నా ప్రియ స్నేహితులారా, నేడు మీతో అనుసంధానము కావడం నాకు చాలా సంతోషముగా ఉన్నది. ఈ సంవత్సరము ప్రభువు మనకు వాగ్దానము చేసిన ఆశీర్వాదపు జల్లుల అనుభవమును ఈ రోజు, మనము ఎదురు చూద్దాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 3:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు'' ప్రకారం ఆయన మనకు కేడెముగా ఉన్నాడు. నేను వీడియోను చూస్తున్నప్పుడు, ఒక సూపర్ హీరోను నేను జ్ఞాపకము చేసుకున్నాను. ఆ సూపర్ హీరో శత్రువులు కొట్టే దెబ్బలన్నిటిని తీసుకోవడం అతనికి ఉన్న గొప్ప శక్తి అన్నమాట. దెబ్బలు తినడం, వాటిని భరించడము అతనికి గల శక్తి. వారెన్నో దెబ్బలు మరియు అనేకమైన శక్తులను అతని మీదికి విసురుతారు. అప్పుడు ఈ సూపర్ హీరో చుట్టు ఒక గొప్ప పీడన శక్తి వచ్చింది. శత్రువు అతని చుట్టు విసరిన వాటన్నిటిని కూడా ప్రతిదానిని అది తనలోనికి గ్రహించుకొనినది. వాటన్నిటిని ఎంతగానో వృద్ధి చేసి, వాటిని తిరిగి వారి వైపునకు విసిరివేసినది. శత్రువులు వారి మీదికి వచ్చినదానిని వారు భరించలేని పరిస్థితి వారికి ఏర్పడినది. పూర్తిగా వారు నాశనమై పోయారు.
నా ప్రియులారా, మన జీవితములో కూడా ప్రభువు అదేరీతిగా క్రియ చేయుచున్నాడు. ఆయన మనకు కేడెముగా ఉంటున్నాడు. శత్రువుకు సంబంధించిన ఏదియు కూడా మన జీవితాన్ని నాశనము చేయలేదు. ఆయన సమస్తమును ఇప్పటికే తన మీదికి తీసుకొనియున్నాడు. దానికి బదులుగా ఆయన మహిమ మన చెంతకు దిగివస్తుంది. మనము ఎదుర్కొన్నవాటికి తిరిగి చివరిగా గొప్ప మహిమను పొందుకుంటాము. ఇంకను ఎన్నో ఆశీర్వాదములు, దేవుని మహిమ మన మీద ఉదయించడము జరుగుతుంది. ఆయన మన తలను పైకెత్తువాడుగా ఉంటాడు. కనుకనే, మీరు ఇప్పుడు అనుభవించుచున్న శ్రమలను గురించి భయపడకండి.
నా ప్రియులారా, నేడు మీరు కూడా ఆ సూపర్ హీరో వలె ఎన్నో దెబ్బలు తింటుండవచ్చును. కానీ, మీరు కొట్టబడి యున్న దెబ్బలన్నిటికి ప్రతిగా దేవుడు గొప్ప మహిమను మీకు అనుగ్రహించుచున్నాడు. బైబిల్లో రోమా 8వ అధ్యాయములో అపొస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేయుచున్నాడు, " మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తు తోడి వారసులము'' అన్న వచనం ప్రకారం మనము ఆయన శ్రమలో పాలివారమైనట్లుగానే, ఆయన మహిమలో కూడా పాలిభాగస్థులము అవుచున్నాము. స్నేహితులారా, మీరు దేని కోసము ప్రార్థించుచున్నారో దానిని పొందలేకపోవుచున్నాము అని అనుకుంటున్నారా? మీరు కేవలం ఎక్కువ బాధలగుండా వెళ్లుచున్నాము అని తలంచుకుంటున్నారా? ఆ శ్రమలలో కూడా మీరు ఆనందించండి. ఎందుకనగా, మీరు అనుభూతి చెందిన వాటన్నిటికి ప్రతిగా గొప్ప మహిమను దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. అది మీ చెంతకు రానై ఉన్నది. కనుకనే, మీరు సహనముతో ఆయన యందు నమ్మిక యుంచండి. ప్రభువు ఇప్పటికే ఆ ప్రార్థన ఆలకించియున్నాడు. ఆయన మీకు మహిమవంతమైన భవిష్యత్తును ఇచ్చుచున్నాడు. కొన్ని ఫర్యాయములు అద్భుతాలు వెనువెంటనే జరుగుతాయి. మరికొన్ని ఫర్యాయములు విడుదల వెనువెంటనే జరుగుతుంది. కానీ, ప్రియులారా, మనము ఇప్పుడు సహించుచున్న శ్రమలలో కూడా ఆనందించవలసి వుంటుంది. ఎందుకంటే, గొప్ప మహిమ మన కొరకు వేచియున్నదని ఎరిగి ఉంటూ, మనము ఆనందించుచూ, మన జీవితాలను మరొకసారి దేవునికి సమర్పించుకుందామా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహిమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నేడు మేము అనుభవించుచున్న శ్రమలను నీవు చూచునట్లుగా మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మా భద్రత కొరకు మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా భద్రత కొరకు నీవు కేడెముగా ఉంటూ, మమ్మును మహిముతో కప్పుము. ప్రభువా, నీ నిమిత్తము మేము సహించుచున్న ప్రతిదానిని సహితం, మేము నీ యందు నిరీక్షణ కలిగియుండగా, నీవు మమ్మును జ్ఞాపకము చేసుకొనుము, అట్టి మహిమవంతమైన మార్గమును మాకు ఎదురుగా నీవు స్థిరపరచి ఉంచుము. దేవా, మాకు తెలుసు, నీవు న్యాయము తీర్చు దేవుడై యున్నావు. ప్రభువా, మా జీవితముల అది నెరవేర్చబడునట్లుగా సంతోషముతోను, సమాధానముతోను మా కష్టాలను సహించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈ కష్టమైన మార్గములో, నీవు మాతో కూడా ఉండి, మాతో నడువుము. ప్రభువా, నీవే మా కేడెము, మహిమ, మా తలను పైకి ఎత్తువాడవు కనుకనే, మా జీవితం బాధలతో చుట్టుముట్టబడినప్పుడు, శత్రువు పంపే ఏదియు మమ్మల్ని నాశనం చేయనేరదని మాకు గుర్తు చేయుము. ప్రభువా, నీవు ఇప్పటికే ప్రతి భారాన్ని నీపై వేసుకున్నావు మరియు ప్రతిగా, నీ మహిమ మరియు కృపతో మమ్మును ధరింపజేశావు. దేవా, వేచి ఉండే సమయాలలో దయచేసి మా హృదయాన్ని బలపరచుము. ప్రభువా, నిన్ను విశ్వసించడం, సహనముతో ఉండటం మరియు బాధను ఓటమిగా కాకుండా దైవిక విజయానికి ఏర్పాటుగా చూడటం మాకు నేర్పించుము. దేవా, మేము మా జీవితాన్ని మళ్ళీ నీ ప్రేమగల హస్తాలలోనికి అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, మా స్వంత బలం ద్వారా కాదు, మా జీవితంలో నీ సన్నిధికి మరియు ఉద్దేశ్యం ద్వారా మా తలను పైకి లేవనెత్తుతావని నమ్ముచూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.