నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 34:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో చూచినట్లయితే, "యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు'' ప్రకారం నేటి దినము ప్రభువును అత్యాశక్తితో వెదకనై యున్నాము. ఆయన హృదయాంతరభాగము నుండి మనలను దీవించమని అడుగుదాము. మరియు ఆయన దానిని ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఈ రోజు పై వచనము ద్వారా మనతో మాట్లాడనై యున్నాడు.

నేను చిన్న వయస్సులో మా బంధువుల (కజిన్) ఇంట ఉండి చదువుకుంటున్నప్పుడు, నాకు నూడుల్స్ తినడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ నాకు తెలియకుండానే, ఆమె ఆ వంటను తయారు చేసి, చిన్న ముక్కలుగా కోసి, ఫ్రైడ్ రైస్ పరిమాణములాగా ఆ నూడుల్స్‌ను తయారుచేశారు. ఆమె నన్ను మోసం చేసి, నాకు ఆ నూడుల్స్‌ను పెట్టారు. అది తింటుండగా, నాకు చాలా బాగా ఉన్నట్లుగా అనిపించింది. నేను దానిని తిని ఎంతో సంతోషించి, మీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది! అని అన్నాను. ఆమె, 'నువ్వు తిన్నది ఫ్రైడ్ రైస్ కాదు, అది నూడుల్స్! అని జవాబిచ్చింది.' చూశారా? రుచి చూడకుండా, ముందుగానే, మీరు, ఇది వద్దు, కాదు, నచ్చదు అని చెప్పకూడదు. కానీ, ఏదైన సరే, మీరు రుచి చూచి తెలుసుకొనండి.

అవును, నా ప్రియులారా, కొన్నిసార్లు మనం యేసును గురించి విభిన్న దృక్కోణములలో అభిప్రాయమును కలిగియున్నాము. అది ప్రజలు చెప్పిన దానికి ఆధారంగా లేదా మనం వినిన దానికి ఆధారంగా ఉంటుంది. కానీ, ఎటువంటిదియైనను సరే, మీరు రుచి చూచి తెలుసుకొనండి, అప్పుడు ప్రభువు ఎంత మంచివాడో మీరు గుర్తెరుతారు. మేము ఏర్పాటు చేసిన ఒక సదస్సులో కూడా, మా యూత్ కాన్ఫరెన్స్‌లలో, ఒక కూటములో దేవుని నమ్మని ఒక నాస్తికుడైన ఒక యౌవనస్థుడు ఆ సభకు హాజరైయ్యాడు. అన్ని అలవాట్లను కలిగి ఉండి, చాలా విసృతమైన జీవితములో బహుగా నేను ఆనందించుచుండెను. 'నేను విలాసవంతమైన జీవనశైలిని సరదాగా గడుపుతున్నాను కదా. మరియు అన్ని రకాల అలవాట్లలో మునిగిపోతున్నాను అని అతను చెప్పాడు. ఎందుకంటే, దేవుడు ఉన్నాడని నేను ఏ మాత్రము కూడా నమ్మలేదు. కానీ ప్రార్థనా సమయంలో, అతనికి తెలియకుండానే, అతని కళ్ళు చెమ్మగిల్లడం ప్రారంభించాయి మరియు అతని కన్నుల వెంబడి కన్నీళ్లు వచ్చుచుండెను. ఇంకను అతని హృదయం ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని ఒక నూతన అనుభూతితో నింపబడి ఉన్నది. నాకు ఇటువంటి అనుభూతి ఎన్నడు కూడా కలుగలేదు అని అతను ఇలా అన్నాడు, 'నేను ఈరోజే యేసు ప్రేమ గురించి తెలుసుకున్నాను.' నా ప్రియ స్నేహితులారా, యేసు చాలా మంచివాడు. కనుకనే, నేడు ఆయన ఉత్తముడని రుచి చూచి, తెలుసుకొనండి. మీరు ఎన్నటకిని ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోరు. ఇప్పుడు కూడా ఈ అద్భుతమైన యేసును మనము కూడా స్వీకరిద్దామా? ఆయనను మన హృదయములోనికి ఆహ్వానిద్దామా? ఆలాగైతే, ఇప్పుడే మీ హృదయాలను యేసునకు సమర్పించినట్లయితే, ఆయన ప్రేమ మీ హృదయాలను నింపుతుంది. మీరు ఒక నూతన అనుభవములోనికి తీసుకొనిరాబడుతుంది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొని, ఆయనను వెంబడించునట్లుగా మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
మధురమైన ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము విశాల హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము, నిన్ను ఎంతో ఆసక్తిగా వెదకుతూ, నీ హృదయాంతరంగములో నుండి నీ ప్రేమను మాపై కుమ్మరించాలనియు, మేము కోరుకుంటున్న ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. దేవా, నీవు ఉత్తముడవని మేము నిన్ను రుచి చూచునట్లుగా మాలోనికి ఆహ్వానించుచున్నాము. ప్రభువా, నీ మంచితనాన్ని మేము అనుభవించాలనుకుంటున్నాము. దేవా, కొన్నిసార్లు మేము ఇతరుల అభిప్రాయాలను విన్నామని మరియు నీవు నిజంగా ఎవరో అనే మా దృక్పథాన్ని సందేహాలు కప్పివేస్తాయని మేము అంగీకరించుచున్నాము. కానీ ఈ పాత జీవితము ద్వారా కాదు, వ్యక్తిగతమైన నూతన జీవితము ద్వారా ఇప్పుడు, మేము నిన్ను రుచి చూచి తెలుసుకోవాలనుకుంటున్నాము. యేసయ్య, మేము మా హృదయాన్ని నీకు తెరచుచున్నాము, నీవు మాలోనికి వచ్చి, నీ ప్రేమను మాకు బయలుపరచుము. దేవా, నీ సన్నిధి యొక్క మాధుర్యాన్ని మేము సంపూర్ణంగా అనుభవించునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీ మంచితనం యొక్క ఒక్క రుచి చాలు మా జీవితాన్ని మార్చడాని కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్య, నీవు మా రక్షకుడవుగాను, మా స్నేహితుడవుగాను, మా సమస్తము నీవే అని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మాలోనికి వచ్చి, మేము నీ ప్రేమను గుర్తెరుగునట్లుగా కృపను చూపుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.