నా ప్రియమైన స్నేహితులారా, నేడు మిమ్మును పలకరించడము నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. కనుకనే, నేటి దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 33:27వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును...'' అన్న వచనము ప్రకారము దేవుడు నిత్యము నీకు నివాస స్థలముగా ఉంటాడు. మనకు ఇది ఎంత గొప్ప ఆదరణ కదా! ఆయన హస్తములు ఎంతో గొప్పవిగా ఉన్నవి. ఆయన తన చేతులతో మిమ్మును చేపట్టుకుంటాడు. దేవుడు అనుగ్రహించు ఇట్టి ఆశ్రయములో మీరు ఎంతగానో శాంతిని సమాధానమును అనుభూతి చెందుతారు. గొప్ప ప్రమాదములో ఏ మాత్రము మేము మ్రింగివేయబడము అను ఆదరణను మేము అనుభూతి చెందియున్నాము కనుకనే, మీరు అంతము కారు, ఎన్నటికిని మనము నశింపజేయబడము. కాబట్టి, మీరు, 'ప్రభువా, నీవే నా ఆశ్రయ స్థానము' అని ఆయన యందు విశ్వాసముంచి, నిరీక్షణ ఉంచి, ప్రార్థించినప్పుడు, అట్టి శాంతిని మీరు అనుభూతి చెందుతారు. నా ప్రియ స్నేహితులారా, మన ఆశ్రయ స్థానముగా మనము ఆయన వైపు చూచెదము.
నా ప్రియులారా, పై వచనము ఈలాగున చెబుతుంది, "నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును...'' అని చెప్పబడిన ప్రకారముగా ఆయన ఎప్పటికి మనలను ఒంటరిగా వెళ్లిపోవనివ్వడు. ఆయన ఎన్నటికిని మనలను విడువడు. మీరు ఈ బాహువుల మీద నిరీక్షణ ఉంచవచ్చును. ఈ లోకములో మనము ఏ నరుని కూడా నమ్మలేకపోవుచున్నప్పటికిని, వారు ఒకవేళ మిమ్మును పట్టించియుండవచ్చును. చివరికి, సన్నిహితులైనవారును కూడా మిమ్మును త్రోసివేయబడియున్నారేమో? కానీ, ఆయన బాహువులు నిత్యమైనవి. ఒక ఫర్యాయము మేము ఒక సభకు వెళ్ళియున్నాము. అక్కడ ఒక గొప్ప ప్రార్థన సమావేశము జరిగించబడినది. ఆ తర్వాత మేము కారులోనికి ఎక్కి ప్రయాణమై ఆ స్థలమునకు వెళ్లుచుండగా, ఆ మార్గములన్నియు కూడా జలమయమై ఉండుట మేము గమనించియున్నాము. అక్కడ ఎక్కువగా వర్షములు పడుచుండెను. అయితే, ఆ కూటము జరుగుచున్న స్థలములో ఏ మాత్రము కూడా వర్షము పడలేదని మేము విన్నాము. ఇంతకు అది బహిరంగ స్థలముగా ఉన్నది. అక్కడ ప్రజలకు ఏ విధమైన అవాసము కూడా లేదు. అంతమాత్రమే కాదు, ఏ వర్షము లేకుండా మేము ఆ కూటమును చక్కగా నిర్వహించగలిగాము. హల్లెలూయా!
కానీ, ఆ మైదానమునకు వెలుపల ఉన్న ప్రాంతమంతయు అక్కడ ఉదయకాలమున ఎక్కువగా వర్షము పడినట్లుగా మేము గమనించాము. అది చూచి, మేము ఆశ్చర్యమును పొంది, ఆ పట్టణములో ఉన్న ప్రజలను అడిగాము. వారు, మీకు మరియు మీ మైదానములో వర్షము పడలేదా? అని మమ్మును అడిగియున్నారు. అందుకు వారు, ఆ మైదానము తప్ప ఆ మిగిలిన ప్రాంతములన్నియు వర్షము కురిసినది అని వారు మాకు తెలియజేశారు. ఇది ఎంత గొప్ప మహా అద్భుతమై యున్నది కదా! అక్కడ మేము దేవుని హస్తమును చూచియున్నాము. ప్రజలు ఆయన వాక్కు కొరకు ఆయన చెంతకు వచ్చియుండగా, ప్రభువు హస్తము వారిని భద్రపరచియున్నది. అవును, నా ప్రియులారా, నిత్యుడైన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై యున్నాడు. దేవుడు మమ్మును ప్రేమించుచున్నాడు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన సూచనగా ఉన్నది. ఆయన తన ప్రజల కొరకు జాగ్రత్త వహిస్తాడు అని నిదర్శనమైన ఒక గొప్ప కార్యముగా ఉన్నది. కనుకనే, నా ప్రియులారా, దేవుడు మీ కొరకు కూడా ఆయన గొప్ప మోతాదులో జరిగిస్తాడు. కనుకనే, మీరు ప్రమాదములను గురించి చింతించకండి. మీరు ఇప్పుడే ఆశ్రయమైన ఆయన యొద్దకు వచ్చి, ఆయన బాహువులలో సురక్షితముగా ఉండుటకు మిమ్మును ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ యొక్క బలమైన హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. తండ్రీ, నీవే మా ఆశ్రయము మరియు బలము అయినందుకు నీకు వందనములు. ప్రభువా, మాకు భయంగా లేదా సందేహంగా అనిపించినప్పుడు, నీ నిత్య బాహువులలో విశ్రమించడానికి మాకు కృపను చూపుము. దేవా, నీవు మమ్మును ఎన్నటికిని విడిచిపెట్టవనియు మరియు ఎడబాయవని మాకు గుర్తుచేసినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క ప్రతి ప్రమాదములన్నిటి మధ్యలో నీ పరిపూర్ణ శాంతితో మా హృదయాన్ని నింపునట్లుగా చేయుము. దేవా, మా యొక్క ప్రతి తుఫాను నుండి మమ్మును కాపాడి, నీకు సమీపముగా మమ్మును ఉంచుము. ప్రభువా, నీ సన్నిధి మమ్మును ఆవరించి, మమ్మును సురక్షితంగా ఉంచుము. దేవా,ఈ రోజు మేము నీ బాహువులలో సురక్షితంగా విశ్రమించుటకు సహాయము చేయుము. ప్రభువా, భయము నుండియు మరియు విచారము నుండి మాకు ఆశ్రయమును కలుగజేయుము. యేసయ్యా, మేము నీ యందలి నిరీక్షణను మరియు మా విశ్వాసమును కోల్పోకుండా, మా విశ్వాసమునకు గొప్ప సమాధానమను బహుమానమును మాకు దయచేయుము. ప్రభువా, నీవు నీ బాహువులను మా మీద కప్పి, నీ సమాధానముతో మమ్మును నింపుము. దేవా, మా సమస్యలన్నియు తొలగిపోవునట్లుగా చేసి, నీ ఒక్క మాటతో మా కష్టములన్నిటికి పరిష్కారమును కలిగించుము. ప్రభువా, మేము కోల్పోయినవన్నియు తిరిగి మాకు సమకూర్చబడునట్లుగా నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


