుడు జరిగించు అద్భుత కార్యములను మీరు చూచినట్లయితే, గొప్ప ఆనందమును అనుభూతి చెందుతారు. నా ప్రియులారా, మనము ఇప్పుడే దీనిని స్వీకరించుట ఎంత గొప్ప సంతోషము కదా! మీరు మీ కుటుంబం, మీ వివాహం, మీ పిల్లలు, మీ ఆరోగ్యం, మీ వృత్తి లేదా మీ భవిష్యత్తు కోసం కన్నీళ్లతో ప్రార్థించుచూ, ఎంతో కాలముగా ఎదురుచూస్తూ ఉండవచ్చును. కానీ ఈ రోజు, ప్రభువు తన పరిపూర్ణ చిత్తానుసారంగా మీ హృదయ కోరికను నెరవేరుస్తానని మీకు హామీ ఇస్తున్నారు. ఆయన మీ జీవితములను జీవవృక్షమువలె వర్ధిల్లునట్లుగా చేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీ దుఃఖం సంతోషంగా మారుతుంది, మీ నిరీక్షణ ఒక సాక్ష్యంగా మారుతుంది, మరియు మీరు ఆయన జరిగించుచున్న గొప్ప అద్భుతాలను చూచెదరు. ప్రభువు మీ హృదయంలోని ప్రతి దైవీకమైన వాంఛను నెరవేర్చుచున్నాడు. కాబట్టి, నేటి వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవు మా హృదయములను ఆనందపరుస్తావని వాగ్దానము చేసినందుకై నీకు వందనములు. దేవా, నీవే మా హృదయ కోరికలను మరియు మా జీవితములో ఉన్న ఎదురుచూపులను నీ కృప ద్వారా వాటన్నిటిని తీర్చుము. ప్రభువా, ఇప్పుడు కూడా మేము నీ మీద ఆధారపడుచూ, ఇంకను నీ మీదనే నిరీక్షణను ఉంచియున్నాము. దేవా, మేము నీ కొరకు ఎదురుచూస్తూ, వేచియున్న దానికి అంతటికిని కూడా నీ హస్తములు మా మీద చాపి, మమ్మును తాకుము, అది మా జీవితములు జీవవృక్షముల వలె మారునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములు మరణకరమైన మార్గములుగా మరియు ఆవేదన భరితములుగా ఉండకుండా ఇప్పుడే నీవే ఆజ్ఞాపించుము. దేవా, నీ పరిపూర్ణ సమయము మీద నమ్మకమును కలిగియుండడానికి మరియు నీ కొరకు ఎదురుచూచినప్పుడు, ఎన్నడూ మేము నిరుత్సాహపడకుండా ఉండటానికి మాకు సహాయం చేసి, మా ప్రతి దుఃఖమును నీ ఆనందం నింపుము. యేసయ్యా, మా జీవితములో ఆలస్యమైన జవాబుల వలన మా హృదయం అలసిపోయినప్పుడు, మమ్మును నూతన నిరీక్షణతో మరియు స్థిరమైన విశ్వాసంతో నింపుము. దేవా, విడిపోయిన ప్రతి సంబంధములను పునరుద్ధరించుము, మా యొక్క ప్రతి వ్యాధిని స్వస్థపరచుము, మూయబడిన ద్వారములను తెరువుము, ఇంకను మా యొక్క ప్రతి నిరాశను, భయమును తొలగించి, జీవితము నీ సన్నిధిలో వర్ధిల్లునట్లుగాను, నీ మహిమ కొరకు ఫలించే జీవవృక్షమువలె మారునట్లుగా కృపను చూపుము. దేవా, మా యొక్క అపజయముల మార్గము నుంచి మమ్మును పైకి లేవనెత్తి, నీవు మా ఆశను నెరవేర్చుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.