నాకు అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 25:14వ వచనమును మనకు ఇవ్వబడియున్నది. ఆ వచనము, "యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులుగల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును'' అని చెప్పబడియున్న ప్రకారము ప్రతి ఒక్కరము దేవుని యందలి భయభక్తులు కలిగియుండాలి. దేవుని యెదుట వణకుచు ఉండాలి. అప్పుడు ఆయన యెదుట మహిమోన్వితమైన జీవితమును మనము కలిగియుంటాము. అబ్రాహాము జీవితము ప్రభువు యెదుట ఎంతో మహిమాన్వితముగా ఉండి యున్నది. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 22:12వ వచనములో చూచినట్లయితే, "అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనపడుచున్నది'' అని ప్రభువు అబ్రాహాముతో అనెను. అయినను, దేవుడు అబ్రాహాముతో చెప్పినవన్నియు దేవుని యందలి భయభక్తులతో వాటన్నిటిని నెరవేర్చియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియున్నప్పుడు ఆయన సమృద్ధిగా మిమ్మును ఆశీర్వదించును.

నా ప్రియులారా, బైబిల్ నుండి కీర్తనలు 112:1వ వచనములో చూచినట్లయితే, "యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు'' మరియు కీర్తనలు 128:1వ వచనములలో చూచినట్లయితే, " యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరు ధన్యులు'' ప్రకారము పెద్దవారు మాత్రమే కాదు కానీ, చిన్నపిల్లలు కూడా దేవుని యందలి భయభక్తులు కలిగియున్నట్లయితే, దేవుని ద్వారా అత్యున్నతముగా దీవించబడతారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 115:13వ వచనమును చూచినట్లయితే,"పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులుగలవారిని యెహోవా ఆశీర్వదించును''అని చెప్పబడినట్లుగానే, దేవుని యందు భయభక్తులుగలవారిని ఆయన ఆశీర్వదించును. నా జీవితములో16 సంవత్సరముల వయస్సులో దేవుని యందలి భయభక్తులు లేవు. అయితే, ఒకరోజు, ఆయన నాతో, దేవుని యందు భయభక్తులు ఎలా కలిగియుండాలి? ఆయనతో సన్నిహిత సంబంధమును ఎలా కలిగియుండాలి? అని స్పష్టముగా మాట్లాడియున్నాడు. అప్పటి నుండి కూడా నేను దేవుని యందలి భయభక్తులు కలిగియుంటూ, ఆయనతో చక్కని సంబంధమును కలిగియుంటున్నాను. ఆలాగుననే, నేను 16 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పటి నుండి యేసయ్య నాకు ఎంతో సన్నిహిత స్నేహితునిగా మారియున్నాడు. హల్లెలూయా!

కాబట్టి, నా ప్రియులారా, యేసును మీరు సన్నిహిత స్నేహితునిగా కలిగియుండండి. ఆలాగుననే, యౌవనస్థులారా, లోకస్థులతో కాదు కానీ, మీరు కూడా యేసయ్యను మీరు సన్నిహిత స్నేహితునిగా కలిగియుండండి. యేసయ్యను మీరు మీ యొక్క సన్నిహిత స్నేహితునిగా కలిగియున్నప్పుడు, ఆయన మిమ్మును చక్కటి మార్గములో నడిపిస్తాడు మరియు మీకు కావలసినవాటన్నిటిని మీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 145:19వ వచనములో చూచినట్లయితే, "తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా దేవుని యందు భయభక్తులుగలిగియున్నప్పుడు ఆయన మీ కోరికలను నెరవేరుస్తాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మీ జీవితమును ఒక్కసారి పరీక్షించుకొనండి. మీరు దేవుని యందలి భయభక్తులు కలిగియున్నారా? మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపెట్టుచున్నారా? దేవుని వాక్యమును క్రమముగా చదువుచున్నారా? ఆయనతో ప్రార్థనలో మాట్లాడుచున్నారా? ఆలాగైతే, ప్రభువు మీకు ముందుగా నడిచి, మీకు కావలసిన దీవెనలన్నిటిని అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభువునకు సమర్పిస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనములు. ప్రభువా, మేము నీ వైపు చూచి, నిన్ను పట్టుకొని ఉండుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మేము నీతో నడుస్తూ, నీతో మాట్లాడే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీ వాక్యానికి మేము విధేయత చూపడంలో ఆనందించే పవిత్రమైన భయమును మాలో ఉంచి, నీ ఆజ్ఞల యందు మేము వణుకుచూ, ప్రతిరోజు నీతో సన్నిహితంగా నడవడానికి మాకు నేర్పించుము. ప్రభువైన యేసయ్య, మా ప్రాణ స్నేహితునిగా నీవు మాతో ఉండి, నీ చిత్తానుసారంగా మా జీవితమును నడిపించుము. దేవా, మమ్మును నీ నుండి దూరం చేయుచున్న ఈ లోక కార్యములన్నిటిని మా నుండి తొలగించుము. దేవా, మేము విశ్వాసంతో ప్రార్థించడానికి, నీ వాక్యమును చదవడానికి మరియు నీ స్వరానికి విధేయులముగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదములను, కృపను మరియు నీ యొక్క నిబంధన మా జీవితంపై ఎల్లప్పుడూ నిలిచియుండునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.