నా ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రజల చేత ఎప్పుడు ప్రేమించబడెదరు? మనమందరము కూడా ప్రజల చేత ప్రేమించబడాలని కోరుకుంటాము. దేవుని చేత ప్రేమించబడడానికి ఎంతగానో ఆశిస్తాము. అవును, మీరు అందరు చేత ప్రేమించబడలేరు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 16:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును'' అని చెప్పబడిన ప్రకారము మనుష్యులు లక్ష్యపెట్టువాటిని దేవుడు లక్ష్యముంచువాడు కాదు. ప్రజలు బహిరంగమైన పై రూపమును చూచెదరు. కానీ, ప్రభువు అయితే, హృదయాంతరంగమును చూచువాడైయున్నాడు. ఎవరైనా వేరే వ్యక్తిని ప్రేమించాలంటే, వారి యొక్క బాహ్యరూపముపై లక్ష్యముంచుతారు. వారి యొక్క భౌతిక రూపు రేఖలను మరియు వారు కలిగియున్న పేరు ప్రఖ్యాతులను, వారు కలిగియున్న ధనములను ఆ విధంగా ప్రేమించుటకు ప్రయత్నము చేస్తారు. కానీ, ఆ ఇతర వ్యక్తులు వీరిని ప్రేమించకపోవచ్చును. తద్వారా, వారి జీవితమును విషాదము ద్వారా అంతమైపోతుంది. ఒక నటుడిని గురించి ఈలాగున వ్రాయబడియున్నది. తన మొదటి చిత్రమును విడుదల చేసియున్నప్పుడు, చాలా ప్రఖ్యాతి గడించాడు. ఒక అమ్మాయి ఈ యొక్క చిత్రమును వేరొక దేశములో ఉండి చూచినది. ఆ అమ్మాయి, పరుగెత్తుకుంటూ ఆ నటుడు ఉన్న దేశమునకు వచ్చినది. ఆ నటుడిని వెంబడించినది. తన ప్రేమను అతనితో పంచుకొనెను. వారికి వివాహమైనది. కానీ, చాలా సంవత్సరముల తర్వాత, ప్రేమంతయు తరిగిపోయినది. ఆమె ఇంక ప్రేమను పొందుకొనలేకపోయినది.

నా ప్రియ స్నేహితులారా, మీ హృదయమును ఆయన ఏ రీతిగా ఎల్లవేళల చూచుచున్నాడని, అందును బట్టి, మీ హృదయమును ఆయనతో పెనవేసుకొనునట్లుగా ఉండనివ్వండి, అప్పుడు ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. మీ హృదయము ఆయన కొరకు ఎదురు చూస్తుండగా, లేక ఆశించుచూ, ఆయన వైపు మళ్లుకొని యుండగా, ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 7:13వ వచనమును చూచినట్లయితే, " ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మిమ్మును ప్రేమిస్తాడు, ఆయన మిమ్మును దీవిస్తాడు, ఆయన మిమ్మును వృద్ధిపొందింపజేస్తాడు. నా ప్రియులారా, మీరు ఆయన చేత ఏర్పరచుకొనియున్న బిడ్డలుగా ఉన్నారు, కనుకనే, మీరు ఆయనను ప్రేమించుచున్నారా? లేదా? మీరు అన్నిటి కొరకు ఆయన మీద నిరీక్షణ ఉంచియున్నారా? లేదా? ఆయన మీకు మేలు చేస్తాడని మీరు విశ్వసించుచున్నారా? లేదా? అని ఆయన మీ హృదయములలోనికి మిమ్మును పరిశీలించి చూచుచున్నాడు. అప్పుడు ఆయన మిమ్మును కూడా ప్రేమిస్తాడు. మీరు ఆయన ప్రేమను ఆనందించెదరు. మీరు దేవుని ప్రేమను ఆనందించు చూ, మీ జీవితమును జీవించుచూ, కొనసాగించుచుండగా, అందరు కూడా మిమ్మును ప్రేమించగలుగుతారు. అందరు కూడా మిమ్మును ప్రేమించుటకు ప్రారంభిస్తారు. ఈ లోకములో ప్రేమను స్వీకరించుటకు ఇదియే మర్మమై యున్నది. దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. అందుకే బైబిల్ నుండి సామెతలు 21:2వ వచనములో చూచినట్లయితే, " ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు '' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మన హృదయాలను పరిశీలన చేయుచున్నాడు. కనుకనే, మీరు మీ హృదయమును భద్రముగా కాపాడుకొనవలెను.

అందుకే బైబిల్ నుండి 1 దినవృత్తాంతములు 28:9వ వచనములో మనము చూచినట్లయితే, దావీదు తన కుమారుడైన సాలొమోనుతో ఈలాగు చెప్పుచున్నాడు, " సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. '' ఇంకను, దావీదు ' నా కుమారుడా, మీ తండ్రియైన దేవుని యందు లక్ష్యముంచుము, దేవుడు మీ తండ్రితో కూడా ఉన్నాడు కదా అని అంతటితోనే సంతృప్తి చెందవలసిన అవశ్యకత లేదు. నీవు ఆయనను నీ తండ్రిగా చేసుకొనవలెను. రెండవదిగా, నీ సంపూర్ణమైన హృదయముతోను, ఆలాగే ఇష్టమైన మనస్సుతోను దైవభక్తికలిగి దేవుని సేవించండి. మీ తల్లిదండ్రులు మీరు ప్రభువును వెంబడించుట కొరకు, మిమ్మును ఒత్తిడి చేయునట్లుగా ఉండకూడదు. ఎందుకనగా, ప్రభువు ప్రతి హృదయమును కూడా పరిశీలన చేయువాడై యున్నాడు. మీరు ఆయనను వెదకినట్లయితే, ఆయన మీ ద్వారా కనుగొనబడతారు. కనుకనే, ఆయనను మీరు వెదకువారుగా ఉండండి. బైబిల్‌లో యోబు భక్తుడు అటువంటి వ్యక్తిగా ఉండియున్నాడు. యోబు గ్రంథము 1:8వ వచనములో చూచినట్లయితే, "అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడెవడును లేడు'' అని దేవుడు యోబును గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవుడు, 'యోబు వంటివాడెవడును లేడు' అని సెలవిచ్చుచున్నాడు. దేవుడు సాతానుతో, ఈ సంగతి చెప్పుచున్నాడు, ' నా కుమారుడైన యోబు నిందారహితుడై యున్నాడు. యథార్ధవంతుడు, దేవునికి భయపడువాడును, దుష్టత్వమును, కీడును దూరముగా ఉంచువాడై యున్నాడు. కనుకనే, యోబునకు బహుమానము అనుగ్రహించబడియున్నది. బైబిల్ నుండి యోబు 1:9,10 వ వచనములలో చూచినట్లయితే, "అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది '' అని చెప్పబడినట్లుగానే, యోబు చుట్టు ఒక కంచె వేయబడియున్నది. రెండవదిగా, ఆయన కుటుంబము చుట్టు మరియు తన కుటుంబ సభ్యుల చుట్టు ఒక కంచెను వేసియున్నాడు. మూడవదిగా, యోబునకు కలిగియున్న సమస్తము చుట్టు ఒక కంచెను వేసియున్నాడు. నాల్గవదిగా, దేవుడు యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించియున్నాడు. అంతమాత్రమే కాదు, అతని యొక్క స్వాస్థ్యము, సంపద, ఆస్తియంతయు పెరుగుచూ, విస్తరించుచునే ఉన్నది. అవును, నా ప్రియులారా, మీరు కూడా అటువంటి ధృవపత్రమును పొందియుండాలి. మీ హృదయము దేవుని యెదుట లోపరహితముగా ఉండాలి. ఆయన మిమ్మును చూచియున్నప్పుడు, మీరు ఆయన యందు నమ్మిక కలిగియున్న హృదయమును కలిగిన వారుగా యుండాలి. అది ఆయన మీద ఆధారపడు హృదయమును మీరు కలిగియుండాలి. అప్పుడు ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు అటువంటి హృదయమును దేవుడు మీకు ఇవ్వాలని కోరుచున్నాడు. కనుకనే, నేడు మన హృదయాలను పరిశీలన చేయుచున్న దేవుని హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుని యొక్క ప్రేమ మీ హృదయములో కుమ్మరించి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఇట్టి ప్రేమగల హృదయమును, ఎల్లవేళల నిన్ను ప్రేమించునట్లుగా మాకు అనుగ్రహించుము. ప్రభువా, ఇటువంటి ప్రేమగల హృదయముతో మేము అందరిని ప్రేమించునట్లుగా మాకు నీవు సహాయము చేయుము. తండ్రియైన దేవా, మా హృదయాన్ని పరిశోధించి, నీ ఎదుట దానిని సరిచేయుము. ప్రభువా, నీకు ఇష్టం లేని ప్రతిదానిని మాలో నుండి తీసివేసి, నీ ప్రేమతో మమ్మును నింపుము. దేవా, నిన్ను మా పూర్ణ మనస్సుతో నమ్మడానికి, నీపై ఆధారపడటానికి, మరియు మా పూర్ణ హృదయంతో నిన్ను వెదకడానికి మాకు నేర్పించుము. ప్రభువా, మేము ప్రజల మెప్పు కోసం పాకులడకుండా, నీకు సంతోషాన్ని కలిగించేలా జీవించడానికి మాకు నేర్పుము. దేవా, నీ ప్రేమ మా జీవితాన్ని నింపి, ఆ ప్రేమ మా ద్వారా ఇతరులకు పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితం ఎల్లప్పుడూ నీ దృష్టికి ప్రీతికరంగా ఉండునట్లుగా చేయుము. యేసయ్యా, నీ యొక్క ప్రేమను ఇతరులతో కనుపరచునట్లుగా మమ్మును నీ యొక్క ప్రేమతో నింపుము. దేవా, అన్నిదిశల నుండి ప్రేమ మా యొద్దకు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ప్రేమ మా చెంతకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మా కుటుంబములో ఉన్న అందరి ప్రేమ మాయొద్దకు వచ్చునట్లుగా చేసి, ఈ లోకములో ఉన్న సకల ప్రజల యొక్క ప్రేమ మా చెంతకు వచ్చునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, ఇటువంటి ఆశీర్వాదము కొరకు, మరియు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించుచున్నందుకై నీకు వందనములు. దేవా, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ప్రేమను మా మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.