నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 111:2వ వచనమును నేడు మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, " యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగల వారందరు వాటిని విచారించుదురు'' ప్రకారము దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఆయనను ఆరాధిస్తూ, 'ప్రభువా, నీవు ఎంతో మహోన్నతుడవు' అని చెబుతూ ఉంటాము కదా! ఆయన చేసిన గొప్పతనమును బట్టి, మనము ఆయనను స్తుతిస్తూ ఉంటాము. మనము ఆయనను స్తుతించినప్పుడు, అద్భుతాలు మన జీవితాలలో జరుగుతాయి. అందుకే బైబిల్ నుండి యోబు 5:9వ వచనమును చూచినట్లయితే, " ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు'' ప్రకారము అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మన జీవితములో చేసిన అద్భుతకార్యములను మనము తలంచుచు, ఆనందించేవారముగా ఉండాలి. అందు కే బైబిల్ నుండి కీర్తనలు 77:11 వచనములో చూచినట్లయితే, " యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును '' ప్రకారము మన పట్ల చేసిన ఆశ్చర్యకార్యములను మనము మన మనస్సునకు తెచ్చుకొనవలెనని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది.
నా ప్రియులారా, ప్రతి సంవత్సరము అంతమున నా భర్తగారు మా కుటుంబ సభ్యులందరిని ఒక్కటిగా సమకూర్చి, దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి స్తుతిస్తూ, ఆయన వాక్యమును ధ్యానిస్తాము. కుటుంబ ప్రార్థన సమయములో ఆ సంవత్సరములో జరిగించిన అద్భుతాలలో ఒక్కటైనను సాక్ష్యముగా పంచుకోవాలని ప్రతి కుటుంబ సభ్యులను అడుగుతారు. అయితే, మేము సాక్ష్యములను చెబుతూనే ఉంటాము. ప్రభువు మా జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను చేసియుంటాడు. కనుకనే, ప్రతి ఒక్కరము కూడా ప్రభువు చేసిన కార్యములను ఇతరులతో పంచుకుంటూ ఉంటాము. ఆ విషయాలను గురించి తలంచుచూ ప్రభువును స్తుతిస్తూ ఉంటాము. అది ఎంత ఆనందకరమైన సమయము కదా!
ఆలాగుననే, సహోదరులు కోటీశ్వర రావు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. తన భార్య పేరు ప్రియాంక. 2016వ సంవత్సరములలో వారికి వివాహము జరిగినది. వారి జీవితము చక్కగా సాగిపోవుచుండెను. అయితే, సంవత్సరములు గడిచిన కొలది ఆమె గర్భమును ధరించుట లేదు. 9 సంవత్సరములు ఆమె బిడ్డలు లేకుండా ఉండెను. కనునకే, వారు వైద్యుల యొద్దకు వెళ్లి, వారిని సంప్రదించారు. అయితే, వారి ప్రయత్నములన్నియు కూడా విఫలమయ్యాయి. వారిద్దరు కూడా అనేక విమర్శలను, శోధనలు, అవమానములను ఎదుర్కొన్నారు. తద్వారా, వారిద్ధరి హృదయములు విరిగిపోయి, నిరుత్సాహములోనికి వెళ్లిపోయారు. అయితే, ప్రతిరోజు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన కార్యక్రమములను వారు వీక్షించేవారు. ఆ కార్యక్రమములో ప్రసారమగుచున్న వర్తమానములు మరియు ఆ ప్రార్థనలు వారికి ఎంతగానో ఆదరణను కలుగజేయుచుండినవి. అటువంటి పరిస్థితులలో ఒకరోజు వారు ఐవిఎఫ్ చికిత్సను పొందుకోవాలని తీర్మానించుకున్నారు. గర్భసంచిని పరీక్షించడానికి వారు ఆమెకు సాధారణమైనటువంటి మందులను ఇచ్చియున్నారు. కానీ, 20 రోజులు గడిచిపోయినవి. 2024వ సంవత్సరమున,డిసెంబర్ 20వ తేదిన, వారు యేసు పిలుచుచున్నాడు టెలివిజన్ కార్యక్రమమును చూచియున్నారు. ఆ కార్యక్రమములో, గర్భఫలము లేనటువంటి వారిని గురించి నా భర్త ప్రార్థన చేయుచుండెను. ఈ దంపతులు కూడా ఎంతో విశ్వాసముతో మా భర్తగారితో కలిసి ప్రార్థించారు. ఆమె భర్త తన భార్య యొక్క గర్భము మీద చేతిని ఉంచి, విశ్వాసముతో ప్రార్థించారు. వెంటనే, అద్భుతము జరిగినది. 22వ తేదీన గర్భ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నప్పుడు, అది వారికి పాజిటివ్‌గా వచ్చింది. అది కేవలము దేవుడు చేసిన అద్భుతమై యున్నది. నా భర్తగారు చేసినటువంటి ప్రార్థనలు వారి జీవితములో అద్భుతములను చేకూర్చి యున్నవని నమ్ముచున్నాను. చూడండి, 9 సంవత్సరములుగా ఉన్న వారి కన్నీటిని ప్రభువు తుడిచివేసియున్నాడు. వారికి అనుకూల రిపోర్టు వచ్చిన తర్వాత, మొదటిగా జన్మించిన బిడ్డని దేవుని పరిచర్య నిమిత్తము సమర్పించుకోవాలని వారు నిర్ణయము తీసుకొని యున్నారు. ప్రభువు కొరకు వారు ఎంత ప్రేమను కలిగియున్నారు కదా! నా ప్రియులారా, నేడు మీ కొరకు కూడా అటువంటి అద్భుతమును ప్రభువు జరిగిస్తాడు. " యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగల వారందరు వాటిని విచారించుదురు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీ జీవితములో కూడా గొప్ప కార్యములను జరిగించును గాక. ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము నుండి ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము ఈ సంవత్సరాంతమునకు వచ్చియుండగా, మా జీవితములో కూడా అద్భుతములను జరిగించుము. దేవా, సంతానములేని, మాకును మరియు మా ప్రియులైన వారు కూడా అద్భుత రీతిగా గర్భము ధరించునట్లుగా చేయుము. ప్రభువా, మాకొక చక్కటి బిడ్డను దయచేసి, మా యొక్క అవమానమును తొలగించుము. దేవా, మేము అవమానమును ఎదుర్కొన్న అదే స్థలములో మాకు ఘనతను మరియు రెట్టింపు ఆశీర్వాదమును దయచేయుము. ప్రభువా, మేము చేయు ప్రతి ప్రయత్నములలో మాకు విజయమును దయచేసి, ఉన్నత శిఖరములకు మమ్మును ఎక్కించి, మా భవిష్యత్తును దీవించుము. ప్రభువా, మా జీవితములో అద్భుత కార్యములను ఇప్పుడే జరిగించుము. తండ్రీ, మా జీవితంలో నీవు చేసిన గొప్ప మరియు అద్భుతమైన కార్యాలకు మేము నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. దేవా, నీవు లెక్కలేనన్ని అద్భుతాలు చేయగల ఆశ్చర్యకరుడవు. ప్రభువా, మా జీవితంలో నీవు చేసినవన్నియు గుర్తుంచుకోవడానికి మరియు ధ్యానించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఎదురు చూస్తున్న మా నిరీక్షణ సమయము మరియు మా కన్నీళ్లను ఆనందకరమైన సాక్ష్యాలుగా మార్చుము. ప్రభువా, మేము నీ కార్యములను గురించి ఆనందించుచున్నప్పుడు ప్రతిరోజు మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మేము నీ మంచితనమును ధ్యానించినప్పుడు మరియు నిన్ను స్తుతించినప్పుడు, మా జీవితంలో గొప్ప అద్భుతాలను చేయుము. ప్రభువా, మా జీవితం ఎల్లప్పుడు నీ గొప్పతనమును ప్రకటించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


