నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మును బట్టి సంతోషించుచున్నాడు కాబట్టి మీ శత్రువులు మీ మీద జయమును పొందలేరు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 41:11వ వచనములో చూచినట్లయితే, "నా శత్రువు నా మీద ఉల్లసింపక యుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను'' అని ఈలాగున చెబుతుంది. అవును, మీ శత్రువులు మీ మీద విజయం పొందలేరు. ఎందుకనగా, దేవుడు మీ పట్ల సంతోషిస్తున్నాడని ఈ వచనము మీకు ఋజువుపరచుచున్నది. కనుకనే, దేవుడు మీ పట్ల ఆనందించుచున్నాడు. కాబట్టి మీరు ప్రభువును స్తుతించండి మరియు ఆయన యందు ఆనందించండి. కారణము, మీరు దేవునికి ఇష్టులై ఉన్నారు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 23:20వ వచనములో చూచినట్లయితే, ప్రభువు ఇలాగున అంటున్నాడు, " ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను'' ప్రకారము మీ శత్రువులందరి మధ్యలో, ఆయన మీ పేరును, మీ కుటుంబాన్ని, మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని, మీ ఇంటిని మరియు మీ ఆస్తిని కాపాడి సంరక్షిస్తాడు. ఇది దేవుడు మీకు అనుగ్రహించుచున్న వాగ్దానమై యున్నది. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు మరియు ఆ దూత దేవుడు మీ కొరకు సిద్ధపరచిన స్థలమునకు మిమ్మును నడిపిస్తాడు. ఏ శత్రువు కూడా దీనిని అడ్డుకోలేదు. దేవుడు మీ పట్ల తాను ఆనందించుచున్నాడని కనుపరచడానికి ఇలాగున జరిగిస్తాడు. యేసు ప్రభువు మీ పట్ల ఎంత ప్రేమను కలిగియున్నాడు కదా!
అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 23:21వ వచనములో చూచినట్లయితే, " ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది'' ప్రకారము ప్రభువు సెలవిచ్చిన దానిని వెంబడించండి మరియు అప్పుడు శత్రువు మిమ్మును జయించలేడు. కనుకనే బైబిల్ నుండి నిర్గమకాండము 23:22వ వచనములో చూచినట్లయితే, " నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును '' అని ఈలాగున చెప్పబడినట్లుగానే, మీరు దేవుని ఆజ్ఞలకు మరియు ఆయన స్వరానికి అవిధేయులైనట్లయితే, బైబిల్ నుండి ఎఫెసీయు లకు 4:30వ వచనములో చూచినట్లయితే, "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు'' ప్రకారము మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచినట్లయితే, నిశ్చయముగా శత్రువులు మిమ్మును జయించెదరు. యూదాను అపవాదియైన శత్రువు జయించినట్లుగా మనము చూడగలము. అందుకే బైబిల్ నుండి యోహాను 13:1 వ వచనములో చూచినట్లయితే, "తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే యెరిగినవాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను. యేసు తన శిష్యులను ప్రేమించాడు మరియు యూదాను కూడా ప్రేమించాడు. చివరిరాత్రి భోజనమున యేసుక్రీస్తునకు సమస్త అధికారం ఇవ్వబడినది. యూదా తనను అప్పగిస్తాడని ఎరిగియున్నప్పటికిని, ఆయన తన పాదాలను కడిగి, రొట్టె విరిచి, ఇలాగున చెప్పెను: " పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.'' అయితే, యూదా యేసు శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను విరిచి అతనికి ఇచ్చినప్పుడు, అతడు దానిని పుచ్చుకున్నప్పుడు, సాతాను అతనిలోనికి ప్రవేశించెను. అయినప్పటికిని, యేసును ముప్పది వెండి నాణెముల కొరకు తనను అప్పగించడానికి అతడిని పంపాడు. యేసును బంధించ డానికి యూదా సైనికులను తీసుకువచ్చినప్పుడు, అతను ఆయనను ముద్దు పెట్టుకొని, ఆయనను అప్పగించాడు. అయితే, యేసు, యూదాను చూచి, ' చెలికాడా' అని పిలిచాడు. యూదా, 'నేను నీ శత్రువుని' అని అన్నాడు, కానీ యేసు మాత్రము, 'స్నేహితుడా' అని పిలిచాడు. తద్వారా, యేసు అతనిని జయించాడు.
నా ప్రియులారా, అటుపిమ్మట, యేసు శ్రమలన్నిటిని భరించి, సిలువకు వెళ్లి, ప్రవచనాలన్నింటిని నెరవేర్చుట కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మూడవ దినము, ఆయన పునరుత్థానుడై సజీవుడుగా, మరణమును జయించి తిరిగి లేచెను! అయితే యూదా ఉరి పెట్టుకొని చనిపోయెను. అవును, యేసు తన తండ్రిని సంతోషపరచినందు వలన తన శత్రువును జయించాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ' నా స్వరమునకు విధేయత చూపుతూ, నా ఆజ్ఞను గైకొనుట ద్వారా నన్ను సంతోషపరచవలెను. ' యేసు స్వరం ఏమని చెబుతుంది? అని మనము లూకా 6:27వ వచనములో చూచినట్లయితే, " వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారి కొరకు ప్రార్థన చేయుడి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము. నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవు వాని యొద్ద దాని మరల అడుగవద్దు. మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి'' అని సెలవిచ్చెను. అందుకే బైబిల్ నుండి సామెతలు 24:17వ వచనములో చూచినట్లయితే, " నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము'' మరియు రోమీయులకు 12:20వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుట వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము'' అని చెప్పబడిన ప్రకారము మీ శత్రువులను ప్రేమించండి. ఎందుకంటే, ఇదే ప్రభువైన యేసు చూపిన మార్గం. ఆ మార్గములో మీరు నడిచినప్పుడు యేసు మీ యొక్క శత్రువులందరి మీద మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మరియు ఆయన మీ పట్ల ఆనందించుచున్నాడని లోకానికి మిమ్మును ప్రత్యక్షపరుస్తాడు. నా ప్రియులారా, నేడు దేవుడు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించును గాక మరియు మనం దేవుని ప్రేమతో, లక్షలాది మంది ప్రేమతో, చివరికి మీరు శత్రువుల ప్రేమను కూడా, యేసువలె జయించువానికంటే అత్యధికమైన విజయమును పొందుకొనువారుగా ఉందురు గాక. మీరు ఎన్నటికిని ఓడిపోరు; మీరు ఎల్లప్పుడూ తలగానే ఉంటారు కానీ, తోకగా ఉండరు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా నీవు ఆనందించుచున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, నీ కృపచేత మమ్మును ఆవరించినందుకై మరియు మా పట్ల నీ ప్రేమను కనుపరచినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ దక్షిణ హస్తము మా మీద ఉంచి, మమ్మును సమస్త కీడు నుండి కాపాడుము, ఏ శత్రువు కూడా మా మీద విజయమును పొందుకుండా చేయుము. యేసయ్యా, మా అడుగుజాడలను కాపాడటానికి నీ దేవదూతలను మాకు ముందుగా పంపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి క్షణంలోనూ నీ స్వరాన్ని మేము వెంబడించడానికి మాకు అటువంటి కృపను దయచేసి, మా హృదయాన్ని మృదువుగా మార్చుము. పరిశుద్ధాత్మ దేవా, మేము నిన్ను ఎన్నడు కూడా దుఃఖపరచకుండా నీ ఆనందంలో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు జరిగించినట్లుగానే, మా శత్రువులను ప్రేమించి, కీడును మేలుతో జయించుటకు మాకు నేర్పుము. ప్రభువా, మా హృదయమును ఇతరులకు ప్రతిబింబించునట్లుగా మమ్మును నీ ప్రేమతో నింపుము. దేవా, మా జీవితం ద్వారా నీకు ఆనందాన్ని కలిగించునట్లుగాను మరియు నీ కృప మా శత్రువును జయించునట్లుగా అత్యధికమైన విజయమును మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


