నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 60:12 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే’’ ప్రకారం దేవుని వలన మనము శూరకార్యములను జరిగించి మనము విజయమును పొందెదము. మరియు 1 కొరింథీయులకు 15:57వ వచనములో చూచినట్లయితే, ‘‘అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక’’ ప్రకారం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు విజయము వస్తుంది. అందుకే యేసు ఇలాగున అంటున్నాడు, ‘‘నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి’’ ప్రకారం మన దేవుడు యుగయుగములు సజీవుడుగా జీవించు దేవుడుగా ఉన్నాడు. అయితే, ఒక వ్యక్తి జీవితములో అత్యంత వైఫల్యము మరియు ఓటమి అనునది మరణమే. కానీ, ఆయన సిలువలో సాధించిన విజయము ద్వారా మనము ఎట్టి వైఫల్యము నుండియైనను బయటకు రావచ్చును. మీరు సజీవంగా ఉన్నట్లయితే, ఎట్టి ఓటమి నుండియైనను మీరు బయటకు రావచ్చును. కానీ, మీరు మరణిస్తే ఎలాగున తిరిగి రాగలరు? కానీ, యేసు మృత్తి నొందియున్నాడు, తన యొక్క జీవింపజేయు ఆత్మ ద్వారా మరణపు శక్తి బ్రద్ధలు చేసి, తిరిగి మరల జీవము పొందుకొని బయటకు వచ్చాడు. అందుకే ఆయన, ‘‘నేను మృతుడనైతిని గానీ, నిరంతరము జీవించుచున్నానని ఆయనే, నా యందు విశ్వాసముంచువాడు, మరణించినను ఇంకను జీవిస్తాడు చెప్పియున్నాడు.’’
అవును, నా ప్రియ స్నేహితులారా, అవును, మీరు అనుకోవచ్చును, నా జీవితములో అన్ని మృతతుల్యమైనట్టుగా ఉన్నవి కదా? కానీ, దేవునితో మనము విజయమును పొందుకొనెదము. ప్రభువు జీవముతో నింపబడియున్నాడు. అందుకే యేసు ప్రభువు, ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు’’ అని సెలవిచ్చిన ప్రకారం, ఆయనే జీవము. ఆయనే జీవము గనుకనే, మీరు మీ హృదయములో యేసును కలిగియున్నప్పుడు, ఏదైనను సరే, అది జీవించగలదు. మీరు మీ హృదయములో యేసును కలిగియున్నప్పుడు మీ జీవితములో మృతమైన సమస్తమును జీవమును కలిగియుంటుంది. మరణాంధకారము, గాఢాంధకారపు లోయలలో మీరు సంచరించినను సరే, మీరు ఏ మాత్రము కూడా భయము చెందరు. మీకు విరోధముగా రూపింపబడు యే ఆయుధము కూడా అది వర్థిల్లదు. దుష్టులు మీ ప్రక్కన పదివేలమందిగా, లేక వేయిమందిగాను పడియున్నను సరే, అది మీకు కీడు కలుగజేయనేరదు. ఎందుకనగా, దేవుని కృప చేత మీరు ఆవరించబడియున్నారు. మీరు దేవుని సమాధానము చేత ఆవరించబడియున్నారు. యేసు మీ నిమిత్తము సాధించిన విజయము చేత మీరు ఆవరించబడియున్నారు. మూడవ దినమున సమాధిని గెలిచి తిరిగి లేచుట ద్వారా యేసు సాధించిన విజయముచేత మీరు ఆవరించబడియున్నారు. ‘‘ సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని’’ యేసు సెలవిచ్చుచున్నాడు. ఇంకను యేసు, ‘‘నేను మిమ్మును జీవింపజేయుదును. నేను జీవించుచున్నాను గనుకనే, మీరు కూడా జీవించెదరు’’ అని చెప్పబడిన ప్రకారం అన్నిటియందు మీరు విజయమును కలిగి ఉంటారు. మీరు అన్నిటిలోను విజయము కలిగియుంటారు. కనుకనే, మీరు భయపడకండి.
ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. సహోదరి ప్రేమ. ఆమె ఏకాకిగా ఉన్న తల్లిగారు. భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు బిడ్డలు. ఆమె ప్రయోగశాలలో పనిచేస్తుంటుంది. ప్రయోగశాలలో పని చేసే ఉద్యోగము కొరకు మాత్రమే చదువుచుకొనెను. కానీ, ఆమెకు కేవలం నర్సింగ్‌లో సహకరించే ఉద్యోగము మాత్రమే ఇచ్చారు, చాలా తక్కువ జీతము. 8 సంవత్సరములుగా పనిచేసినది. ఆ ఉద్యోగములో ఎటువంటి వృద్ధిలేదు. ఎవ్వరు ఆమెను పట్టించుకోవడము లేదు.ప్రజలు ఏమో అసూయతో ఉన్నారు. పదొన్నతి లేదు. అటువంటి సమయములో ప్రార్థన గోపురములో జరుగుచున్న ఉపవాస ప్రార్థనలో ఆమె హాజరు కావడము జరిగినది. ప్రార్థనా యోధులు ఆమె కొరకు ప్రార్థించి,‘ దేవుడు మీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు’ అని చెప్పారు.మహాద్భుతమైన రీతిలోనే కొంతకాలము తర్వాత నిలిచిపోయి ఉన్న వేతనము అంతయు రావడం జరిగింది. ఆలాగుననే, ఉద్యోగములో పదోన్నతి కల్పించడము కూడా జరిగినది. ఈ రోజు ఆమె కుమారుడు ఇంజెనీరింగు విద్యను పూర్తి చేసుకున్నాడు. ప్రవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె, ఇంజెనీరింగు చదువుకుంటు ఉన్నది. ఆమె గృహమును నిర్మాణము కూడా చేయుచున్నారు. దేవునికి స్తోత్రములు. నేడు దేవుడు మీకు కూడా అటువంటి విజయమును అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు మరణాన్ని జయించి ఇప్పుడు యుగయుగములు సజీవముగా మా మధ్యలో జీవించుచున్నావు, గనుకనే, నేడు నీతో కూడా, మా జీవితంలోని మృతమైనవన్నియు కూడా నీ ఆత్మ ద్వారా తిరిగి పునరుజ్జీవింపజేయుము. యేసయ్యా, మా కొరకు నీవు సిలువలో సాధించిన విజయంతో నీవు మమ్మును ఆవరించుము. ఇట్టి, విజయమును మా జీవితములో రావాలని మేము ప్రార్థించుచున్నాము. దేవా, నేడే మా ఉద్యోగములో పదోన్నతిని మాకు దయచేయుము. ప్రభువా, మాకు మరియు మా ప్రియులైన వారు సరైన ఉద్యోగము మేము పొందుకొనునట్లుగా కృపను దయచేయుము. దేవా, మా జీవితములో ప్రతి విధమైన ఒంటరి భావనను మాలో నుండి తొలగించుము. ప్రభువా, నీ యొక్క సమాధానమును శాంతిని మాకు దయచేయుము. దేవా, మా ప్రతి కార్యములలోను మాకు విజయమును దయచేయుము. ప్రభువా, నీ కృప, శాంతి మరియు పునరుత్థాన శక్తితో మమ్మును ఆవరించుము. దేవా, మేము కీడుకు భయపడకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. ఎందుకంటే, నీవు ఎల్లప్పుడు మాతో ఉంటూ, మా విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్థిల్లకుండా చేయుము. యేసయ్య నీవు మా కొరకు సిలువలో సాధించిన విజయమును మేము పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచుఆన్నము తండ్రీ, ఆమేన్.