నా ప్రియ స్నేహితులారా, ఈ నెల ముగింపునకు వచ్చినప్పటికిని, మనకు ప్రతిరోజు ఆశీర్వావచనము ద్వారా ఆశీర్వాదములన్నిటిని మనము ప్రత్యేకంగా మరల జ్ఞాపకము చేసుకుందాము. అందుకే ఈ రోజు కూడా మనకు ప్రత్యేకమైన వాగ్దానమును అనుగ్రహించుటకు కోరుచున్నాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 65:22వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు'' ప్రకారం దేవుడు ఆయన మనతో చేసిన యాత్రను అనుభూతి చెంది ఆనందించులాగున చేయును. కానీ, నా ప్రియులారా, మీ పనిలో మీరు వాడబారినట్లుగా అనిపిస్తుందా? మీరు ఏ పని చేసినను కేవలము వాడుక ప్రకారం చేస్తున్నాను అని మీకు అనిపిస్తుందా? లేక మీరు చేయుచున్న పని ద్వారా మీకు కానీ మరియు మరి ఎవరికి ప్రయోజనము లేదు అని మీకు అనిపిస్తుందా? దేవుడు వాటన్నిటిని నేడు రూపాంతరపరచుచున్నాడు. కనుకనే మీరు దిగులుపడకండి.

ఒక అమెరికా వ్యక్తిని ఇంటర్య్వూ చేయడం జరిగినది. నేను యూట్యూబ్‌లో ఈ యొక్క వీడియోను చూస్తున్నప్పుడు, అతడు ఒక విజయవంతమైన వ్యక్తిగా ఉన్నాడు. అతడు అంత విజయమును ఎలా పొందగలిగాడు? అతడు నిర్విరామముగా ఎలాగున పని చేయుచున్నాడు? అని అడిగినప్పుడు, సుదీర్ఘమైన రాత్రులు, వారములు అన్ని దినములు అతడు ఎలాగున పనిచేయుచున్నాడు? వారం రోజులు పని చేసిన తర్వాత కూడా, అతడు అంత ఉత్సాహంగా, అత్యంత శక్తితో, కొత్తగా ఏదైనా చేయాలనే ప్రేరణతో ఎలా తిరిగి వస్తాడు? అని ప్రశ్నించినప్పుడు, నీవు అలాంటి వైఖరిని ఎలా కలిగి ఉండగలిగాడు? అని అడిగారు.

ఆ వ్యక్తిని ఏమని జవాబు చెప్పాడంటే, "ప్రతి ఉదయకాలము దేవుని ఆత్మతో నడవడానిని నేను ఎప్పుడు కూడా కోల్పోను అని చెప్పాడు. నా యొక్క భారములన్నిటిని ఆయనతో పంచుకుంటాను, నిత్యము నేను ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను, ఆయన తిరిగి నాతో మాట్లాడతాడు. ఆయన తిరిగి నా హృదయాన్ని స్వస్థపరుస్తాడు. నా భవిష్యత్తు కొరకైన దర్శనమును మరియు ఆ యొక్క యుక్తిని నాకు చూపిస్తాడు మరియు నాకు ప్రేరణ కలిగించే ఈ యొక్క నూతనమైన ఆలోచనలు కలిగిస్తాయి అని చెబుతాడు. నా యొక్క పని తర్వాత, రాత్రివేళ నేను శ్రేష్టమైన దానిని చేయడానికి నాకు సహాయము చేసినందుకై నీకు వందనాలు అని చెబుతాను. ఒత్తిడిలు మరియు ఆత్రుత అంతటికి ప్రతిగా ఆయన రాత్రివేళ నాకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగానే, ప్రభువు నన్ను విజయము వైపునకు లేవనెత్తాడు'' అని చెప్పాడు. నా ప్రియులారా, ఆయన నేడు మిమ్మును కూడా, మీరు చేసుకున్న దానికి ఫలమును అనుభవించి, ప్రతి రోజు ఆయనతో కలిసి పనిచేయునట్లుగాను, ఆయనతో ఆనందించునట్లుగా చేస్తాడు. ఈ కృపను స్వీకరిద్దామా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీకు వందనాలు, నీవు ఎన్నటికి మమ్మును విడవవు, ఎడబాడవు అని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మాకు అనుగ్రహించు పని అంతటిలోను కూడాను దానిని మీ నిమిత్తము మరియు నీ రాజ్యము నిమిత్తము జరిగించుటకు అందునిమితము మాతో కూడా ఉండండి. దేవా, మమ్మును ఎన్నటికి విడిచిపెట్టకండి, మమ్మును నడిపించుము, మాకు మార్గము చూపించుము, మాకు శాంతిని దయచేయుము. ప్రభువా, మా పనిలో మేము ఒంటరిగా బాధపడకుండా, నీవు మాతో కూడా ఉండుము. మాకు కావలసిన జ్ఞానమును దయచేసి, మా చేతి పనిని దీవించుము, మాకు గొప్ప విజయమును దయచేయుము. దేవా, మాకు గొప్ప ప్రతిఫలమును, బహుమానము, విజయమును దయచేయుము, మా పనిలో మేము ప్రకాశించునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, ఈ నెలలో నీవు మా జీవితంపై కుమ్మరించిన ప్రతి ఆశీర్వాదానికి ధన్యవాదాలు. మా పని దినచర్యగా లేదా వాడబారినట్లుగా అనిపించినప్పుడు కూడా, నీవు మా ద్వారా పనిచేస్తున్నావని మాకు తెలుసు. ప్రభువా, మేము ఈ రోజు మా భారాలతో మరియు మా కలలతో నీ దగ్గరకు వస్తున్నాను. దేవా, ప్రతి ఉదయం నీ ఆత్మతో నడవడానికి, నీతో మాట్లాడటానికి మరియు నీవు మాతో మాట్లాడటం వినడానికి మాకు నేర్పుము. ప్రభువా, మేము చేయు ప్రతి పని ద్వారా మాకు నూతన ప్రేరణ, నూతన బలం మరియు శాంతిని దయచేయుము. దేవా, నీ వాక్యంలో నీవు వాగ్దానం చేసినట్లుగా, మా చేతుల పనిని ఆనందించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా శ్రమ ఆనందం, ఉద్దేశ్యం మరియు నీవు మా పక్కన న్నావనే హామీతో నిండి ఉండునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించున్నాము తండ్రీ, ఆమేన్.