నా ప్రియమైన స్నేహితులారా, మనము ఈ నెల ఆఖరునకు వచ్చియున్నాము. దేవుడు మీకు ఎంతో నమ్మకమైనవానిగా మేలుకరమైన వానిగా ఉండి ఉంటాడు. ఈ రోజును కూడా బైబిల్ నుండి దేవుని యొద్ద నుండి మంచి వాగ్దానము మన యొద్దకు వచ్చుచున్నది. ఆ వాగ్దానము కీర్తనలు 48:14వ వచనమును మనము చూచినట్లయితే, "ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును'' అని చెప్పబడినట్లుగానే, సదాకాలము దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇది ఎంతటి గొప్ప వాగ్దానము కదా! ఈ గొప్ప దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.
మా తాతయ్యగారి నడిపింపులో మా తండ్రిగారు ఆదరణ పొందుకుంటూ, ఎంతగానో ముందుకు కొనసాగి వెళ్లుచుండెను. మా తాతయ్యగారు మా నాన్నగారికి దారి చూపుతూ, సమాలోచన చెప్పి, ఆయన సహకరించేవారు. 2008వ సంవత్సరములో మా నాన్నగారు తన తండ్రిగారైన మా తాతగారిని కోల్పోయినప్పుడు, మా తండ్రిగారు దేవుని యొద్ద మొఱ్ఱపెట్టారు. తన తండ్రిగారిని కోల్పోయి తన హృదయము బ్రద్ధలైన స్థితిలో ఉండియున్నారు. కానీ, ఒక ప్రత్యేకమైన రోజు, మార్చి 14వ తేదీన, ప్రభువు మా తండ్రిగారిని గొప్ప ఆత్మచేతను మరియు అభిషేకము చేతను, ఆయనను నింపియున్నాడు. దేవుడు మా తండ్రిగారితో ఈలాగున మాట్లాడియున్నాడు, 'నా కుమారుడా, చింతించకు, నేను నీకు తండ్రిగా ఉంటాను, మీ తండ్రి ఇక లేడు కదా, కనుకనే, ఇక మీదట నేనే నీకు తండ్రిగా ఉంటాను. నీ ద్వారా, నీవు మోయవలసిన వారినందరికి నేనే తండ్రిగా ఉంటాను. నా భారము నీకు సుళువుగా తేలికగా ఉంటుంది. నేటి వరకు కూడా తన పరలోకపు తండ్రియైన దేవుడు తనతో మాట్లాడే అనుభవమును మా తండ్రిగారు కలిగియున్నారు. మా నాన్నగారు చేయవలసిన ప్రతి కార్యమును గురించి వేకువనే, ప్రభువు మార్గమును చూపించి, నడిపిస్తాడు. మా తండ్రిగారి ఆత్మకు ఆయన సమాధానమును మరియు ఆదరణను అనుగ్రహించి, భూసంబంధమైనవారికంటె మిన్నగా, ప్రభువు ఏ విధంగా నన్ను మోసియున్నాడన్న ఆ యొక్క అనుభూతిని పొందుకుంటారు. మా తల్లిగారు కూడా ఆ విధంగా ఒక పుస్తకమును రచించియున్నారు. ' ఆయన నన్ను మోసియున్నాడు ' అను పుస్తకమును వ్రాసియున్నారు. ఆమె తన తల్లిగారిని, తండ్రిని మరియు తన సహోదరుని కోల్పోయిన సమయములో, ప్రభువు తన అభిషేకము చేతను మరియు బలము చేతను, కృపచేతను దేవుడు ఏ విధంగా మోసి నడిపించియున్నాడని ఆమె ఆ పుస్తకములో వ్రాసియున్నారు.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున కూడా మీరు మీ ప్రియులైన వారిని ఎవరినైనా కోల్పోయి ఉన్నారేమో? లేక ఈ లోకములో మీరు ఒంటరి తనముగా ఉన్నారని అనిపించుచున్నదేమో? ప్రజలు ఒకవేళ మిమ్మును విడిచిపెట్టినట్లుగా ఉన్నారేమో? లేక మీకు సమాలోచన చెప్పుటకు ఎవ్వరు కూడా మీకు దొరకడము లేదేమో? అయితే, నా ప్రియ స్నేహితులారా, మీరు ఒంటరివారు కారు, ఈ దేవుడు మీకు నిరంతరమునకును కూడా దేవుడై యున్నాడు. ఎంత ఆనందము కదా! ఆయన అంతము వరకు మీకు మార్గము చూపిస్తూ, మిమ్మును నడిపిస్తాడు. నా ప్రియులారా, మనము ఒంటరిగా ఉండుట కూడా మంచిదే. మనము దేవునితో ఒంటరిగా ఉంటాము. ఆయన మనకు ఈ లోకములో ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా మనలో ప్రతి ఒక్కరము కూడా సమాలోచనను మరియు దిశానిర్దేశమును పొందుకుంటాము. నా ప్రియులారా, అటువంటి కృపను ఇప్పుడు మీరు పొందుకోవాలంటే, మిమ్మును మీరు దేవుని హస్తములకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నిరంతరము మీతో కూడా ఉంటాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మేము ఎల్లప్పుడు నీతో నడుచునట్లుగాను, నీతో మాట్లాడుటకును నీతో కూడా ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ స్వరమును ఆలకించుటకు మాకు సహాయము చేసి, మా ఆత్మను ఇప్పుడే తెరవజేయుము. దేవా, మరణము అవుచున్నాము అని మొఱ్ఱపెట్టుచున్న మా ఆత్మను మరియు నిరీక్షణ లేని ఆత్మ, ఒంటరిగా ఉన్న ఆత్మను నీతో అనుసంధానము అగునట్లుగా చేయుము. ప్రభువా, మా ఆత్మను యేసు స్వరమునకు తెరవజేయుటకు నీకు అప్పగించుకొనుచున్నాము. దేవా, మేము నీ వాక్కు ద్వారా నీ స్వరమును ఆలకించుటకును, మా హృదయము నిన్ను గుర్తెరుగుటకును మాకు కృపను దయచేయుము. ప్రభువా, నీ చిత్తమును తెలుసుకొని, అందులో నడుచుటకు నీ సన్నిధితో మమ్మును నింపుము. దేవా, మేము ఒంటరిగా ఉన్నప్పుడు, మీ సన్నిధితో మమ్మును ఆదరించి, మా హృదయమును నీ యొక్క సమాధానముతో నింపుము. యేసయ్యా, మేము తీసుకొను ప్రతి నిర్ణయంలో మమ్మును నడిపించుము. దేవా, నీ వాక్యము, ఆత్మ ద్వారా నీ యొక్క స్వరమును వినుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మా ప్రియులైన వారిని కోల్పోయిన మమ్మును బలపరచుము. దేవా, విడువబడిన స్థితిలోను లేదా నిరాశతో ఉన్న మమ్మును నీ యొక్క సన్నిధితో ప్రోత్సహించుము. యేసయ్యా, నీ యొక్క చిత్తానుసారంగా నడుచుటకు మాకు నీ యొక్క దైవీకమైన ఆలోచనలను, జ్ఞానము మరియు కృపను అనుగ్రహించుము. దేవా, మేము ఎటువంటి పరిస్థితిలో నీ యందు నమ్మిక ఉంచడానికి మరియు ప్రతిరోజు నీకు సమీపముగా ఉండటానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, అంతము వరకు మేము సహించుటకును నీ ఆదరణ, బలమును ఇచ్చి, మమ్మును నడిపించుటకు మాకు తోడుగా ఉండుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


