హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానము వచనమును ధ్యానించడాని కొరకై నేను మరియు క్యేటీ ఇద్దరము కలిసి వచ్చియున్నాము. ఈ వాగ్దాన వచనము ద్వారా, క్యేటీ సాక్షిగా ఉన్నది. గనుకనే, నేను తనను తీసుకొని వచ్చియున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 15:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందు వలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో ను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును'' అని చెప్పబడిన ప్రకారముగానే మీ చేతి పనులన్నిటిని ప్రభువు ఆశీర్వదించుచున్నాడు అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ఏమి చేసినను ప్రభువు నిశ్చయముగా మీ చేతి పనులను దీవిస్తాడు.
నా జీవితములో అది జరగడము మరియు అంతకంటే ఎక్కువగా క్యేటీ జీవితములో అది జరగడము నేను చూచియున్నాను. క్యేటీ, ప్లే స్కూల్ మరియు కిండర్‌గార్డెన్ స్కూల్‌కు వెళ్లుచున్నప్పటి నుండి దేవుని కృపను బట్టి తన చదువులన్నిటిలో కూడా చక్కగా ఉత్తీర్ణురాలవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగియుండుటయే అందుకు కారణము అని నేను నమ్ముచున్నాను. ప్రతిరోజు తను పాఠశాలకు వెళ్లకముందే, ఏమి చేస్తామంటే, క్యేటీ మరియు కుటుంబమంతయు కలిసి ప్రార్థించుకుంటాము. ఆలాగుననే, మేమందరము కలిసి ప్రార్థిస్తాము. ఒకవేళ, నేను మరచిపోయినను సరే, క్యేటీ, 'అమ్మా ఆగు, ప్రార్థన చేయాలని' అని నన్ను పిలుస్తుంది. ఆలాగుననే, రాత్రులు పడుకోవడానికి ముందుగా ఏమి చేస్తాము? కుటుంబముగా కలిసి అందరము కలిసి ప్రార్థిస్తాము. కుటుంబమంతయు లేకపోయినను సరే, తనకు చెడు కలలు రాకుండా తను నాతో ప్రార్థన చేయించుకుంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, యేసయ్యను ఏది అడిగినను, ఆయన ఇస్తాడు అని తను విశ్వసిచండి.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీరు ఏ పని చేయుటకు ముందు మీరు యేసయ్యకు ప్రార్థన చేయండి. ఒకవేళ, నూతన వ్యాపారమును ప్రారంభించడానికి ముందుగా, ఒకవేళ మీరు రచయిత అయితే, గనుక వ్రాయడానికి ముందుగా, ప్రార్థించండి. మీ మనస్సులో ఏదైన ఆలోచన ఉన్నట్లయితే, ముందుగా ప్రభువుతో చెప్పండి. ఆయన నిశ్చయముగా దీవిస్తాడు. బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 15:10వ వచనములో ఈ విధంగా చెప్పబడియున్నది, " నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును'' అని చెప్పబడినట్లుగానే, అవును, విశ్వసించి, ప్రభువు యొద్ద నుండి ఈ ఆశీర్వాదములన్నిటిని పొందుకొనండి. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మీ చేతి పనులన్నిటిని ఆశీర్వదించి, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నేడు మా మీద నీ సన్నిధి దిగివచ్చునట్లుగా కృపను దయచేయుము. యేసయ్య, పరీక్ష వ్రాయుచున్న మా పిల్లలకును మరియు మాకు కూడా మంచి జ్ఞానమును దయచేసి, మా పరీక్షలలో మేము ఉత్తీర్ణులగుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము చేయు పనులన్నిటిలో మేము ఆశీర్వాదమును పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా చేతి పనులన్నిటిని దీవించుము. ప్రభువా, మేము ఏ పనినైనను చేయుటకు ముందుగా మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు మాకు నేర్పించుము. తండ్రీ, మా చేతుల పనిని గూర్చి శ్రద్ధ వహించినందుకు నీకు వందనములు. దేవా, మేము ఏ పని మొదలుపెట్టే ముందైనా ప్రార్థించడం మాకు నేర్పుము. ప్రభువా, మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో నిన్ను నమ్మునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, ప్రయత్నాలన్నిటి మీద నీ ఆశీర్వాదం నిలిచియుండునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతిదినం నీకు భయపడి, నిన్ను వెదకే హృదయాన్ని మాకు దయచేయుము. దేవా, మా ఆలోచనల కు, మా ప్రణాళికలకు, మరియు మేము చేయు పనులన్నిటిని చేయడానికి మమ్మును నడిపించుము. ప్రభువా, నీవు మాకు ముందుగా వెళ్లి, మా యొక్క ప్రతి మార్గాన్ని విజయవంతముగా చేయుము. దేవా, మేము చేసే ప్రతి పని నీకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


