నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు దేవుని యొద్ద నుండి ఒక గొప్ప విజయమును మనము పొందుకొనబోవుచున్నాము. ఆయన వాక్యమును మనము పొందుకున్నప్పుడు, ప్రార్థన ద్వారా మనము మన విజయానికి మార్గమును కనుగొనగలము. అందుకే ఆయన నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యాకోబు 4:7వ వచనము నుండి మనతో మాట్లాడుచున్నాడు: ఆ వచనము, "కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును'' అని చెప్పబడిన ప్రకారము మనము సాతానును ఎదిరించినట్లయితే, వాడు మనలను ఏమియు కూడా చేయలేడు. కనుకనే, మనం, 'లేదు, నేను నీ మాట వినను. నువ్వు చెప్పుచున్న ప్రతి విషయాలలో నేను జ్యోకం కలుగజేసుకొనను,' అని చెప్పినప్పుడు, అటుపిమ్మట ఏ మాత్రము కూడా అపవాది మనలోనికి ప్రవేశించలేదు. అంతమాత్రమే కాదు, సాతాను మనకు నాశనాన్ని కలిగించలేదు. కనుకనే, మనము అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు.

కానీ, నా ప్రియులారా, అపవాదిని ఎదిరించడము అంత సులభమైన కార్యము కాదు. ఎందుకంటే, అపవాది మనలో ఉన్న బలహీనమైన భాగమును లక్ష్యంగా చేసుకుని, ఆ బలహీనతలోనే మనలను శోధిస్తాడు. మనం ఒక చిన్నపిల్ల వానిని చూచి, నీవు ఐస్‌క్రీమ్ తినవద్దని చెప్పి, మనమే ఐస్‌క్రీమ్ తింటుంటే, ఆ పిల్లవాడు దానిని ఎలా ఎదిరించగలడు? ఐస్‌క్రీమ్ అంటే, ఆ చిన్నపిల్లవానికి చాలా ఇష్టమని మనకు తెలుసు. ఐస్‌క్రీమ్ ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తాడు. లేదా ఆ బాబు ఏడుస్తూ, 'లేదు, నాకు ఆ ఐస్‌క్రీమ్ ఎలాగైనా కావాలి' అని అంటాడు. కనుకనే, నా ప్రియులారా, మన మానవ శరీరం శోధనలను అంత సులభంగా ఎదిరించలేదు. అదేవిధంగా, యేసు ఆహారం తీసుకొనకుండా ఉపవాసం ఉండి, ప్రార్థన చేసి ముగించిన తర్వాత, ఆయన ఆకలిగొనెను. "అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆయనతో ఆ శోధకుడు, "ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను.'' ఆలాగుననే, మానవ శరీరము యొక్క బలహీనతల మీద దాడి చేయుచున్న సాతానును చూడండి. ఆలాగుననే, అపవాదిని మన బలహీనతల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు.

నా ప్రియులారా, మీరు, 'నేను సాతానును ఎలా ఎదిరించగలను?' అని అడగవచ్చును. కానీ నా స్నేహితులారా, నేను మీకు చెబుతున్నాను, ఈ వచనం ఇలాగున చెబుతుంది, "కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. మీరు ప్రభువును మీ హృదయంలోనికి అంగీకరించి, మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నప్పుడు, మీరు దేవుని ఆత్మను మీలో శక్తిగా పొందుతారు. మీ హృదయం ఎంతగా నిండిపోతుందంటే, అది సాతానుకు ఒక అసమాన పోరాటంగా మారుతుంది. దేవా, నీలోని శక్తి ఎంత గొప్పగా మారుతుందంటే, మీరు ఇలా అంటారు, 'సాతానా, నాకు నీవు అవసరం లేదు. నా దగ్గర నుండి దూరంగా పారిపొమ్ము. దేవుడు నా హృదయంలో మండుచున్నాడు. నా దగ్గర సమస్తమును కలిగి ఉన్నాయి' అని చెప్పినట్లయితే, సాతానుకు ఏమాత్రం అవకాశం లేకుండానే యుద్ధంలో ఓడిపోతాడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు, దేవుడు మీకు ఇవ్వబోయే కృప ఇదియే. నేడు అటువంటి కృపను మీరు పొందుకోవాలని తలంచినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, దేవుని ఎదిరించే శక్తిని మాకు దయచేయుము. దేవా, మా బలహీనతలో అపవాది మమ్మును శోధించినది ఇక చాలు. యేసయ్యా, అపవాది మమ్మును మరియు మా కుటుంబమును ఓడించి, మాతో పాపం చేయించడం చాలు. ఇంకను మా జీవితంలో తెలివితక్కువ నిర్ణయాలు తీసుకునేలా అపవాది పన్నిన కుట్రలను మా నుండి తొలగించి, మమ్మును నీ బిడ్డలను మార్చుము. ప్రభువా, సాతానుకు లోబడినందుకు మమ్మును క్షమించుము. దేవా, మాకు నీ కృప ఎంతో అవసరము కనుకనే, మాలోనికి నీ శక్తి ఎంతో అవసరమై యున్నది మరియు నీ ఆత్మ పరిపూర్ణతను మాకు అనుగ్రహించుము. దేవా, ఇప్పుడే మమ్మును ప్రతిరోజు నీ కృపతో నింపుము. ప్రభువా, మేము యేసుతో నిండి ఉండునట్లుగా చేయుము మరియు దేవుని శక్తి ద్వారా మా యొక్క ప్రతి శోధనను మేము ఎదిరించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఇకపై బలహీనంగా ఉండకుండ, మా బలహీనతలో, నీ బలం మాలో సంపూర్ణముగా నింపబడునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాలో పరిపూర్ణమగునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.