నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 33:29వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు’’ అని చెప్పబడిన ప్రకారము మీరు ధన్యులై ఉన్నారు. మీ వంటివారెవరు, మీరు దేవుని ద్వారా రక్షించబడిన జనులై యున్నారు. కనుకనే, మీరు ప్రభువు ద్వారా రక్షించబడియున్నారు. ఇంకను మీరు ప్రభువు ద్వారా రక్షింపబడెదరు. లోకము మిమ్మును నాశనము చేయడానికి ప్రయత్నము చేసియుండవచ్చును. కానీ, మిమ్మును దేవుడు రక్షించును. లోకము ఏమంటుందంటే, ‘ఈ వ్యక్తివంటి వారు ఇంక ఎవ్వరైన ఉన్నారా?’ దేవునికి దేవుళ్లైన వాని చేత వీరు ఆశీర్వదించబడియున్నారు. ఈమె ప్రభువులకు ప్రభువులచేత ఆశీర్వదింపబడియున్నది. మీరు గొప్పగా ఘనత వహిస్తారు. ఎందుకనగా, ప్రభువు మిమ్మును రక్షించియున్నాడు. ఇంకను మిమ్మును రక్షించును. మొదటగా, దేవుడు నోవహును రక్షించియున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము  6:9వ వచనములో చూచినట్లయితే, ‘‘నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు’’ అని చెప్పబడిన ప్రకారము అతడు నీతిమంతుడు, నిందారహితుడు, అతడు దేవునితో కూడా నడిచిన వ్యక్తి. అందరు అతనిని విమర్శించినను సరే, అతని చుట్టు ఉన్నవారు పాపములో జీవించుచున్నను సరే, అతడు మరియు అతని కుటుంబము దేవుని యెదుట మరియు నరుల యెదుట  నిందారహితులుగా వారు జీవించియున్నారు. అతడు నీతిమంతుడు, అతడు దేవుని చిత్తమును జరిగించియున్నాడు. దేవుడు అతనిని ఓడను నిర్మాణము చేయమని సెలవిచ్చినప్పుడు, ఏమి లేకపోయినను సరే, అతడు ఓడను నిర్మించియున్నాడు. అతడు దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. దేవుని జ్ఞానము చేత, దేవుని ప్రత్యక్షతచేత అతడు ముందుకు సాగి వెళ్లియున్నాడు. అందరు అతనిని ప్రశ్నలు వేసియుండవచ్చును. కానీ, ‘దేవుడు కోరుకున్నాడు. అందుచేతనే, ఈ ఓడను నిర్మాణము చేస్తున్నాను’ అని చెప్పియుంటాడు. అతడు నీతిమంతుడు, నిందారహితుడు. అందుచేతనే, జలప్రళయము సమయములో దేవుడు అతనిని రక్షించియున్నాడు. 

అవును, ఆ రీతిగానే  మేము కారుణ్యాను నిర్మాణము చేసియున్నాము. విశ్వవిద్యాలయమును నిర్మాణము చేయుమని దేవుడు మా తండ్రిగారితో మాట్లాడియున్నాడు. మాకు కావలసినంత ధనము లేనప్పుడు, అప్పటికే మా యింటికి సంబంధించిన మా యొక్క జీవితములో ఉన్న ఋణముల మధ్యలో ఉన్నప్పుడు కూడా, ఆలాగుననే, పాతదైనా, మరొకరు వినియోగించిన కారును మేము వాడుచున్నప్పుడు కూడా, ఇంకను మా వ్యక్తిగత ఋణముల మధ్యలో కూడా దేవుడు విశ్వవిద్యాలయమును నిర్మాణము చేయుమని చెప్పాడు. ఆయన దానిని ప్రకటించియున్నప్పుడు, ఆయన యొక్క మూత్రపిండాలు పాడైపోయినవి. మా చెల్లెలు ఏంజల్ ఘోరమైన ఒక కారు ప్రమాదములో చనిపోయినది. దేవుడు కోరుకున్న కార్యమును జరిగించడానికి ఇక మార్గమే లేదు. మా హృదయములు బ్రద్ధలైపోయాయి. మేము ఇక ఎందుకు జీవించాలి అనుకున్నాము. మేము ధైర్యమును కోల్పోయాము. అంతమాత్రమే కాదు, విశ్వాసమును కోల్పోయాము. మాకు మేము నాశనమైపోయివారముగా ఉండినట్లుగా ఉన్నాము. ఏలాగున పైకి లేచి కారుణ్యాను నిర్మాణము చేయగలము? కానీ, ఆ సమయములో దేవుడు మా నాన్నగారికి నూతనమైన మూత్రపిండమును ఇచ్చాడు. యేసు ప్రత్యక్షమయ్యాడు, ‘నా బిడ్డలారా, నేను సాతానుకు సవాలు విసిరియున్నాను, దూతలకు సవాలు విసిరియున్నాను, ఇంత శ్రమలలోను, ఇంత ఆవేదనలలోను కూడా నా బిడ్డలు నన్ను పడిపోనివ్వరు అని సవాలు విసిరాను. మీరు నన్ను క్రిందపడిపోవునట్లుగా చేస్తారా? ’ అని చెప్పారు. మనలను బలపరచు పరిశుద్ధాత్ముడు మాలో నుండి ఆ రీతిగా పైకి లేచాడు. అప్పుడు, మేము ఈలాగున చెప్పాము, ‘ ప్రభువా, మేము ఎక్కడికి వెళ్లిపోగలము, మేము గనుక నిన్ను తృణీకరించినట్లయితే, మేము పరలోకమును చేరుకోవాలి కదా! కనుకనే, మమ్మును కనికరించుము, మమ్మును కనికరించుము, ప్రభువా, మేము నీలో నిలిచియుండుటకు మాకు కావలసిన బలమును అనుగ్రహించుము’’ అని చెప్పాము. 

నా ప్రియులారా, లోకము మమ్మును అపహాస్యము చేయుచున్న సమయములో కూడా,  అయితే, రెండు క్రైస్తవ పత్రికలు ఏమని వ్రాసియున్నవనగా, ‘చూడండి, ఆయనను కారుణ్య విశ్వవిద్యాలయమును నిర్మాణము చేయమని చెప్పాడంటా, ఒక విశ్వవిద్యాలయముగా అతడు దానిని ప్రారంభించాడు, అతని కుమార్తెను చంపివేశాడు. అతడు సరైన ప్రవక్త కాదు, అతనిని వెంబడించకండి అని వ్రాశారు.’ కానీ, వీటన్నిటితో పాటుగా మేము దేవుని యందు దృఢంగా నిలిచాము. పరిశుద్ధాత్ముడు మమ్మును బలపరచాడు. దుష్టప్రజల అపహాస్యమును వినడముకంటే, దేవునికి విధేయులై ముందుకు వెళ్లడము మంచిదని మేము భావించి, ఆలాగున ముందుకు సాగి వెళ్లాము. ఈ రోజు కారుణ్య, వేల వేల మందికి ఆశీర్వాదకరమైనదిగా నిలిచియున్నది. కారుణ్య పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తముగా అనేక వేలమందికి ఆశీర్వాదకరముగా ఉండియున్నారు. కేవలము వారు ఉన్నత స్థలములలో ఉండుట మాత్రమే కాదు,  దేవుని ప్రేమతో ప్రజలకు సేవలందించడానికి వారు ఉన్నతమైన స్థానములో ఉండియున్నారు. ఇది దేవుడు మాకు అనుగ్రహించియున్న అత్యంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. మా యొద్ద పట్టబద్రులై యున్నవారు అత్యంత విభిన్నమైన వారుగా ఉన్నారు. దేవుని స్వభావముతో వారు పెంపొందింపజేయుచున్నారు. అవును, నా ప్రియ స్నేహితులారా, అత్యంత ప్రతికూలమైన పరిస్థితులలో కూడా మేము కారుణ్యను నిర్మాణము చేసియున్నాము. ఈ రోజున అది నిర్మించి, 40 సంవత్సరములు. దేవుడు మమ్మును భద్రపరచియున్నాడు. కుటుంబమును, మా యొక్క పేరును మరియు పరిచర్యను, కారుణ్యను భద్రపరచియున్నాడు. మా మీద అన్యాయమైన నిందారోపణలు వచ్చియున్నవి. ఉన్నత స్థలముల నుండి అధికారపు శక్తులు, కారుణ్యాను నాశనము చేయడానికి మాకు విరుద్ధముగా వచ్చియున్నాయి. కానీ, దేవుడు వర్థిల్లియున్నాడు, మాకు న్యాయమైన పేరును అనుగ్రహించియున్నాడు. నేడు కారుణ్య ఆయన మహిమ కొరకు నిలిచియున్నది.  నా ప్రియులారా, మీ జీవితము, మీ కుటుంబము నిలిచియుంటుంది. అత్యంత ఘోరమైన దాడులలో కూడా మీరు దేవుని న్యాయము నిమిత్తము ఆ రీతిగా మీరు ఆయన కొరకు నిలిచియున్నప్పుడు, అత్యంత గొప్ప దాడుల మధ్య కూడా, బలముగా నిలబడి ఉండండి. దేవుడు మీ నిమిత్తము, మీ పక్షమున నిలువబడియుంటాడు. అందుకే ప్రభువు, ‘నిన్ను పోలినవాడెవడు?’ అని చెబుతున్నాడు. కనుకనే, మీరు దేవునిచేత దీవించబడియున్నారు. ఆయన మిమ్మును చూచి, ‘నేను మిమ్మును రక్షించియున్నాను’ అని చెబుతున్నాడు. కనుకనే, మీరు భయపడకండి, మీ అపహాస్యముల మధ్యలో కూడా మీరు దేవుని కొరకు లేచి నిలువబడండి, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము నుండి ఆశీర్వదించును గాక. 

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. తండ్రీ, మేము నీచేత రక్షించబడినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము నీ చిత్తమును జరిగించుట కొరకు మమ్మును నీ సేవలో బలంగా వాడుకొనుము. దేవా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న పరిహాసములన్నియు, మాకు విరుద్ధమైన దాడుల మధ్యలో కూడా మాతో నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా చిత్తమంతయు నెరవేర్చడానికి మాకు సహాయము చేయుము. దేవా, మేము గొప్ప సాఫల్యతను కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్య, మేము నీ హృదయమును సంతోషింపజేయునట్లుగాను, ఇతరులందరు నశించిపోయిన సమయములో నీవు నోవహును రక్షించినట్లుగానే, మమ్మును కూడా రక్షించుము. దేవా, నోవహు ఓడను అత్యున్నతమైన స్థానమునకు తీసుకొని వెళ్లినట్లుగానే, నీ బిడ్డలైన మమ్మును కూడా ఉన్నత స్థానమునకు తీసుకొని వెళ్లుము. దేవా, సకల వినాశము నుండి మమ్మును విడిపించి, మాకు దేవుడుగా ఉండి, నీలో మమ్మును భద్రపరచుము. లోకం మా మీదికి లేచినప్పుడు కూడా, నీవు మాకు కేడెముగాను మరియు మాకు విమోచకునిగా ఉండి మమ్మును విడిపించుము. దేవా, మేము నిన్ను ప్రశ్నించకుండా నీ స్వరాన్ని పాటించడానికి నోవహు యొక్క నీతిని మరియు విశ్వాసాన్ని మకు అనుగ్రహించుము. ప్రభువా, మా హృదయం విరిగిపోయినప్పుడు మరియు మేము బలహీనంగా ఉన్నప్పుడు మమ్మును బలపరచుము. దేవా, నీ పరిశుద్ధాత్మ మాలో లేచి, స్థిరంగా నిలబడటానికి మాకు ధైర్యాన్ని అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి శోధనను నీ మహిమకు సాక్ష్యంగా మార్చుము. దేవా, ఈ లోకము మా మీద ఉన్న నీ యొక్క హస్తమును చూచి, మీవంటివారు ఎవరు? అని చెప్పునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.