నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి నా శుభములు. ఈ రోజు మనము బైబిల్ నుండి ధ్యానించడానికి, కీర్తనలు 148:14వ వచనమును ఒక అద్భుతమైన వాగ్దానముగా మన కొరకు ఇచ్చియున్నాడు. ఆ వచనము, " ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి '' ప్రకారము ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులను ఆయన హెచ్చిస్తాడు. ఆలాగుననే, బైబిల్ నుండి 1 సమూయేలు 2:1వ వచనములో చూచినట్లయితే, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించెను. ఆ వచనము, "మరియు హన్నా విజ్ఞాపనచేసి యాలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెను నీ వలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును'' ప్రకారము హన్నా, తను ఒక బిడ్డ నిమిత్తము ప్రభువు యెదుట ప్రార్థన చేసినది. తను ప్రార్థన చేసి, ఈ విధంగా అనెను, 'నా మనవిని ప్రభువు అంగీకరించియున్నాడు కనుకనే, నా హృదయము ప్రభువునందు సంతోషించుచున్నది, నాకు మహా బలము కలిగెను ' అని చెప్పెను. కనుకనే, ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు చెంత నుండి మీరు ఏదైన దీవెనల కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే, మిమ్మును మీరు తగ్గించుకొని, ప్రభువు వైపు చూడండి. మీరు ప్రభువుకు ప్రార్థన చేయండి. ప్రభువు నిశ్చయముగా మీ మొఱ్ఱలను ఆలకించి, మీకు జవాబును ఇచ్చి, తన దీవెనలన్నిటిని మీ మీద కుమ్మరిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 89:17వ వచనములో చూచినట్లయిట్లయితే, "వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము అవును, దేవుని దయచేతనే మన కొమ్ము హెచ్చింపబడుతుంది. ఇది దేవుని యొక్క వాగ్దానమై యున్నది.

నా ప్రియులారా, కనుకనే, మనము ప్రభువు వైపు చూడాలి, ఆయనను గట్టిగా హత్తుకొని, ఈలాగున చెప్పాలి, "ప్రభువా, నీవు మమ్మును దీవించనిదే మేము ఎక్కడకు వెళ్లెదమయ్యా?'' అని ఆయనకు విజ్ఞాపనము చేయండి. దేవుని భక్తులందరు ఆలాగుననే ప్రార్థించారు. వారు అడిగిన దానికంటె మరియు వారికి కావలసిన దానికంటె ఎక్కువగా, ఆయన వారికి అనుగ్రహించియున్నాడు. అంతమాత్రమే కాదు, వారికి కావలసిన దానికంటె ఎక్కువగా వారికి ఇచ్చి, ప్రభువు వారిని ఆశీర్వదించాడు. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 132:17వ వచనములో చూచినట్లయితే, "అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచియున్నాను'' అని ప్రభువు అంటున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు, మనము అనేక దీవెనలను పొందుకుంటాము. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 148:14వ వచనములో చూచినట్లయితే, "ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి'' ప్రకారము ఆయన తన ప్రజలను నిశ్చయంగా ఉన్నతంగా ఎదుగునట్లుగా చేస్తాడు మరియు వారిని ఆయన తన ప్రజలని పిలుచుచున్నాడు.

నా జీవితములో చూచినట్లయితే, నేను బిడ్డలు లేకుండా ఉన్నాను. ఇద్దరు బిడ్డలను నేను కోల్పోయాను. అనేకసార్లు నేను ఈ సాక్ష్యమును మీతో పంచుకున్నాను. ప్రజలు నన్ను చూచి హేళన చేశారు. నీవు ఎంతగానో ప్రార్థన చేస్తావు కదా! నీవు ఎందుకు బిడ్డలను కోల్పోయావు? అని అన్నారు. కానీ, అదే లోకమండి. కానీ, మేము ప్రభువును గట్టిగా హత్తుకొనియున్నాము. మేము ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ప్రభువు అద్భుతమైన ఇద్దరు బిడ్డలతో మమ్మును దీవించాడు, చూడండి. ఈ రోజు ప్రభువు నా కుమారుని ఎంతగా ప్రభువు వాడుకుంటున్నాడు కదా! ఈ రోజు మీరు అదేవిధంగా వాడబడతారు నా ప్రియ స్నేహితులారా, ప్రభువును గట్టిగా హత్తుకొని ఉండండి. ప్రభువు మిమ్మును ఉన్నత శిఖరములకు లేవనెత్తుతాడు. కనుకనే, మీరు ఇప్పుడే దేవుని వైపు చూడండి. ప్రభువుకు మొఱ్ఱపెట్టండి, ఆయనను గట్టిగా హత్తుకొని, ఆయనకు వందనాలు చెల్లించినట్లయితే, ప్రభువు మీ కొమ్ములను హెచ్చిస్తాడు. దీవెనకరమైన రీతిలో మీరు ఈ రోజు అన్నిటిని పొందుకుంటారు. కనుకనే, నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు. యేసయ్యా, అన్నిటికంటె అత్యధికముగా మా కొరకు నీవు ఆ సిలువలో నీ ప్రాణమును అర్పించావు. కనుకనే, నీ సిలువ చాటున మమ్మును మరుగుపరచుకొనుము. దేవా, నీవు ఇచ్చిన రక్షణ ద్వారా, నీవు మాకిచ్చిన దీవెనలన్నిటి కొరకై నీకు వందనాలు. తండ్రీ, మా విన్నపములన్నిటిని అంగీకరించుము. ప్రియమైన ప్రభువా, మా బలముగాను, మా ఆశీర్వాద కొమ్ము గాను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. దేవా, మా జీవితానికి మహిమయు, మా తల ఎత్తువానివియు నీవే. ప్రభువు కనుకనే, నిన్ను మాత్రమే హత్తుకొని ఉండుటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, దయచేసి మా మొరను వినుము, నీవు హన్నాను జ్ఞాపకము చేసుకున్నట్లుగానే మా విన్నపములను జ్ఞాపకముంచుకొనుము. దేవా, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మును అభిషేకించుము మరియు నీ కృప మమ్మును ఉన్నతంగా హెచ్చించునట్లుగా చేయుము. ప్రభువా, మా నిరీక్షణ కాలమును సంతోషముగాను, మా దుఃఖమును స్తుతి గీతములుగాను మార్చుము. నీ వెలుగును మా మీద ప్రకాశింపజేయుము మరియు మా జీవితమునకు దీపమును సిద్ధపరచుము. దేవా, మా జీవిత సాక్ష్యము నీ పరిశుద్ధ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేము మా జీవితాన్ని, మా ఆశలను మరియు మా భవిష్యత్తును నీ ప్రేమగల హస్తములకు అప్పగించుకొనుచున్నాము. దేవా, ఈ రోజు హన్నా వలె మా విజ్ఞాపనమును ఆలకించి, మా ప్రార్థనకు జవాబును దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.