నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అంతమాత్రమే కాదు, మీరు ప్రకాశించునట్లుగా ఈ రోజు ఆయన తన కృపను మీ మీద కుమ్మరించబడబోవుచున్నది. ఇటువంటి కృపను మనము నేడు ధ్యానించబోయే వాక్యము ద్వారా పొందుకొనబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 1:45వ వచనమును మనము ధ్యాన నిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "ప్రభువు ఆమెకు తెలియ జేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను'' అని చెప్పబడినట్లుగానే, మరియ దేవుని మాటలను నమ్మి ధన్యతను పొందుకొనినట్లుగానే, నేడు మీరు కూడా దేవుని మాటలను నమ్మి అటువంటి ధన్యతను పొందుకొనండి. ఎలాంటి వారు ధన్యులుగా పేర్కొనబడుచున్నారు? దేవుడు తాను పలికిన ప్రతి వాగ్దానమును నెరవేరుస్తాడని నమ్మువారందరిని ధన్యులనుగా పరిగణింపబడుచున్నారు. కనుకనే, నా ప్రియులారా, దేవుని వాక్యము ను మనము అనుదినము ఈ విధంగానే క్రమము తప్పకుండా చదవాలి. ఈ లేఖనములను చదువుచున్నప్పుడు లేక వింటున్నప్పుడు, దేవుడు తాను ఇచ్చిన వాగ్దానములన్నిటిని మీ జీవితములో నెరవేరుస్తాడని నమ్ముతూ మీరు ఆయనను స్తుతించండి. ఇంకను మీరు ఆయన వాక్యమును ప్రతిరోజు చదువుచున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా ఆయన వ్యక్తిగతంగా మీతో మాట్లాడుచున్నాడనియు మరియు ఆ వాగ్దానములన్నిటిని నెరవేర్చడానికి ఆయన మీతో కూడా ఉన్నాడని నమ్ముతూ ఆయనను స్తుతించినట్లయితే, నిశ్చయముగా, అటువంటి ధన్యత మీరు కూడా పొందుకుంటారు.

నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ జీవితంలో పలికిన ప్రతి మాటలను తేలికగా తీసుకొనకండి. ఎందుకనగా, నేను అనేక కూటములలో చూశాను. ఆ కూటములకు వచ్చిన వారిలో అనేకమంది దైవజనులు బోధించు ప్రతి మాటను నిజంగా తన కొరకు అని ఆ మాటలను అంగీకరించి, వారి సొంతం చేసుకుంటారు. చూడండి, ఆశ్చర్యకరంగా, ఆ మాటలు వారి జీవితములలో నెరవేర్చబడుట కూడా నేను చూచియున్నాను. ప్రార్థన ద్వారా పలుకుచున్న ప్రతి దేవుని మాటలను వారు అంగీకరించుట ద్వారా అద్భుతములను రుచి చూచున్నారు. కానీ, కొందరు వాక్యమును అంగీకరించకుండా, దానిని విమర్శించడానికి మాత్రమే ఆ కూటములకు వస్తారు. వారు దేవుని ఆశీర్వాదములను ఎన్నటికిని పొందుకొనలేరు. అయితే, దేవుని వాగ్దానముల ను నమ్మినవారు ధన్యులని బైబిల్ స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. కనుకనే, మీరు కూడా దేవుని వాక్యమును నమ్మండి, అటువంటి ధన్యతను పొందుకొనండి.

ఈ సంవత్సరం కూడా, మా తండ్రిగారైన డాక్టర్. పాల్ దినకరన్‌గారు, ' యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో' దేవుడు తన ద్వారా మాట్లాడిన ప్రవచన వాగ్దానమును తెలియజేసియున్నారు. ఆ వాగ్దానము, "లేచి కట్టుటకు పూనుకొనుము మరియు బలము తెచ్చుకొనుము'' అని చెప్పబడియున్నది. ఆ వాగ్దానమును మీరు నమ్ముచున్నారా? దేవుడు మనలను ఘనపరుస్తాడన్న విశ్వాసముతో, 'గౌరవింపజేయును' అను ఒక పాటను కూడా మేమందరము కలిసి పాడియున్నాము. ఆ పాట ప్రకారముగానే, ఆయన మన జీవితములను నిర్మించి, ప్రజలందరి యెదుట మనలను గౌరవింపజేస్తాడు. మేము పాడిన ఈ పాటను, కేవలం ఒక సాధారణమైన పాటగా మాత్రమే భావించకండి. ఈ వాక్యము ద్వారా ఇవ్వబడిన దేవుని ప్రవచనాత్మకమైన వాగ్దానములనుగా అంగీకరించండి. ఆ వాగ్దానములు నిశ్చయముగా, మీ జీవితములో నెరవేర్చబడును గాక. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు మాతో సహవాసము కలిగియుంటూ, ఈ అనుదిన వాగ్దానములను వింటున్నప్పుడు లేక చదువుచున్నప్పుడు, మా ద్వారా దేవుడు పలికిన ప్రతి మాట నెరవేరుట మీరు చూడగలరు.

బైబిల్‌లో చూచినట్లయితే, మరియ యేసు పాదముల చెంత కూర్చుని, ఆయన పలికిన ప్రతి మాటను శ్రద్ధగా వినుటకు ఉత్తమమైనదానిని ఎన్నుకొనెను. కనుకనే, ఆమె సమస్త ఆశీర్వాదములను పొందుకొని ధన్యురాలుగా పరిగణింపబడెను. మరియు ఇటువంటి దేవుని వాక్యము ఆమె హృదయంలో జీవమునిచ్చు మాటలుగా మారినవి. కానీ, మార్తా, విస్తారమైన పనిపాటులను కలిగియుండుట ద్వారా, ఆమె పనిలో నిమగ్నమై ఉండెను. కనుకనే, యేసు తన ఇంటికి వచ్చినందుకు మార్త సంతోషించినప్పటికిని, ఆయన బోధించిన వాక్యము యందు ఎంతమాత్రం ఆమె శ్రద్ధ చూపలేదు. అందుకు ప్రతిఫలముగా, ఆమె యేసుచేత ఇవ్వబడిన వాగ్దానము ద్వారా లభించు ఆనందమును, ఆశీర్వాదములను కోల్పోయినది. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు కూడా దేవుని వాగ్దానములను నమ్ముట ద్వారా ధన్యులైనవారుగా మార్చబడుచున్నారు. మీ హృదయములో నమ్మకములో ఎదుగుట ద్వారా ఆయన ఆశీర్వాదములు మీ జీవితములోనికి ప్రవహించుట మాత్రమే కాదు, ఆయన అనుగ్రహించు ధన్యతను పొందుకొని అనుభవించెదరు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము నమ్ముటకు అటువంటి హృదయమును మాకు దయచేయుము. ప్రభువా, నీ సేవకుల ద్వారా పలుకబడిన వాగ్దానముల ప్రకారము మా జీవితములు కట్టబడుటకు నీ కృపను మాకు దయచేయుము. దేవా, ఈ సంవత్సరములో నీవిచ్చిన వాగ్దానముల ప్రకారము మా జీవితములు మరియు మా కుటుంబములు కట్టబడునట్లుగాను మరియు వర్ధిల్లునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకములను తొలగిపోవునటన చేయుము. దేవా, మా జీవితాలు మరొక్కసారి నీ వెలుగుచేత ప్రకాశించునట్లుగా చేయుము. యేసయ్యా, ఘనహీనముగా ఉన్న మమ్మును ఈ సంవత్సరము వాగ్దానము ప్రకారము మమ్మును గౌరవింపజేయుము. ప్రభువా, మా గృహములను, వివాహ జీవితములను, వృత్తులను, మరియు మా జీవితంలోని ప్రతి అంశములలోను నీ యొక్క చిత్తానుసారంగా కట్టబడునట్లుగాను మరియు బలహీనులుగా ఉన్న మేము నీలో బలము తెచ్చుకొని ముందుకు కొనసాగుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ నామమునకు మహిమ కలుగునట్లుగా మా జీవితములో నీవు పలికిన ప్రతి వాగ్దానమును నెరవేర్చుము. ప్రభువా, నీ యొక్క ప్రతి మాటయందు మేము నమ్మకముంచి, విశ్వాసంతో నీవిచ్చు ఆశీర్వాదములను పొందుకుంటూ మేము ఆనందించడానికి మాకు సహాయం చేయుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.