నా ప్రశస్తమైన వారలారా, ఈ నూతన మాసములో ప్రభువు మీ కొరుక విమోచన సమయమును ప్రకటించుచున్నాడు. అనేకమంది కనిపించని సంకెళ్లతో బంధించబడియుంటారు. అది సాధారణంగా, మనలో భయం, నిరాశ, దుర్‌వ్యసనాలు, అనారోగ్యం మరియు నిరాశ మొదలైనవి ఈలాగున ఎన్నో ఉండవచ్చును. తన కుమారుడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత అకస్మాత్తుగా తీవ్ర నిరాశలో కూరుకుపోయినందుకు ఒక తండ్రి ఏడ్వడం నాకు గుర్తుకు వచ్చినది. అతను తన గదిలోనే తలుపు మూసుకుని, నా పని అయిపోయింది. నేను ఇక్కడే చనిపోతాను అని అనుకున్నాడు. అదే బానిసత్వం. కానీ ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చి బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరినీ విడిపించాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 8:32వ వచనములోని ఆయన మాటలు శక్తితో మోగుతున్నాయి: "అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా'' ఈ సత్యం ఏమిటి? ఎవరు? ఇది ఒక తత్వశాస్త్రం లేదా నియమం కాదు - ఇది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? అని మనము చూచినట్లయితే, యేసు తానే ఇలాగున అంటున్నాడు, " యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన మీ సత్యంగా మారతాడు. ఆయన మీ భవిష్యత్తుకు ద్వారములను తెరుస్తాడు, మీకు జీవమును ఇస్తాడు మరియు శత్రువు యొక్క ప్రతి అబద్ధాన్ని తొలగిస్తాడు. ఆయన పిలాతు ఎదుట నిలబడి, తాను సత్యానికి రాజు అని ధైర్యంగా ప్రకటించాడు. "అందుకు పిలాతు-నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు-నీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యా లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను'' అని చెప్పెను. అవును, సిలువపై, ఆయన ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి బంధకాన్ని మోసి తీర్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థతను పొందుకున్నారు మరియు ఆయన రక్తం ద్వారా మీరు శుద్ధి చేయబడ్డారు. కనుకనే, నేడు మీరు, "ప్రభువా, మా జీవితాన్ని నీ స్వాధీనం చేసుకో, మిగిలినవన్నియు అసత్యము'' అని మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన సత్యం మీలోనికి ప్రవేశిస్తుంది మరియు ఆయన మీ ఆత్మకు సమాధానమును, విశ్రాంతి మరియు విడుదలను తీసుకొని వస్తుంది.
నా ప్రియులారా, యేసు మనలను క్షమించడమే కాదు, మనలను శుద్ధి చేసి స్వస్థపరుస్తాడు కూడా. ఇంకను బైబిల్ నుండి 1 యోహాను 1:7వ వచనములో ఇలాగున చెబుతుంది, " ...అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.'' అవును, ఏ ఔషధం, ఏ ఆచారం, ఏ మానవ ప్రయత్నం పాపాన్ని కడిగివేయలేవు; యేసు రక్తం మాత్రమే పాపాన్ని కడిగివేయగలదు. కనుకనే, హెబ్రీయులకు 9:22వ వచనములో చూచినట్లయితే, "రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు'' మనకు గుర్తు చేయుచున్నది. అందుకే దేవుడు స్వయంగా యేసు రూపంలో మానవునిగా ఈ లోకమునకు వచ్చి, తనను తాను పవిత్రపరచుకొని, మనకోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఇంకను విశ్వాసం ద్వారా, మీరు ఆయనను స్వీకరించినప్పుడు, మీరు పరిశుద్ధపరచబడతారు మరియు నీతిమంతులుగా తీర్చబడతారు (1 కొరింథీయులకు 6:11). మరియు ఆయన పొందిన గాయాల ద్వారా, మనలోనికి స్వస్థత ప్రవహిస్తుంది. అందుకే బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో ఈలాగున ప్రకటించుచున్నది, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడిన ప్రకారం ఆయన పునరుత్థానం తరువాత, యేసు తాను పొందిన గాయాలను చూపించాడు-అవి నేటికిని స్వస్థతను తీసుకురావడానికి ఇంకా సజీవంగా ఉన్నవి. ఈ గొప్ప శక్తికి అనేకమంది సాక్ష్యమిచ్చుచున్నారు. హర్యానాకు చెందిన సాధురామ్ అనే సోదరి వివాహం చేసుకున్నారు. కానీ, ఆమె భర్త 20 ఏళ్లుగా మద్యపానానికి బానిసైన కారణంగా ఆమె తీవ్రంగా బాధపడెను. ఇంకను అతని కాలేయం పాడైనందున వైద్యులు అతని మీద ఆశలు వదులుకున్నారు. కానీ, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురంలో జరిగించిన ప్రార్థనల ద్వారా, ఆమె హృదయంలో విశ్వాసం వృద్ధి పొందింది. ఆమె భర్త మీద చేతులు ఉంచబడ్డాయి మరియు యేసు అతనిని సంపూర్ణంగా విడిపించాడు. అతని ఆరోగ్యం బాగుపడింది, వారి కుటుంబ జీవితం మారిపోయింది మరియు నేడు వారు దేవుని పరిచర్యలో భాగస్థులుగా ఉన్నారు, వ్యాపారంలో కూడా వర్ధిల్లుతున్నారు. నిజంగా, యేసుక్రీస్తు పరిశుద్ధపరచబడే, స్వస్థపరచే మరియు వర్ధిల్లింపజేయు సత్యమై యున్నాడు.
నా ప్రియమైన స్నేహితులారా, అదే ప్రభువు ఇప్పుడు నేడు మీతో కూడా ఉన్నాడు. మీరు నమ్మినట్లుగా, ప్రతి బంధకము మీ నుండి తొలగిపోతుంది. ప్రతి అనారోగ్యం మీ నుండి తొలగింపబడుతుంది. యేసు నామంలో గర్భాలు తెరవబడతాయి, వ్యాధులు నయమవుతాయి మరియు అవయవాలు పునరుద్ధరించబడతాయి. ఇప్పటివరకు సాతాను దొంగిలించినది తిరిగి మీకు అనుగ్రహింపబడుతుంది. అవి- బలము, సమాధానము, ఆనందము మళ్లీ మీ యొద్దకు వస్తాయి. మీరు ఆయనను అంగీకరించండి, అప్పుడు దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది (2 కొరింథీయులకు 3:17-18). అప్పుడు మీరు ఆయన స్వరూపంగా రూపాంతరం చెందుతారు, ఆయన ఆలయంగా మార్చబడతారు (1 కొరింథీయులకు 6:19), మరియు ఆయన అధికారంలో నడిచెదరు (మార్కు 16:17). ఈ నూతన మాసము మీకు సంపూర్ణమైన విమోచన నెలగా ఉండబోవుచున్నది. అదే సమయంలో, నా ప్రియులారా, మన యేసు పిలుచుచున్నాడు టెలిఫోన్ ప్రార్థనా గోపుర పరిచర్య కొరకు ప్రార్థనలో నాతో కూడా భాగస్థులు కావాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రతి నెలా, తొమ్మిది భాషలలో ప్రార్థన కొరకు దాదాపు 5 లక్షల కాల్స్ వస్తున్నాయి, 360 మంది శిక్షణ పొందిన ప్రార్థన యోధులు పగలు మరియు రాత్రి ప్రార్థించి, జవాబును అందించుచున్నారు. ఈ సేవలన్నియు కూడా ఉచితం, కానీ అవసరతలు ఎన్నో ఉన్నాయి - పెరుగుతున్న కాల్స్‌కు జవాబులు ఇవ్వడానికి సిబ్బంది, సాంకేతికత మరియు ఫాలో-అప్ విస్తరించబడాలి. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థించి మాతో నిలబడినప్పుడు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు అనేకులకు విమోచన మార్గంగా మిమ్మల్ని మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మమ్మును విడిపించే సత్యంగా నీవు ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, ప్రతి పాపం నుండి మమ్మును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి బంధకమును, శాపాన్ని మరియు పాపాన్ని, దుర్‌వ్యసనాన్ని తొలగించుము. యేసయ్యా, నీవు పొందిన గాయముల ద్వారా మా శరీరం, జీవమును మరియు ఆత్మను స్వస్థపరచుము. దేవా, మా కుటుంబాన్ని పునరుద్ధరించుము మరియు మా యొక్క మరియు మా ప్రియుల భవిష్యత్తును వృద్ధిపరచుము. యేసయ్యా, మమ్మును నీ ఆత్మతో నింపుము మరియు మాకు సమాధానమును దయచేయుము. దేవా, మమ్మును అనుదినము నీ స్వరూపంలోనికి మార్చుము. ప్రభువా, బంధించబడిన ఇతరులకు మమ్మును ఆశీర్వాదకరంగా మార్చుము. దేవా, మేము నీ యొక్క విడుదలను పొందుకొని, నీలో ఆనందించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, ఈ నూతన మాసమంతయు మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.