నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు యేసు పిలుచుచున్నాడు క్యాలెండర్‌లోను మరియు యాప్ ద్వారా నేటి వాగ్దానమును మీరు చూడగలరు. మేము మా యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ వాగ్దానములను పొందుపరుచుచున్నాము. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 25:8 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో చూచినట్లయితే, "మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువులను తుడిచి వేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు'' అన్న వచనము ప్రకారము దేవుడు మీ యొక్క ముఖము మీది ప్రతి బాష్పబిందువులను తుడిచివేయాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ఎంత గొప్ప వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు కదా. నా ప్రియులారా, ఒకవేళ, నేడు మీరు మరణపు మార్గము గుండా వెళ్లుచుండవచ్చును. మీ వివాహ బాందవ్యము మరియు ఇతర కార్యములు మీ జీవితములో మృతమైనవిగా మీకు కనిపించుచుండవచ్చును. ఒకవేళ మీరు విడిపోవవలెనని తలంచుకొని ఉండవచ్చును, మీ వైవాహిక జీవితంలో బంధాలు అంతరించిపోవుచుండవచ్చును. అలాగే, మీ వృత్తిపరమైన జీవితంలోనూ పరిస్థితులు క్షీణించిపోవుచుండ వచ్చును; మీ యొక్క కళాశాల జీవితములో కూడా మీకు ఓటమిలు ఎదురవుచుండవచ్చును లేదా మీరు ఉద్యోగమును పొందడంలో మీరు విఫలమవుచుండవచ్చును. అవును స్నేహితులారా, ఈ కార్యములన్నిటి ద్వారా మీకు తీవ్రమైన అవమానమును, సిగ్గును కలిగించవచ్చును. అయితే, మీరు దేవుని కుమారులు లేదా కుమార్తెలుగా జీవించినప్పటికిని, మీరు విఫలమవుచున్నట్లుగా మీకు అనిపించవచ్చును. అయితే, చింతించకండి; మీ జీవితములో మరణమును శాశ్వతంగా మ్రింగివేస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

నా ప్రియులారా, యేసుక్రీస్తు సిలువ మీద చేసిన త్యాగ పూరితమైన కార్యము ఈ రోజే మీ జీవితములోనికి దిగివస్తుంది. అవును, యేసు మీ హృదయం లోనికి వచ్చునప్పుడు, మరణము మీద ఆయన సాధించిన విజయం కూడా మీ జీవితములోనికి దిగివస్తుంది. ఆయన మీ జీవితములో ఆ మార్గమును పునరుజ్జీవింపజేయుచున్నాడు. ఆయన మీ వైవాహిక జీవితమును మరల పునరుద్ధరించుచున్నాడు. నా స్నేహితులారా, మీ యొక్క ఓటమి నుండి మిమ్మును పైకి లేవనెత్తి మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఆలాగే మీ నష్టాలను పూరించి మీ వ్యాపారమును తిరిగి నిలబెట్టి, స్థిరపరుస్తాడు. ఆయన మీ జీవితంలో ప్రేమను తిరిగి చిగురింపజేస్తాడు. మీ కుటుంబ జీవితములోని మీ వివాహ బంధము మరల బలపరచుచున్నాడు. ఆయన మీ యొక్క ప్రతి కన్నీటి బాష్పబిందువులను తుడిచివేయుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, చింతించకండి. ఈ రోజు, దేవుని వాగ్దానమును విశ్వాసముతో పొందుకొనండి; మీ జీవితములోనికి మృతతుల్యమైన పరిస్థితులన్నిటిలోను ఆయన పొందియున్న విజయమును మీరు అనుభవించెదరు.

మేము నిర్వహించుచున్న యేసు పిలుచుచున్నాడు కూటములలో, ఒక కూటములో ఒక స్త్రీ పాల్గొన్నారు. ఆమె, వ్యక్తిగతంగా ప్రార్థించుకొనుట కొరకు ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె ఇలాగున చెప్పారు, 'అయ్యా, లక్షల రూపాయల అప్పుల భారముతో నా జీవితం కుప్పకూలిపోవుచున్నది. నా ఆర్థిక పరిస్థితి సమతుల్యముగా ఉండుట లేదు. ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నా అప్పులన్నియు తీరునట్లుగా ప్రార్థించండి అని చెప్పెను.' పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించిన విశ్వాసంతో నేను ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించాను. చూడండి, ' దేవుడు నా అప్పులన్నింటిని తీర్చియున్నాడు. ఈ దుస్థితి నుండి దేవుడు నన్ను విడిపించియున్నాడు. అంతమాత్రమే కాదు, నా జీవితములో దేవుడు నాకు నూతన నిరీక్షణను అనుగ్రహించియున్నాడు' అని తన సాక్ష ్యమును పంచుకున్నారు. ఆమేన్. నా ప్రియులారా, దేవుడు మీ విషయములో కూడా అలాగుననే జరిగిస్తాడు.

కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ఈ వాగ్దానమును విశ్వాసంతో అంగీకరిం చండి మరియు దేవుడు మీ జీవితములోని ప్రతి రంగమును పునరుద్ధరి స్తాడని నమ్మండి. ఆయన మీ కన్నీటిని తుడిచి, మీ అవమానమును తొలగించి, అంతా నశించిపోవుచున్నట్లుగా అనిపించిన చోట నూతన నిరీక్షణను తీసుకొని వస్తాడు. నా ప్రియులారా, మీరు ప్రభువును విశ్వసించండి. ఎందుకంటే, మీ జీవితములో మృతమైన దానిని మరియు ఆయన నశించిపోయినదానిని మరల పునరుద్ధరింపజేసి, మీకు సంపూర్ణ విజయమును అనుగ్రహిస్తాడు. కనుకనే, మీరు ప్రభువు యందు ఆనందించండి. ఎందుకనగా, దేవుడు ఈ రోజు మీ జీవితములో ఒక అద్భుతము చేయుచున్నాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీవు మరణమును శాశ్వతముగా మ్రింగివేసి, మీ ప్రతి కన్నీటిని తుడిచివేయుము. దేవా, మా జీవితములో నశించిపోవుచున్న ప్రతి భాగమును గాన్ని పునరుద్ధరింపజేసి, మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, మృతమైన మా వివాహ జీవితమును, వృత్తిని, ఆర్థిక పరిస్థితిని, సంబంధములను మరియు నిరీక్షణను పునరుద్ధరించుము. ప్రభువా, మా జీవితము నుండి ప్రతి అవమానమును మరియు నిందను తొలగించి, వాటి స్థానంలో ఆనందమును, సమాధానముతోను మరియు విజయముతోను నింపుము. యేసయ్యా, మా యొక్క ప్రతి అనారోగ్యమును నీ గాయముల ద్వారా తాకి మా శరీరమును స్వస్థపరచి, మా యొక్క ప్రతి క్లిష్టమైన పరిస్థితిని అధిగమించ డానికి మాకు బలమును అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క పునరుద్ధరించు శక్తిని విశ్వసించడానికి మరియు మా జీవితములో నీవు ఒక గొప్ప అద్భుతమును జరిగించుము. దేవా, మా జీవితములోని ప్రతి రంగములో నీ యొక్క విజయము కనుపరచి, మమ్మును విజయవంతులనుగా మార్చుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.