నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నా వందనములు. నేటి వాగ్దానము, పరిశుద్ధ గ్రంథములోని యెషయా 60:22వ వచనము నుండి తీసుకొనబడినది. “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును” అని ఆ వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ వాక్యమునకు దావీదు అద్భుతమైన ఉదాహరణ. అతను కేవలం ఒక గొఱ్ఱెల కాపరి. అతను ఏవిధంగా రాజుగా మారెను? మీరు కీర్తనలు 23:1వ వచనమును చదివినట్లయితే, “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అని అందులో చెప్పబడినది. అవును ప్రియులారా, యేసును మీకు కాపరిగాను, రాజుగాను మరియు మీ దేవునిగాను కలిగియున్నప్పుడు మీకు కలిగే విజయము ఇదే. ఆయనను మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మరియు ఆయన మీ కొరకు సమస్తమును నెరవేర్చును.
నా జీవితములో కూడ నేను దేవునికి దూరముగా ఉంటూ, ఎల్లప్పుడు ఆడుకొనుచు, దేవుని గూర్చి ఏమీ తెలియకుండ ఉండేదానను. అయితే, ఒక దినమున, నేను దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించునట్లుగా ఆయన చేసెను. నా జీవితము పూర్తిగా మారిపోయింది. దేవుడు నన్ను ఆశీర్వదించుట ప్రారంభించెను. ఆయన నన్ను మంచి భక్తి కలిగిన భర్తతోను మరియు ఇంకా అనేక ఆశీర్వాదములతోను ఆశీర్వదించెను. ఏవిధంగా ఆశీర్వదించెను? నేను ఆయనను భక్తితో వెదికాను. అవును, “మీరు వేయిమందియగుదురు, మీరు బలమైన జనమగుదురు” అని వాక్యము సెలవిచ్చుచున్నది. అది ఏవిధంగా సాధ్యమగును? ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి. చాలా సులభము. కీర్తనలు 23వ అధ్యాయములో దావీదు, “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అని చెప్పుచున్నాడు. ఆయనను మీ కాపరిగాను, మీ రాజుగాను, మీ నాయకునిగాను మరియు మీకు సమస్తముగాను కలిగియుండండి. ఆయనను గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు!
23వ కీర్తనను మీరు చదివినట్లయితే, ఆ వచనములను చదువుటకు మీరు చాలా సంతోషించెదరు. ప్రతి వచనము ఆశీర్వాదకరముగా నుండును మరియు మీరు ఆ ఆశీర్వాదమును పొందుకొనెదరు. ఈ లోకములో మీరు అల్పమైనవారై యుండవచ్చును, మీకు చాలా చిన్న ఉద్యోగము ఉండవచ్చును. “నువ్వు మాకు అవసరము లేదు” అని అందరు చెప్పియుండవచ్చును. మీరు అందరి చేత తిరస్కరించబడినవారై యుండవచ్చును. అయితే మీరు యేసును మీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన మార్గములను మీరు అనుసరించినప్పుడు, ఆయన దావీదును ఆశీర్వదించిన ప్రకారం మిమ్మల్ని కూడ ఆశీర్వదించును. దావీదు కేవలం ఒక గొఱ్ఱెల కాపరి మాత్రమే. కానీ అతను గొప్ప జనమునకు రాజుగా మారెను. అదేవిధంగా, మీరు ఉన్నత స్థానమునకు హెచ్చింపబడుదురు. మీరు ఉద్యోగము చేయుచున్న స్థలములో నిందింపబడి యుండవచ్చును మరియు ప్రజలు మీకు వ్యతిరేకముగా అనేక విషయములను చెప్పుచుండవచ్చును. అయితే దేవుని పట్టుకోండి, ఆయనను గట్టిగా పట్టుకోండి. సమస్తము పూర్తిగా మారిపోవును. దేవుడు సమస్తమును మార్చివేయును. ఆయన మిమ్మల్ని ఉన్నతస్థానమునకు హెచ్చించును. దావీదు వలె మీరు కూడ ఆశీర్వదింపబడుదురు. రండి, దేవుని తట్టు చూచెదము. ఆయన మీ అవసరములను తీర్చును.
ప్రార్థన:
ప్రేమగల తండ్రీ, నీవే నా కాపరివి మరియు నేను నిన్ను వెంబడించుచున్నాను. నీ మార్గములలో నన్ను నడిపించుము. నా జీవితములోని ప్రతి అడుగులోను నాకు తోడైయుండుము. నేను అల్పమైనవానిగాను లేక మరవబడినట్లుగాను నాకు అనిపించినప్పుడు నీ వాగ్దానమును నాకు జ్ఞాపకము చేయుము. నా జీవితమును మార్చి, నీ చిత్త ప్రకారం నన్ను హెచ్చించుము. ఎల్లప్పుడు నిన్ను గట్టిగా పట్టుకొనుటకును మరియు నీ స్వరమును విశ్వసించుటకును నాకు సహాయము చేయుము. నన్ను నీ ఆశీర్వాదకరమైన పాత్రగాను మరియు నీ ఉద్దేశ్యముగాను మార్చుము. నా జీవితము నీ ఘనతను మరియు మహిమను ప్రతిఫలింపజేయునుగాక అని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


