నా ప్రియ స్నేహితులారా, నేడు మన జీవితములో అన్ని విషయములలో మనకు విజయమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నందున ఆయనకు స్తోత్రములు కలుగును గాక. ఆయన మనకు విజయమును అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు. ఆయనే మరణమును నాశనము చేసి, మరణము మీద విజయమును పొందియున్నాడు. అత్యంత గొప్ప శత్రువు మరణమే. కానీ, యేసుక్రీస్తు మరణమును నాశనమును చేసి, దాని మీద జయమును పొందియున్నాడు. ఆయన మరణమును అధిగమించినవాడుగా ఉన్నందున, మన జీవితములో ప్రతి పరిస్థితిని ఖచ్చితముగా అధిగమించగలవాడు కదా. ఆయన మనలను జీవింపజేస్తాడు. ఆయన మన ప్రతి పరిస్థితి మీద విజయమును అనుగ్రహించుట ద్వారానే. అవును, ఈ రోజు మీరు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నను సరే, ఆయన మిమ్మును పైకి లేవనెత్తి విజయంలో జీవించునట్లుగా చేస్తాడు. అందుచేతనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 108:13వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము మా శత్రువులను అణగ ద్రొక్కువాడు ఆయనే'' ప్రకారం కనుకనే దేవుడు మనకు 'ఇమ్మానుయేలుగా' తోడైయున్నాడు. " నా బిడ్డలారా, నేను మీతో కూడా ఉండు నిమిత్తము వచ్చియున్నాను'' అని సెలవిచ్చుచున్నాడు. యేసు ఈ భూమి మీద జన్మించినప్పుడు, "ఇమ్మానుయేలు'' అను పేరు ఆయనకు ఇవ్వబడినది. దాని యొక్క భావం, "దేవుడు మనకు తోడైయున్నాడు'' అని అర్థం.
నా ప్రియులారా, దేవుడు మనకు తోడై యున్నప్పుడు, ఆయన మనకు విజయమును అనుగ్రహించును. లేఖనము ఈలాగున చెబుతుంది, 'ఆయన మన శత్రువులను పాదముల క్రింద చితుక ద్రొక్కించువాడు' అని చెప్పబడియున్నది. ఈ మధ్య కొంతమంది నన్ను ఏమని అడిగారంటే, దేవుని ప్రజలముగా మనము ఎన్నో శోధనలు మరియు శ్రమల గుండా వెళ్లుతూ ఉంటాము కదా! చెడు ప్రజలు మనకు విరోధముగా తప్పు సంగతులను వ్యాపింపజేయుచుంటారు గదా! అబద్ధములు, ఆలాగే వారు చేతబడి చేస్తుంటారు. తప్పు కార్యాలు చేయడం ద్వారా కుటుంబాలు విడిపోయేలా చేస్తుంటారు, ప్రజలలలో ఉన్న ప్రేమ విడిపోయేలాగున చేయుచూ ఉంటారు. వారు ధనమును ఆశించునట్లుగా మనలను రెచ్చగొడుతుంటారు. అయితే, దేవుడు ఎందుకు వారిని నాశనము చేయలేదు?' అని ప్రశ్నించారు. అందుకు నేను వారికి ఈలాగున ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చాను. "దేవుడు ప్రజలను నాశనము చేయాలన్న పనిలో లేడు. అందుకోసము ఆయన ఈ భూమి మీదికి రాలేదు. కాబట్టి, ఆయన మనలను రక్షించుటకు వచ్చియున్నాడు. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుకు బిడ్డలై ఉన్నారు. ఈ లోకములో ఉన్న ప్రత్తి ఒక్కరు కూడా ఆయనకు బిడ్డలై యున్నారు. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై తన ప్రాణమును సమర్పించాడు. అందరిని ప్రేమించుచున్నాడు. కనుకనే, ఆయన ఎవరిని నాశనము చేయడు. మనకు ఎవరైన కీడు చేసినట్లయితే, దేవుడు వెళ్లి వారిని నాశనము చేయాలని ఎదురు చూడకండి లేక ఆశించకండి. దేవుడు ప్రజలను ఆశీర్వదించే పనిలో ఉండి యున్నాడు. శత్రువులు మీకు విరోధముగా పైకి లేచినప్పుడు, ఆయన వారిని ఏవిధంగా అణగ ద్రొక్కిస్తాడో మీకు తెలుసా? మిమ్మును ఆశీర్వదించడము ద్వారానే. శత్రువు మిమ్మును ఆవరించియున్నప్పుడు దేవుడు మీ యొద్దకు దిగివచ్చి, వారి యెదుట మీ తలను ఆయన అభిషేకించువాడై యున్నాడు. ఆయన మిమ్మును మరియు మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. మీకున్న వాటన్నిటిని మరియు మీలోపల ఉన్న సమస్తమును ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మీ చేతి పనినంతటిని ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మును వృద్ధిపొందింపజేస్తాడు. మీకు శత్రువులుగా చెప్పబడుచున్న లేక మీరు శత్రువులుగా భావించుచున్న వారందరు కూడా, వారు తామే తమ పండ్లు కొరుక్కొని, నశించిపోవుట మీరు చూచెదరు. యూదాకు కూడా ఈలాగుననే జరిగినది. యూదా యేసును పట్టించాడు. యేసు యొక్క శక్తిచేత అతనిని నాశనము చేసియుండవచ్చును. కానీ, అందుకు బదులుగా స్నేహితులారా, 'నీవు ఎందు నిమిత్తము వచ్చియున్నావు' అని అడిగాడు. 'ఆ పనిని చేయుమని' చెప్పాడు. అదియే యేసు. ఆయనను తనను శపించుచున్న వారి నిమిత్తము ఆశీర్వదించువాడై యున్నాడు. తనను శపించున్న వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసియున్నాడు. తనను సిలువ వేసిన వారి యొక్క క్షమాపణ కొరకు ఆయన వారి నిమిత్తము ప్రార్థన చేసియున్నాడు. కానీ, వారు గనుక పశ్చాత్తాపపడక పోయినట్లయితే, యూదా వలె అతడు తనకు తానుగా వెళ్లి, ఉరి పెట్టుకొని చనిపోయాడు. తనను తాను చంపుకున్నాడు.
నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించుట ద్వారా మీకు విజయమును అనుగ్రహించు వ్యాపకములో ఉండియున్నాడు. మీ శత్రువులు పశ్చాత్తాపపడినట్లయితే సరే, లేనట్లయితే, వారు మీకు శ్రేష్టమైన స్నేహితులు కావాలి. లేక వారే స్వయంగా తమ్మును తాము నాశనము చేసుకోవాలి. కనుకనే, ప్రియులారా, మనము మన శత్రువులను గురించి, ఏ మాత్రము కూడా విచారించవద్దు, మన మీద తప్పుపట్టిన వారిని గురించి మనము ఏ మాత్రము చింతించకూడదు. బైబిల్‌లో యోబు వలె మనము కేవలము వారి నిమిత్తము ప్రార్థించాలి. వారి రక్షణ కొరకు భారముతో దేవుని సన్నిధిలో మొఱ్ఱపెట్టాలి. అయితే, యోబునకు వలె మీరు కోల్పోయిన సమస్తమును మీకు రెండింతలుగా అనుగ్రహించి, ఆశీర్వదించి మీకు మరల ఇస్తాడు. ఇటువంటి విజయమును దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. నా ప్రియులారా, ఇటువంటి విజయమును మనము పొందుకొనెదము. ఈ రీతిగా దేవుడు మన పట్ల కార్యమును జరిగిస్తాడు. దేవుడు మనకు తోడైయున్నాడు. కనుకనే, దేవునిని మన పక్షముగా కలిగియుండుట ద్వారా విజయమును సంపాదించుకుందాము. దేవుడు మిమ్మును వెయ్యిమందిగా చేయును. మీ రు ఆయనతో కూడా పరసంబంధమైన స్థలములలో నడుచుచూ, లక్షలాది మందికి దీవెనకరముగా ఉంటారు. మిమ్మును ప్రేమించుటకు లక్షల కొలది ఉంటారు. నా జీవితములో దీనిని నేను నేర్చుకున్నాను. కనుకనే, మనము యేసుతో కూడా సంతోషముగా జీవించెదము. శత్రువులు పశ్చాతపపడతారు. లేనట్లయితే, తమ్మును తాము నాశనము చేసుకుంటారు. కానీ, లక్షల మంది మిమ్మును ప్రేమిస్తారు. దేవుడు తనతో కూడా మీరు ఉండులాగున ఉన్నతమైన స్థలములకు తీసుకొని వెళ్లాతాడు. తగిన సమయమందు ఆయన మిమ్మును పరలోకమునకు చేర్చుకుంటాడు. నేడు దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానముగా ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, నీవు 'ఇమ్మానుయేలు'గా ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు మరణాన్ని నాశనం చేసి, మా జీవితంలోని ప్రతి పరీక్షలో మాకు విజయం ఇచ్చినందుకై నీకు వందనాలు. తండ్రీ, నీ యొక్క దైవీక స్వభావమును మాకు అనుగ్రహించి, నిన్ను ఎల్లవేళల మాతో కలిగి ఉండునట్లుగాను, ఇటువంటి గొప్ప విజయమును మేము సంపాదించుకొనునట్లుగాను, ప్రతి ఒక్కరిని క్షమించునట్లుగాను, సంతోషమును, అటువంటి కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్య, కేవలము నీ ద్వారా మేము అత్యధికమైన విజయమును పొందుకొనునట్లుగాను, నీ ద్వారా మేము దీవించబడునట్లుగా కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము నిన్ను ప్రేమించుచున్నాము. ప్రభువా, మాలో దుష్టత్వం, అబద్ధాలు మరియు ద్రోహం ఉన్నప్పటికీ, నీవు మా మేలు కొరకు పనిచేస్తున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా శత్రువులపై మేము కీడు కోరుకోనకుండా, మేము వారి కొరకు ప్రార్థించునట్లుగాను మరియు నీవు చేసినట్లుగా వారిని ఆశీర్వదించుటకు మాకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. ప్రభువా, మాకు విరోధముగా వచ్చువారిని క్షమించడానికి నీ కృప, సహించడానికి ధైర్యం మరియు నీవు మా యుద్ధాలతో పోరాడుతున్నావని నమ్మడానికి నీ యొక్క విశ్వాసంతో మమ్మును నింపుము. దేవా, మా తలను నూనెతో అంటి, మా జీవితంలో కోల్పోయినవాటన్నిటిని రెండంతలుగా పునరుద్ధరించుము. దేవా, మేము మా పరలోక నివాసానికి చేరుకునే వరకు నీ వెలుగులో నడవడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.