నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మార్కు 9:23వ వచనమును మన ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "...(నమ్ముట)నీ వలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే...'' అను ఈ వచనం ప్రకారం, మీ జీవితంలో కూడా సమస్తము సాధ్యమే. ఈ రోజు, మీకు అన్నియు అసాధ్యముగా అనిపించవచ్చును. మీరు ఇలా చెప్పవచ్చును: "నేను ముందుకు వెళ్లే మార్గం లేదు. ద్వారములన్నియు మూయబడి ఉన్నవి. నేను నష్టాల వెంబడి నష్టాలను ఎదుర్కొంటున్నాను. నేను బాధతో నిండిపోయాను. ఈ ఉద్యోగాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగించగలుగుతానో నాకు తెలియదు. ఈ కుటుంబ జీవితం ఎంతకాలం కొనసాగుతుందో కూడా నాకు తెలియదు.'' కానీ భయపడకండి, కేవలం యేసును నమ్మండి. ఎందుకంటే, మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. కనుకనే, మార్కు9:23 వ వచనములో బైబిల్‌లో చెప్పబడినట్లుగానే, నేడు ఆయన మీ కొరకు సమస్తమును సాధ్యమయ్యేలా చేస్తాడు. ఇది ఈ రోజుకి మీ కొరకైన దేవుని వాగ్దానం. కనుకనే, మీరు భయపడకండి.

సహోదరి జూలీ యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. పుట్టినప్ప టి నుండి, ఆమె ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఆమె వయస్సు పెరిగి పెద్దదగుకొలది పరిస్థితి మరింత దిగజారింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎన్నో ఆసుపత్రులకు తీసుకొని వెళ్లారు. ఎన్నో మందులు ఇచ్చారు, కానీ నివారణ లేదు. అది ఆమె చదువు మీద కూడా ప్రభావం చూపింది. కానీ, 2007వ సంవత్సరంలో, ఆమెకు 15 ఏళ్ల వయస్సులో, ఇటానగర్‌లో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవం జరిగింది, అక్కడ వేలాది మంది ఆ కూటములో హాజరయ్యారు. దేవుడు నన్ను అనారోగ్యముగా ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి ఉపయోగించుకున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వేదిక మీదికి వచ్చి ఈలాగున తాను పొందుకున్న సాక్ష్యం తెలియజేశాడు: 'సహోదరుడా, నాకు ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి ఉండెను. ఇప్పుడు నేను స్వస్థపరచబడ్డాను. ఇప్పుడు నేను ఎంతగానో విడుదలను పొందుకున్నట్లుగా నాకు అనిపించుచున్నది' అని చెప్పిన తన సాక్ష్యమును సహోదరి జూలీ విన్నప్పుడు, తన హృదయములో విశ్వాసమును పెంచుకొని మరియు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించెను. పరిశుద్ధాత్మ ఆమె మీదికి దిగివచ్చినది. దేవుడు ఆమెను తాకినట్లుగా ఆమె అనుభూతి చెందినది. ఆమె శ్వాస సంబంధిత సమస్య పూర్తిగా అదృశ్యమైంది. ఆమె విడుదలతో శ్వాసించసాగింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడింది మరియు ఆమెకు డాక్టర్లు మందులు ఇవ్వడం ఆపేశారు. దేవుని దయవలన, ఆమె అద్భుతమైన ర్యాంకుతో పట్టభద్రురాలైంది. మరియు 18 సంవత్సరాల తర్వాత కూడా, "నేను సంపూర్ణంగా స్వస్థతను పొందుకున్నాను'' అని ఆమె సాక్ష్యమిచ్చెను. ఈరోజు ఆమెకు పెళ్లయి ముగ్గురు అందమైన పిల్లలు ఉన్నారు. దేవుడు ఆమెకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా ఆమె యొక్క అసాధ్యతను సాధ్యంగా మార్చాడు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, నేడు ఆయన మీ కోసం కూడా అలాగే జరిగిస్తాడు. కనుకనే, నేడు మీరు వివిధ రకాల వ్యాధులతో బాధపడుచుండవచ్చును, వైద్యుల చేత చేయి విడువబడిన స్థితిలో ఉండవచ్చును. అయితే, దిగులుపడకండి, మీరు ప్రభువును నమ్మండి, ఆయన మీకు అసాధ్యమైన కార్యాలన్నిటిని సాధ్యపరుస్తాడు. ఆలాగుననే నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ దీర్ఘకాలిక వ్యాధులను ముట్టి స్వస్థపరచి, మీకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, మా బలహీనతతో మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము, మా పోరాటాలతో మునిగిపోయి, ముందుకు సాగే మార్గం గురించి ఎన్నో సందేహాలతో మేము నిండిపోయి ఉన్నాయి. కానీ నేడు, ప్రభువా, మేము మా పూర్ణ హృదయముతో నిన్ను నమ్మాలని ఎంచుకున్నాము. దేవా, మాకు అసాధ్యమైనవన్నియు నీతో అన్నియు సాధ్యమేనని మేము నమ్ముచున్నాము. ప్రభువైన యేసయ్యా, నిన్ను నమ్మినవారికి సమస్తము సాధ్యమే అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగానే, ఆ వాగ్దానాన్ని మా పూర్ణహృదయముతో నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితాలలో నష్టం ఉన్న చోట, పునరుద్ధరణ మరియు బాధ ఉన్న చోట, శాంతిని తీసుకురమ్ము. ఇంకను దేవా, అన్నియు అసాధ్యం అనిపించే చోట, నీ అద్భుత శక్తిని మా పట్ల కనుపరచి, మాలో ఉన్న భయాలను, మా ఉద్యోగాన్ని, మా కుటుంబాన్ని, మా భవిష్యత్తును, మేము కలిగియున్న సమస్తమును నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, నీ కృప మమ్మును పైకి లేవనెత్తి మమ్మును ముందుకు నడిపించునట్లుగా చేయుము. ప్రభువా, మనుష్యులకు అసాధ్యమైనది నీకు సాధ్యమే అని చెప్పిన నీ యొక్క వాగ్దానమునకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచూ, మా వ్యాధులను ఇప్పుడే తాకి, మాకు సంపూర్ణమైన విడుదలను దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.