నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 92:12వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు '' (కీర్తనలు 92:12) అని చెప్పబడినట్లుగానే, దేవుడు తన పిల్లలు వర్ధిల్లవలెనని, అభివృద్ధి పొందవలెనని మరియు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవలెనని మన పట్ల కోరుకుంటున్నాడు. సాధారణంగా, ఒక ఖర్జూర వృక్షము మొవ్వు వేయుచూ, పొడవుగా పెరిగి, అది నీడను, పోషకరమైన ఆహారమును, తినడానికి ఖర్జూరములను మరియు నివసించడానికి కావలసిన సామాగ్రిని ఎలా అందించుచున్నదో, అలాగే, మన జీవితము లు మన పిల్లలకు, మనవ సంతానమునకు, పనిచేయు స్థలములకు, వ్యాపారములకు మరియు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయమందించువారుగా నిలిచియుంటూ, వారిని ఆశీర్వదించవలెనని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు కలవరపడకండి.
నా ప్రియులారా, ఆయన మనలను అరణ్యము నుండి సేదతీరునట్లుగాను, సమృద్ధిగల మరియు శ్రేయస్సుగల చోటైన 'ఏలీములోనికి' తీసుకురావలెనని మన పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 15:27వ వచనములో చూచినట్లయితే, "తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యాత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి'' అని చెప్పబడినట్లుగానే, ఏలీమును, పండ్రెండు నీటి బుగ్గలును మరియు డెబ్బది యాత చెట్లు గల ప్రదేశముగా వర్ణింపబడియున్నది. దేవుడు అరణ్యము వలె ఉన్న జీవితములను ఆశీర్వాదకరమైన ప్రదేశముగా మార్చుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి యోవేలు 2:26వ వచనములో చూచినట్లయితే, "మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులు ను పసరు పురుగులును చీడ పురుగులును అను నా మహా సైన్యము తిని వేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును'' అని చెప్పబడినట్లుగానే, మనము ఆయన నామమును స్తుతించవలెను. అవును, నా ప్రియులారా, ప్రభువు మనకు సమృద్ధిని అనుగ్రహించి, మనము సమృద్ధిగా తిని, తృప్తి పొంది, మన పట్ల అద్భుత కార్యములు జరిగించిన ప్రభువు నామమును మనము స్తుతించవలెనని వాక్యము సెలవిచ్చుచున్నది. అందుకే బైబిల్ నుండి ప్రకటన 7:9వ వచనములో చూచినట్లయితే, " అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱె పిల్ల యెదుటను నిలువబడిరి'' అని చెప్పబడినట్లుగానే, ప్రజలు తమ చేతులలో ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను స్తుతించియున్నారు. ఆలాగుననే, బైబిల్ నుండి యోహాను 12:13వ వచనములో చూచినట్లయితే, "ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి'' అని చెప్పబడినట్లుగానే, ప్రజలు ఖర్జూరపు మట్టలతో యేసును యెరూషలేములోనికి ఆహ్వానించి, 'హోసన్నా!' అని కేకలు వేసిన వృత్తాంతము వ్రాయబడియున్నది. కాబట్టి, దేవుడు తన ఆశీర్వాదములను మరియు అద్భుతములతో మనలను తృప్తిపరచినప్పుడు, మనము ఆయనను స్తుతిస్తూ, ఆనందిస్తూ, మహిమపరచగలము.
నా ప్రియులారా, ఆయన రాజ్యమును మనము నిర్మించుటకు మరియు ప్రజల హృదయములను ఆయన మందిరముగా మార్చుటకు సహాయ పడటానికి వీలుగా ప్రభువు మనలను వర్ధిల్లజేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 1 రాజులు 5:6వ వచనములో చూచినట్లయితే, " కాబట్టి, నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రియైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనైయున్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము '' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మందిరమును నిర్మించుటకు సొలొమోను లెబానోను దేవదారు వృక్షములను కోరాడు. నేడు, నా ప్రియులారా, దేవుని మందిరము కేవలము ఒక భౌతిక భవనం మాత్రమే కాదు, అది ప్రజల హృదయాలు కూడా. కనుకనే, మన ద్వారా ఆయన రాజ్యమును నిర్మించబడవలెనని, దేవుడు మనకు ధనమును, ఐశ్వర్యమును, ఆత్మీయ వరములను, అభిషేకమును, జ్ఞానమును, నైపుణ్యమును మరియు అవకాశములను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, తద్వారా, ఇతరులు ప్రభువును గుర్తెరిగి, ఆయన శక్తిని అనుభవించి, ఆయన సేవకులుగా మార్చబడునట్లుగా మనము మన హృదయములను ఆయనకు అప్పగించి, ఆయన పరిచర్యకు సహకరించవలెను.
నా ప్రియులారా, దేవుడు మన గృహములను, కుటుంబములను, వ్యాపారములను, మన రాబడియంతటిని మరియు మన యొక్క పనులను ఆశీర్వదించవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 65:22-23వ వచనములలో చూచినట్లయితే, "జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలము లననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపువారు వారి యొద్దనే యుందు రు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించునట్లుగాను మరియు తమ చేతుల కష్టార్జితము యొక్క ఫలములను వారు అనుభవించునట్లుగా చేస్తాడు. ఆలాగుననే, నా ప్రియులారా, ప్రభువు మన కుటుంబములను నిర్మిస్తాడు మరియు మన వ్యాపారములను వర్థిల్లజేయబోవుచున్నాడు. అంతమాత్రమే కాదు, మనలను మన అప్పుల బాధ నుండి విడిపించి, అనవసరమైన ఖర్చులను తొలగిస్తాడు. ఇంకను, మన యొక్క వైద్య ఖర్చులు మరియు వడ్డీ భారముల నుండి మనలను కాపాడుతాడు. మరియు మనకు ఆరోగ్యం, సమాధానము, ఆనందము, సంపద మరియు సమృద్ధిని అనుగ్రహించి, మనలను వర్థిల్లజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును ఖర్జూర వృక్షము ఎదుగునట్లుగా కృపను చూపుము. దేవా, అరణ్యమువంటి మా జీవితమును మార్చి, మేము సేదదీరునట్లుగాను మరియు సమృద్ధిగల ఎలీములోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, మా కుటుంబమును, పిల్లలను, వ్యాపారమును, పనిని, ఆదాయమును మరియు మా జీవితములోని ప్రతి రంగమును ఆశీర్వదించుము. దేవా, మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మాకు క్షేమమును, సమాధానమును, ఆరోగ్యమును, జ్ఞానమును, ప్రతిభను, నైపుణ్యతను మరియు అభిషేకమును అనుగ్రహించు ము. ప్రభువా, మా హృదయములలో నీ రాజ్యమును మరియు నీ మందిరమును కట్టబడడానికి మేము ఆనందముతో నిన్ను స్తుతించడానికి మరియు ధారాళంగా ఇవ్వడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క మహిమ కొరకు మమ్మును వర్థిల్లతతోను మరియు ఫలభరితంగా మార్చి, మేము దేవదారు వృక్షమువలె ఉన్నతంగా ఎదుగునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచూ యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


