నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున ప్రభువు నూతన జీవమును మనకు అనుగ్రహించుచున్నాడు. ప్రతిరోజు మనలను ఆయనలో నూతనంగా సృజించు దేవుడుగా ఉన్నాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 11:7వ వచనమును నూతన ఆశీర్వాదములను తీసుకొని రాబడుచున్నది. ఆ వచనము, "యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు'' అని చెప్పబడిన ప్రకారము నూతన ఆశీర్వాదమును నేడు మనము స్వీకరించబోవుచున్నాము. ఎందుకంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. అవును, ప్రభువు తన యందు నీతిగలవారి కొరకు మరియు నీతిమంతుల కొరకు ప్రత్యేకముగా ఆయన న్యాయమును తీసుకొనిరావడము కొరకు ఇష్టపడుచున్న దేవుడు. ఈ వచనములో అద్భుతమైన వాగ్దానమేమనగా, 'యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు.' కనుకనే నా ప్రియ స్నేహితులారా, చింతించకండి. మీరు నీతిని, యథార్థతను అనుసరించినప్పుడు, నిశ్చయముగా మీరు దేవుని ముఖ దర్శనమును చూచెదరు.
మా యొక్క నాన్నమ్మ మరియు తాతయ్యగార్లు తమ యొక్క వివాహము జరిగిన తొలి దినములలో ఉండియున్నప్పుడు, మొట్టమొదటిగా వారికి అనుగ్రహింపబడియున్న ఇద్దరు బిడ్డలను కూడా వారు కోల్పోయి ఉన్నారు. ఒక బిడ్డ మృత శిశువుగా జన్మించడము జరిగింది. మరొక బిడ్డ బ్రతకలేదు. వారు ఎంతగానో హృదయము బ్రద్ధలైపోయినట్లుగా ఉన్నారు. ఆ సమయములో, ఆ మార్గము గుండా వెళ్లడము చాలా కష్టముగా అనిపించినది. అయితే, వారు ఏమన్నారంటే, 'ప్రభువా, నిన్ను మాత్రమే సేవించెదము, నిన్ను మాత్రము వెంబడించెదము' అని చెప్పారు. ప్రభువు వారిని సేవా పరిచర్యలో నడిపించిన రీతిగా ఆలాగుననే వారు కొనసాగి ముందుకు వెళ్లారు. దేవుడు ఆ నీతిగల నిర్ణయమును ఘనపరచియున్నాడు. దేవుడు వారి జీవితములో ఎంత గొప్ప ఆశీర్వాదము ను ఉంచియున్నాడు కదా! దేవుడు వారి జీవితములో న్యాయము, నీతిని కలుపుకుంటూ వచ్చాడు. ఆలాగుననే, మరింత జోడించుచూ వచ్చాడు, ఇంకను వారి పట్ల న్యాయమును జరిగించాడు. దేవుడు వారికి ఇంకను అందమైన ఇద్దరు బిడ్డలను అనుగ్రహించియున్నాడు. వారి కుమారుడైన మా తండ్రిగారు డా. పాల్ దినకరన్‌గారి ద్వారా దేవుడు వారిని విస్తరింపజేసియున్నాడు. మాకందరికి మరియు మా కుటుంబ సభ్యులందరికిని అదే కృపను అనుగ్రహించియున్నాడు. ఆలాగుననే, ముగ్గురు మనమ సంతానమును దేవుడు అనుగ్రహించియున్నాడు. ఈ రోజున మా నాన్నమ్మగారు, బామ్మగా ఇంకను ఆమె మూడు తరముల వారిని చూడగలుగుచున్నారు. అంతమాత్రమే కాదు, దేవుడు యేసు పిలుచుచున్నాడు పరిచర్య మరియు కారుణ్య, సీషా ద్వారా ఇంకా ఎంతో మంది ఆత్మీయ బిడ్డలను వారికి అనుగ్రహించియున్నాడు. వారు అనుభూతి చెంది నష్టపోయిన దానికంటె, ఎన్నో రెట్లు అధికమైన ఆశీర్వాదములను దేవుడు వారికి అనుగ్రహించియున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.
ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు కూడా ఆలాగుననే జరిగిస్తాడు. ఆలాగుననే, మా తాతయ్యగారికి దేవుని ముఖదర్శనము చేయుటకు ఆయన గొప్ప కృపను షనుగ్రహించియున్నాడు. నా ప్రియులారా, ఆయన మిమ్మును మీ యొక్క ప్రతి భాగములోను ఆయనను చూచునట్లుగా చేయును. ఆయన మంచితనమును చూచుటకును, ఆయన ఆనందమును చూచుటకును, ఆయన ప్రతిఫలమును చూచుటకు, ఆయన న్యాయమును చూచుటకును, ఆయన నీతి మీ యొద్దకు వచ్చుచున్నది నా ప్రియ స్నేహితులారా, దీనిని మనము స్వీకరించుదామా? ఆలాగుననే మీరు కూడా ఆయన ముఖ దర్శనమును చూడాలనుకున్నట్లయితే, నిశ్చయముగా, మిమ్మును మీరు దేవుని సమర్పించుకుని, ఆయన యందు నీతి యథార్థతను కలిగియున్నప్పుడు, నిశ్చయముగా దేవుడు మిమ్మును నేటి వాగ్దానము నుండి దీవించును గాక.
ప్రార్థన:
కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవు ఈ రోజు మాకు అనుగ్రహించిన వాగ్దానము ప్రకారము నీవు నీతిమంతుడవైన దేవుడవు, నీవు న్యాయవంతుడవైన దేవుడవు. కనుకనే, మేము పొందుకున్న నష్టమునకు బదులుగా మాకు పరిహారమును అనుగ్రహించుము. యేసయ్యా, మేము కోల్పోయిన ధనమును, సమాధానమును, బిడ్డను, మాకు తిరిగి అనుగ్రహించుము. దేవా, మేము కోల్పోయిన దానిని రెండంతలుగా మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము నిన్ను వెంబడించాలని ఎన్నుకున్నందున మా జీవితంలో జరిగిన నష్టాలకు నీవు అనేక రెట్లు పరిహారం కలుగజేయుదవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా విశ్వాసమును ఘనపరచుము. దేవా, మా యొక్క నీతిమంతమైన నిర్ణయాన్ని ఘనపరచుము. దేవా, మాకు రెండంతల ప్రతిఫలమును మాకు అనేక రెట్లు ఎక్కువ ఆశీర్వాదమును దయచేయుము. దేవా, మేము కోల్పోయిన దానిని మాకు తిరిగి రెండంతలుగా దయచేయుము. యేసయ్యా, రెట్టింపుగా, మా జీవితంలో ఒక అద్భుతమును జరిగించుము. దేవా, మా జీవితమును పునర్నిర్మించి, ఉన్నత స్థలమునకు ఎక్కునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా, మా దగ్గర ఉన్న సమస్తమును విస్తరించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


