నా ప్రియ స్నేహితులారా, నేడు మిమ్మును మరల కలుసుకోవడము నాకు చాలా సంతోషముఆ ఉన్నది. నాకు తెలుసు ఈ రోజు బలమైన అద్భుతమును మనము పొందుకొనబోవుచున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 44:5వ వచనమును మన కొరకు తీసుకొనబడియున్నది. ఆ వచనములో చూచినట్లయితే, "ఒకడు నేను యెహోవా వాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మనతో తన మహిమను మరియు ఆయన నామమును పంచుకొనుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము కదా! కొంతమంది నా పేరును పెట్టుకుంటారు మరియు మరికొంతమంది మీ పేరును కూడా పిలుస్తుంటారు. మీ ద్వారా వారు నన్ను అనుసరిస్తారు. ఇది ఎంత అద్భుతము కదా! ప్రభువు మనలను తనకు చెందినవారినిగా పిలుచుకోవడమే కాకుండా, తన పిల్లలైన మనకు ఘనతను కూడా అనుగ్రహించుచున్నాడు. ఆలాగుననే, మన జీవితముల ద్వారా ఆయన మహిమ బయలుపరచబడుచున్నప్పుడు, మనలో వారు చూచుచున్న గొప్ప సాక్ష ్యమును బట్టి ఇతరులు ఆయనను అనుసరించడానికి ప్రేరేపించబడుచున్నారు.
కొన్ని సంవత్సరముల క్రితము, భార్యభర్తలైన ఒక దంపతులు వచ్చి ఈలాగున చెప్పియున్నారు. మా నాన్నగారి పరిచర్య ద్వారా గొప్ప అద్భుతమును స్వీకరించియున్నారు అని చెప్పియున్నారు. వారు తమ ఇద్దరు బిడ్డలను, పాపను మరియు బాబును మా యొద్దకు తీసుకొని వచ్చారు. వారిద్దరు కూడా మా పిల్లలు మీ వీడియోలను వీక్షించుచున్నారు మరియు వారు ఆ వీడియోలను వెంబడించుచున్నారు అని చెప్పారు. మేము వారిద్దరికి ఏమి పేర్లు పెట్టామో మీకు తెలుసా? ఒకరికి శ్యామ్ మరియు మరొకరికి షారోన్ అని పేర్లు పెట్టాము. నేను ఆ బాబును చూచినప్పుడు, ' ఆ పిల్లవాడు చాలా సరాదాగా ఉన్నట్లుగా అనిపించినది.' కనుకనే, ఆ పిల్లవానితో, నేను ఈలాగున చెప్పాను, "నీవు మంచి అబ్బాయిగా ఉండి, నా పేరును కాపాడు అని చెప్పాను.'' ఆ పిల్లవాడు కూడా, ' సరే, ' అన్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు తనకు ఘనతను వహించునట్లుగా, ఆయన మన పేరును ఉంచియున్నాడు. ఇది గొప్ప అద్భుతము కదా! కానీ, అది నాకు ఒక చక్కటి సత్యాన్ని గుర్తుచేసియున్నది: " దేవుడు ఒక జీవితమును ఆశీర్వదించి నప్పుడు, ఆ వ్యక్తి పేరు కూడా ఆయన మంచితనమునకు, విశ్వసనీయతకూ సంబంధము కలిగియుంటుంది. ''
ఒకవేళ, నా ప్రియులారా, ఈ రోజు ఇతరులు అవమానకరముగా మీ పేరును పిలుచుచున్న మార్గములో మీరు పయనించుచున్నారేమో? వారు మీ పేరును దూషించుచున్నారేమో? మీ ఉత్పత్తి మీద దూషించుచున్నారేమో? అందును బట్టి, మీ హృదయములు బ్రద్ధలైపోయినట్లుగా ఉన్నవేమో? కానీ, నా స్నేహితులారా, మహిమవంతమైన దేవుని చర్య మీ జీవితము ద్వారా ప్రకాశితమవుతుంది. కనుకనే, చింతించకండి. ఆలాగుననే, మీ విశ్వాసమును విడిచిపెట్టకండి. ప్రభువు మీ స్వంత జీవితముల ద్వారా మిమ్మును పైకి లేవనెత్తి, మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. నా ప్రియులారా, మీరు దానిని ఎదురు చూస్తూ, ఆయనను వెంబడిస్తూ ఉండండి. మీ జీవితములో శ్రేష్టమైనదాని కొరకు సమస్తమును చేయుచూ ఉండండి. ఆయన మీలో పనిచేయడము మీరు చూచెదరు. అది గొప్ప దానిని ఉత్పత్తి చేయడము మీరు చూచెదరు. తద్వారా, ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తారు. మీ పేరును గట్టిగా చెబుతారు. మీ పేరును ఘనపరుస్తారు. 'నేనే ఈ గొప్ప వ్యక్తిని వెంబడించుచున్నాను అని చెబుతారు,' ఈ గొప్ప స్త్రీ, చాలా గొప్పది అని చెబుతారు. తద్వారా దేవుని గొప్ప కార్యములను వెల్లడిపరచుచున్నారు. మీరు ఇందునిమిత్తము ప్రభువు స్తుతిస్తూ, ఈ వాగ్దానమును స్వీకరించండి. తలాంతుల ద్వారా మీ నైపుణ్యమును మరియు తలాంతుల ద్వారా మీ యొక్క ఔన్నత్యమును దేవుడు ఇతరుల ద్వారా ప్రేరేపించునట్లుగా బయలుపరుస్తాడు.
నా ప్రియులారా, బహుశా! ఈ రోజు మీ పరిస్థితి చాలా భిన్నంగా ఉండవచ్చును. ప్రజలు మీ గురించి ప్రతికూలంగా మాట్లాడుతుండవచ్చును. వారు మీ ప్రయత్నములను విమర్శించవచ్చును, మీ పనిని తిరస్కరించవచ్చును, లేదా మీ పేరుకు అవమానం కూడా కలిగించవచ్చును. మీ యథార్థతను తప్పుగా అర్థం చేసుకోవడం వలన లేదా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవడం వలన మీరు నిరుత్సాహపడవచ్చును. కానీ, ధైర్యం కోల్పోకండి. దేవుడు మీ కథను ఇంకా ముగించలేదు. ప్రభువు అవమానాన్ని ఘనతగా మార్చగలడు. ఆయన తగిన సమయంలో మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించి, మీ జీవితం ద్వారా తన మహిమను బయలుపరుస్తాడు. మీరు ఆయనను నమ్ముతూ, విశ్వాసంగా ఉంటూ, ఆయన మీకు ఇచ్చిన వరములను ఉపయోగించుచున్నంతవరకు, ఆయన మీ ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నా ప్రియులారా, మీ ప్రతిభ, మీ నైపుణ్యాలు మరియు మీ విశ్వసనీయత అన్నియు దేవుని చేతిలో ఉన్న సాధనములు. అనేక జీవితములను ఆశీర్వదించడానికి మరియు తన నామానికి మహిమను తీసుకురావడానికి ఆయన వాటిని ఉపయోగించగలడు. ఈ రోజు మీరు అల్పులమై ఉండవచ్చును, మీరు బ్రద్ధలై పోయి ఉండవచ్చను, కానీ, మీరు దేవునికి లోబడండి, మీ హృదయమును ఆయనకు సమర్పించండి. అప్పుడు ఒకరోజు, ప్రజలు మీ గొప్పతనమును బట్టి మిమ్మును ఘనపరచరు. అందుకు బదులుగా, మీ ద్వారా ఆయన చేసిన కార్యములను బట్టి వారు దేవుని మహిమపరుస్తారు. మీ జీవితం ఇతరులను క్రీస్తు వైపు నడిపించే ఒక సాక్ష్యంగా మారుతుంది. కాబట్టి, ప్రభువును అనుసరించడం కొనసాగించండి. పూర్ణ హృదయంతో ఆయనకు సేవ చేయండి. మీ శాయశక్తులా కృషి చేస్తూ ఉండండి మరియు మీ జీవితం ద్వారా ఆయన శక్తివంతంగా కార్యాలు జరిగించడాన్ని ఎదురుచూడండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీకు చెందినవారినిగా పిలిచి, నీ కృపకు సాక్షిగా మమ్మును మార్చినందుకు నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీ మహిమను, ఘనతను మా ద్వారా వెల్లడిపరచుటకు మేమెంతటివారము కదా! దేవా, మా ద్వారా, నీ మహిమను మరియు ఘతను పంచుకొనుటకు మేము ఏపాటివారము? అయినను ప్రభువా, మా ద్వారా నీ యొక్క ఘనమైన కార్యములను జరిగించుము. దేవా, మా యొక్క ఆధ్యాత్మిక వరములను బలంగా వినియోగించుకొనుము. యేసయ్యా, ఈ లోకము ఇంతకముందు చూడని వాటిని జరిగించువాటి నిమిత్తము మమ్మును బలంగా వాడుకొనుము. దేవా, మా జీవితములో గొప్ప ఫలములను ఉత్పత్తి చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, అనేకులు మా ద్వారా నిన్ను గుర్తెరుగునట్లుగా మా జీవితం ద్వారా నీ మహిమ బయలుపరచబడునట్లుగా చేయుము. దేవా, మా జీవితము నుండి ప్రతి అవమానమును, తిరస్కారమును మరియు నిరుత్సాహాన్ని తొలగించి, వాటన్నిటికి బదులుగా నీ ఘనతను మరియు నీ కృపను మా మీద ఉంచుము. ప్రభువా, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి, మా తలాంతులను చు, మరియు సామర్థ్యములను బలపరము. యేసయ్యా, మా ఆత్మీయ వరములను నీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగించుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితము నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చునట్లుగా మరియు అనేకులు నిన్ను అనుసరించునట్లుగా నడిపించే శాశ్వతంగా ఫలించునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ పరిపూర్ణ చిత్తానుసారంగా మమ్మును స్థిరపరచి మరియు మేము వెళ్లు ప్రతిచోట మమ్మును ఆశీర్వాదకరంగా మార్చుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


