నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీ యొక్క నీతికి సంబంధించిన ఫలమును మీకు అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. మీరు నీతికి సంబంధించిన ఫలములను పంటగా కోయాలి మరియు దానిని అనుభూతి చెందుచూ, ఆనందించునట్లుగా దేవుడు మీకు దానిని అనుగ్రహిస్తాడు. దేవుడు మీరు ఆనందించునట్లుగా చేస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 3:10వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు'' అని చెప్పబడినట్లుగానే, మీకు మేలు కలుగునట్లుగా మీరు నీతికార్యములు చేసినప్పుడు మీరు దానిని ఫలములను అనుభవింతురు. అవును, మీరు చేయునట్టి నీతికార్యములకు వచ్చు ప్రతిఫలము ఎట్టిది? అది క్రమశిక్షణ. అందుకే బైబిల్‌లో హెబ్రీయులకు 12:11వ వచనములో చూచినట్లయితే, " మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు క్రమశిక్షణ కలిగియుండు జీవితమునకు తగిన కృపను అనుగ్రహిస్తాడు. అది నీతియు, సమాధానము అను పంటను మీకు అనుగ్రహించును. మీరు నీతిమంతులై ఉండగా, సమాధానపరచు వారైయుందురు. అందుకే బైబిల్ నుండి యాకోబు పత్రిక 3:18వ వచనములో చూచినట్లయితే, "నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును'' అని చెప్పబడినట్లుగానే, సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడుచూ, నీతియను పంటను కోయుదురు. అవును, దేవుని యొక్క నీతి ప్రజలందరికి కూడా దేవుని యొక్క సమాధానమును తీసుకొని వచ్చునట్లుగా చేయును. మీరు నీతిమంతులైనప్పుడు, దేవుడు మీకు సమాధాన విధానమును అనుగ్రహిస్తాడు మరియు అనేకమైన గొప్ప కార్యములను మీరు సంపూర్తి చేయుదురు. మూడవదిగా, బైబిల్ నుండి యెషయా 32:17వ వచనములలో చూచినట్లయితే, "నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు'' అన్న వచనము ప్రకారముగా, నీతివలన సమాధానము కలుగుతుందని బైబిల్ చెబుతుంది. దాని వలన ఎల్లప్పుడు నిమ్మళము, నిబ్బరము కలుగుతుంది.
నా ప్రియులారా, దేవుడు మీకు నీతిని అనుగ్రహించుచుండగా, మీరు పూర్తిగా నిబ్బరము కలిగియుండుదురు. ఎందుకనగా, మీరు ప్రభువు యొద్ద నుండి ఆలకించెదరు. దేవుడు నీతిమంతులతో కూడా నడుచుచున్నాడు. బైబిల్‌లో చూచినట్లయితే, నోవహు నీతిమంతుడై ఉన్నాడు. బైబిలేమంటుందో చూడండి, దేవుడు నోవహుతో నడిచియున్నాడు అని చెప్పబడియున్నది. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 6:9వ వచనములో చూచినట్లయితే, "నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు'' అని చెప్పబడియున్నది. అబ్రాహాము దేవుని యందు విశ్వాసముంచియున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడియున్నది. అందును బట్టి, దేవుడు అతనితో కూడా నడిచియున్నాడు. దేవుడు అతనిని అనేకమైన జనములకు తండ్రిగా చేశాడు. ఈ రోజు మధ్యప్రాచ్య దేశమందంతటను అబ్రాహామును తన తండ్రిగా కలిగియున్నారు. అబ్రాహాము, అరబ్బులకు, ఆలాగుననే ముస్లిములకు మరియు యూదులకు తండ్రిగా ఉన్నాడు. ఆలాగే యేసునందు విశ్వాసముంచియున్న ్రకైస్తవులకు కూడా ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆలాగే, అబ్రాహాము విశ్వాసమునకు తండ్రిగా ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు అనుగ్రహించు ఆత్మస్థైర్య ము ద్వారా మరియు నిబ్బరము ద్వారా, దేవుడు అనేకమందిని మీరు నీతి యొద్దకు నడిపించునట్లుగా సామర్థ్యమును అనుగ్రహిస్తాడు. మోషే దేవునికి ఈ రీతిగా మొఱ్ఱపెట్టాడు, " ఓ దేవా, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో నీవు నాకు తెలియజేయవలెనని'' చెప్పినప్పుడు, దేవుడు మోషేతో ఈలాగున సెలవిచ్చియున్నాడు,' మోషే, నా సానిధ్యము నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతినిస్తాను.'' అవును, నా ప్రియులారా, మోషే లక్షలాదిమందిని ఆత్మస్థైర్యముతో మనో నిబ్బరముతో ముందుకు నడిపించియున్నాడు.
అదేవిధముగా, నా ప్రియులారా, మీరు కూడా మీ కుటుంబమును భరించగలుగుతారు, మీ ఉద్యోగమును మీరు భరించగలుగుతారు మరియు మీ విభాగమును, మీ దేశమును మీరు భరించగలుగుతారు. దేవుడు మీకు ఇచ్చు నిబ్బరము చేత మరియు దేవుని యొద్ద నుండి వచ్చుచున్న నిమ్మళము చేతను ప్రార్థన కొరకు మిమ్మును కోరుకొను లక్షలాదిమందిని మీరు భరించగలుగుతారు. కొన్ని ఫర్యాయములు ఒక వ్యక్తి మూడు మరియు నాలుగు సంవత్సరములలో దాడికి గురియగుచున్నప్పుడు, అతడు ఆ సమయములో ఏమంటాడంటే, నా తల పగిలిపోవునట్లుగా ఉన్నది అని అంటాడు. కానీ, మీరు లక్షలాదిమందిని భరించుచున్నప్పుడు, లక్షలాది సమస్యలు ఉంటాయి కదా. కానీ, ఆయన స్వరమును వినుటకును మరియు ఆలాగుననే, ఆ రీతిగా జరిగించుటకు దేవుడు మీకు నిబ్బరమును ఇస్తాడు, అందరు సంతృప్తి నొందుతారు. అన్నియు సమాధానకరముగా ఉంటుంది. ఉత్పత్తి ఉంటుంది. మీరు గొప్ప ప్రతిఫలమును పొందుకుంటారు. చివరిగా, దేవుడు నీతికి సంబంధించిన నిత్యజీవమును మీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 4:36వ వనచములో చూచినట్లయితే, " విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు'' అని చెప్పబడిన ప్రకారముగా మనము ప్రార్థించుకుందాము. మనము సమస్తమును సమకూర్చుకొని ఆనందించునట్లుగా నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసూ, నీతి అనే క్రమశిక్షణను మాకు నేర్పినందుకు నీకు వందనములు. దేవా, మా జీవితాన్ని నీ యొక్క నిమ్మళముతోను నిబ్బరముతోను మరియు విశ్వాసంతో నింపుము. ప్రభువా, నీ యొక్క స్వరమును స్పష్టంగా విని, ప్రతిరోజూ నీతో సన్నిహితంగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఇతరులకు ఓదార్పును, నీతిని అందించే సమాధానకర్తగా మమ్మును మార్చుము. ప్రభువా, నీ యొక్క బలంతో మా జీవితములో ఉన్న ప్రతి బాధ్యతను మోయడానికి మాకు నీ యొక్క కృపను అనుగ్రహించుము. దేవా, నీ సన్నిధి మాకు ముందుగా వచ్చునట్లుగాను మరియు ప్రతి పరిస్థితిలో మాకు విశ్రాంతిని అనుగ్రహించి, మా జీవితం నిన్ను మహిమపరచే మరియు అనేకులను ఆశీర్వదించే ఫలములను ఫలించునట్లుగా చేయుము. తండ్రీ, నీతిగల ఆత్మనుగా మమ్మును మార్చుము. దేవా, పై చెప్పబడిన ఆశీర్వాదములన్నియు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండకుండా, ఎల్లప్పుడు సమృద్ధితో నింపబడునట్లుగా చేయుము. దేవా, మేము మా కుటుంబమునకు మరియు మా బంధువులకు ఇవ్వగలిగే సమృద్ధిని మాకు దయచేయుము. యేసయ్యా, సహాయమును కోరుకొనువారికి మేము ఇచ్చి, సహాయపడుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. దేవా, ఈ రోజు మా జీవితములో ప్రత్యక్షతలు పొంగి ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మా చేతులు సమృద్ధితో సమకూర్చబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


