నా ప్రియ మిత్రమా, ఈ రోజు ప్రభువునందు దినము అద్భుతమైన రోజు. కనుకనే, నిరీక్షణను కోల్పోకండి. అందుకే బైబిల్ నుండి యెషయా 9:6 వ వచనములో ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని మనము చూద్దాం. ఆ వచనము, "...ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును '' అని సెలవిచ్చినట్లుగానే, ఆయన ఆశ్చర్యకరుడు అని పిలువబడుచున్నాడు. యేసు నామమును గురించి ఈ విధంగా వివరించబడియున్నది. నిజంగానే, యేసు మనలోని వచ్చినప్పుడు, మన హృదయాలలో సమస్తమును కూడా అద్భుతంగా మారుతుంది. ఆయన ఆదరణకరమైన సన్నిధిని మనము అనుభవించగలము. ఆయన ఆనందకరమైన సన్నిధిని కలిగియున్నాడు. ఆయన మనకు అద్భుతకరుడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు సంసిద్ధము చేసియున్న మార్గములో మనకు అద్భుతంగా ఆలోచన చెప్పి నడిపించువాడైయున్నాడు. కనీసము మనము ఊహించలేనటువంటి అద్భుత కార్యములను మన కొరకు చేయబోవుచున్నాడు. మనలను మోసికొనుచు ఉండి, మనకు అవసరమైయున్నవాటన్నిటిని అనుగ్రహించు నిత్యుడగు తండ్రియై యున్నాడు. ఈ లోకములోను, ఆలాగే నిత్యము అనే మాట, పరలోకమందును కూడా అని భావము. ఆయన మనకు పరలోకమును కూడా ఇచ్చు దేవుడై యున్నాడు. అందునిమిత్తమే, ఆయన సమాధానకర్త, రాకుమారుడు, దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి మరియు శాంతిని, సంతృప్తిని అనుగ్రహించు దేవుడు వాడైయున్నాడు.

నా ప్రియులారా, ఈ రీతిగా ఆయన తన శిష్యులను నడిపించియున్నాడు. ఆయన తనను వెంబడించుట కొరకై మరియు వారిని పిలిచి ఏర్పరచుకొనినది మొదలుకొని, వారి జీవితాలలో ప్రతిరోజు యేసు ఏ రీతిగా వారికి ఉండగలడని వారు చూచియున్నారు. అది మనము గమనించినట్లయితే, మనకు కూడా అసూయ కలుగుతుంది కదా! యేసు అదే రీతిగా ప్రతి రోజు మనతో కూడా నడుస్తున్నాడు అని మనము ఊహించుకున్నట్లయితే, ఆయన వారికి ఎంతో అద్భుతకరుడుగా ఉండియున్నాడు. వారు చేయుచున్నదానిని విడిచిపెట్టి, కేవలము వారు ఆయనను వెంబడించారు. వారి జీవితములకు నిజమైన అర్థము వచ్చినట్లుగా వారు భావించారు. యేసు వారితో కూడా అక్కడ ఉన్నప్పుడు చాలా ధైర్యముగా ఉన్నట్లుగా వారికి అనిపించినది.

నా ప్రియ స్నేహితులారా, ఆయన వారికి సమాలోచన చెప్పి, ఎన్నో సంగతులను వారికి నేర్పించాడు. ఆయన బలమైన దేవుడుగా వారి పట్ల ఉంటూ, వారి కొరకు మరియు వారి ద్వారాను అద్భుతమైన కార్యములను జరిగించాడు. నిత్యుడైన తండ్రిగా వారితో కూడా ఉండి, వారికి అవసరమైన వనరులన్నియు అనుగ్రహించాడు. సమాధానకర్తగా మరియు సమాధాన అధిపతిగా వారి యందు నిలిచి సముద్రమును నిమ్మళింపజేయడం మనమందరము చూచియున్నాము కదా. నా ప్రియులారా, ఈ రీతిగానే, మీ జీవితములో ప్రతి పరిస్థితులలోను ఆయన మీకు సమాధానకర్తగా ఉండియున్నాడు. మీరు యేసునకు శిష్యులై ఉన్నారు. కేవలము ఆయనను వెంబడించి, ఆయన యొక్క మంచితనమును స్వీకరించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ జీవితములో మీకు ఆశ్చర్యకరుడుగాను, ఆలోచనకర్తగాను, బలవంతుడైన దేవుడుగాను, నిత్యుడగు తండ్రిగాను, సమాధానకర్తయగు అధిపతిగా ఉండి మిమ్మును ఈ క్రిస్మస్ దినములలో నడిపిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్య, నీవు లేకుండా మేము ఏమి చేయగలము? దేవా, నీవు ఎంతో అద్భుతకరుడవు మరియు ఆలోచనకర్తవు, కనుకనే, ఇప్పుడే నీ యొక్క అద్భుతకరమైన సన్నిధిని మేము అంగీకరించునట్లుగా చేయుము. దేవా, మేము నీ యొక్క రక్షణానందమును సమృద్ధిగా పొందుకొనునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీవు మాకు ఆలోచనకర్తగా ఉన్నందుకై నీకు వందనాలు, మా జీవితాలలో అద్భుతాలను జరిగించుము. దేవా, నిత్యుడగు తండ్రిగా మా యొక్క అవసరతలన్నియు సరఫరా చేసి, నీ నామమహిమార్థము మమ్మును వాడుకొనుము. ప్రభువా, మా కుటుంబమును నీ యొక్క సమాధానముతో నింపబడునట్లుగాను, మా సమస్యలలో కూడా మాకు శాంతిని అనుగ్రహించి, నీ ధైర్యముతో మమ్మును ముందుకు నడిపించుము. ప్రభువా, నీ ధైర్యముతొ మా హృదయములు లేవనెత్తబడునట్లుగాను, మాలో ఉన్న భయాలు మరియు ఆందోళనలన్నింటిని పారద్రోలివేసి, మా సందేహాలన్నింటిని తొలగించుము. ప్రభువా, నీవు మాకు ఆలోచనకర్తగా ఉంటూ, మేము ఏమి చేయాలో, మేము ఏ మార్గమును ఎంచుకోవాలో మరియు మేము ఏ నిర్ణయం తీసుకోవాలో మరియు మా జీవితము పట్ల ఉద్దేశ్యం ఏమిటో దయచేసి మా హృదయంలో మాకు మార్గము చూపించి, మమ్మును నడిపించుము. దేవా, దయచేసి, మేము ఏ ఉద్యోగాన్ని ఎంచుకోవాలో మాకు చూపించుము మరియు మా కొరకు మూయబడిన మార్గములన్నిటిని తెరచి, మా మార్గములో మమ్మును ఆశీర్వదించుము. దేవా, దయచేసి మా బ్రద్ధలైన హృదయాన్ని బాగుచేయుము మరియు మా సమస్యలన్నిటిలో, మా హృదయం, మా కుటుంబం మరియు మా జీవితంలోని ప్రతి భాగంలో నీ శాంతిని ఆజ్ఞాపించుము. యేసయ్యా, నీ యొక్క అమూల్యమైన నామంలో మమ్మును బాగుపరచుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.