నాకు అమూల్యమైన స్నేహితులారా, నేడు స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటున్న మీకందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. దేవుడు మన గురించి శ్రద్ధ వహించువాడై యున్నాడు. ఆయన నిజముగా మీ గురించి శ్రద్ధ వహించుచున్నాడు. మీరు శ్రమలు మరియు సమస్యల గుండా వెళ్లుచుండియున్నప్పుడు, అంధకారము మిమ్మును ఆవరించియున్నప్పుడు, కొన్ని ఫర్యాయములు మీ ప్రార్థనలు పరలోకమునకు చేరడము లేదు అని మీకు అనిపించినప్పుడు, అటువంటి సమయములో మీరు దేవుని సన్నిధిని అనుభూతి చెందలేరు. మీకు ఎంతో అపరాధన భావనగా అనిపించుచుండవచ్చునేమో? ఎంతో ఒంటరితనమును అనుభవించుచున్నారనియు, మీకు ఎంతో నిస్సహాయతగా ఉన్నదని అనిపించుచుండవచ్చును. కానీ, యేసు సెలవిచ్చియున్నాడు, ''నేను మిమ్మును ఎన్నటికిని విడువను, నేను మిమ్మును ఆదరణ లేనట్టివారినిగా విడువను ఎడబాయను, ఏ సమయమందుయైనను ఆదరణ లేకుండా, నేను మిమ్మును విడిచిపెట్టను. నేను మిమ్మును ఎడబాయను, నేను ఎప్పటికిని మిమ్మును ఓటమి పాలు చేయను. నేను ఎల్లవేళల మీతో కూడా ఉండెదను. కనుకనే, దానిని మీరు నమ్మండి'' అని అటువంటి కష్టతరమైన సమయములలో, 'ప్రభువా, మేము నిన్ను అనుభూతి చెందకపోయినను, నీవు మాతో కూడా ఉన్నావు, నీకు వందనములు, మేము దీనులము, మేము అక్కర్లలలో ఉండియున్నాము. కానీ, ఎల్లవేళల నీవు మా గురించి చింతించుచున్నావు,' అని చెప్పండి. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 32:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను'' ప్రకారం దేవుడు మన చుట్టును ప్రాకారము వలె మనలను ఆవరించి ఉండెను. దేవుడు మనలను గురించి శ్రద్ధ వహించెను. మనలను ఆయన కనుగొని, పరామర్శించి, తన కనుపాపను వలె మనలను కాపాడెను అని వ్రాయబడియున్నది. దేవుడు ఆ రీతిగా అతనిని ఆవరించియుండెను. బైబిల్‌లో జెకర్యా గ్రంథము 2:5లో ఏమని చెబుతుందనగా, "నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారం ఆయన మన చుట్టు కూడా అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. కనుకనే, భయపడకండి, ఆయన మీ చుట్టు ఉండి, మిమ్మును ఆవరించును, భద్రపరుస్తాడు.

రెండవదిగా, ఆయన మిమ్మును గురించి జాగ్రత్తవహించును. ఆయన మీ పట్ల కనికరము చూపించుచున్నాడు. యేసు తన బోధను వినడానికి ఆయన యొద్దకు వచ్చి, బహుజన సమూహములను చూచినప్పుడు, మత్తయి 14:14 మరియు మత్తయి 15:32వ వచనములను మనము చూచినట్లయితే, "అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సులేదని వారితో చెప్పగా,' సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చును, దానిని కొనుగోలు చేయుటకు మన యొద్ద చాలినంత ధనము లేదు, ధనమంతయు ఖర్చు చేసిన, వారి కోసం కొనడానికి తగినంత ఆహారము మార్కెట్‌లో లేదు, ఈ ప్రజలకు భోజనము పెట్టడానికి మన దగ్గర తగినంత ఆహారము లేదు, వారిని పంపించివేయుమని శిష్యులు ఆయనతో అనిరి. కానీ, యేసు అంటున్నాడు, 'మీరు కలిగియున్న దానిని నా చెంతకు తీసుకొని రండి' అని చెప్పినప్పుడు, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులకు, అధనముగా, స్త్రీలును, పిల్లలకును ఆహారము వడ్డించు నిమిత్తమై, వారి చెంత ఉండియున్న ఐదు రొట్టెలు, రెండు చేపలు,ఆయన చేతులకు ఇచ్చారు. ఆయన తనకున్న గొప్ప ప్రేమతో ఆ రొట్టెలను చేపలను ఆశీర్వదించి, విస్తరింపజేశాడు. వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి. అదేవిధంగా, ఆయన మీకు కావలసినవన్నీ అందిస్తాడు, మరియు మీ జీవితంలో ఏ కొరత ఉండదు. ఆయన మిమ్మును పిలిచినప్పుడు, మీ ఆత్మను, మీ పేరును, మీ కుటుంబాన్ని, మరియు ఆయన మీకు అప్పగించిన ప్రతిదానిని భద్రపరచి కాపాడుతాడు. ఆయన ఇచ్చిన దానిని పోగొట్టుకుంటానేమోనని మీరు భయపడనవసరం లేదు, ఆయన దానిని భద్రపరుస్తాడు. ఎందుకంటే, ఆయన దానిని కాపాడడానికి నమ్మదగినవాడు.

జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన శ్రీమతి వినీతా గురియా నుండి నేను మీతో పంచుకోబోవుచున్న అద్భుతమైన సాక్ష్యము ఒకటి ఉన్నది. వారు ఈ రీతిగా తెలియజేసియున్నారు. ఆమె కుమారుడైన సాలమన్‌ను యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్పించడము జరిగినది. 2019వ సంవత్సరములో ఆయన తన పడక గదిలో చదువుకొనుచుండెను. ఆ పిల్లవాడు తన తండ్రిని పిలిచి, నాన్నగారు నాకు చాలా ఆకలిగా ఉన్నది అని చెప్పినప్పుడు, ఆ పిల్లవాని తండ్రి కొంత ఆహారమును తీసుకొని రావడానికి వెళ్లియున్నాడు. అతడు వంటగదిలోనికి వెళ్లాడు. అతడు వెళ్లిపోగానే, కుమారుడు సాలమన్ లేచి తన తండ్రిని వెంబడించెను. అతడు పడక గదిని విడిచిపెట్టగానే, సాలమన్ పైన వేగముగా తిరుగుచున్న వెంటనే ఫ్యాన్ క్రింద పడిపోవడము జరిగినది. ఒకవేళ అది గానీ, సాలమన్ మీద పడిపోనట్లయితే, ఎంతో గాయము, బాధ, ఇంకను ఇబ్బంధికరమైన పరిస్థితిని కల్పించియుండేది. అయితే, దేవుడు ఆ కుమారుని కాపాడియున్నాడు. అక్కడ అంతటితో ఆగిపోలేదు. తదుపరి ఉదయకాలమున ఆ కుటుంబమంతయు యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమును చూచుచుండెను. ఆ కార్యక్రమములో నేను వాక్యమును బోధించుచున్నాను, ప్రార్థన సమయము వచ్చినప్పుడు, నేను, ఈ యొక్క రీతిగా చెప్పాను, 'సాలమన్, నీ యొక్క పేరు సాలమన్, నీవు ఒక గొప్ప ప్రమాదము నుండి రక్షింపబడియున్నావు కదా! ' అని చెప్పాను. అది విన్న వారు నిర్ఘాంతపోయారు. ఈ కార్యక్రమములన్నియు ఎన్నో నెలలకు ముందుగానే, రికార్డు చేయబడతాయి కదా. అయినప్పటికిని సరైన సమయమునకు అవి విడుదల చేయబడ్డాయి. దేవుని చర్యలు సాలమన్ కొరకు నిర్ధారించడము కోసమే. కార్యక్రమములో జార్ఖండ్‌లో ప్రసారమయ్యాయి. ఈ కార్యక్రమములు చెన్నైలో రికార్డు చేయబడినవి. దేవుడు ఎంత ఖచ్చితంగా మన పట్ల జాగ్రత్త వహిస్తాడు కదా! ఆలాగుననే, దేవుడు మీ గురించి జాగ్రత్త కూడా వహిస్తాడు. అవును, ఆయన పరలోకములో ఉన్నప్పటికిని, నేడు ఆయన మీతో కూడా ఉన్నాడు, ఆయన మీ చుట్టు కూడా ఆవరించియున్నాడు. ఆయన మీ గురించి జాగ్రత్త వహిస్తాడు. ఆయన మిమ్మును గమనించుచున్నాడు. అందుకోసమే మీ పిల్లలను మరియు మీ యొక్క మనమసంతానమును కూడా యౌవన భాగస్థుల పధకములో సభ్యులనుగా చేర్పించమని ప్రోత్సహిస్తుంటాము. ప్రతిరోజు వారి నిమిత్తము ప్రార్థన గోపురములో ప్రార్థనలు సమర్పించబడతాయి. వారి ద్వారా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో దేవుని సేవ కొరకు సహకారము అందించబడుతుంది. వారు పంపించు కానుకలన్నియు కూడా యేసు పిలుచుచున్నాడు పరిచర్య గాయపడిన ప్రజలకు సేవలు అందించడము కోసం వ్యక్తిగతంగా పంపించడము, అందించడము జరుగుతుంది. అది అభివృద్ధి విస్తరించి, లక్షలాది మందిని తాకబడుతుంది. మీ బిడ్డలు గానీ, మీ మనమసంతానము కానీ, ఆశీర్వదింపబడతారు. వారి ఆత్మ సంక్షేమముగా ఉంటుంది. దేవుడు ఇట్టి కృపను మీకు నేడు అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా జీవితంలో నీ నిత్య ప్రేమకు మరియు నిరంతర సన్నిధికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, చీకటి మమ్మును చుట్టుముట్టి నప్పుడు మరియు మేము ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడు, దయచేసి నీ శ్రద్ధతో మమ్మును ఆవరించి, మమ్మును నీ కనుపాపవలె కాపాడుచున్నావనియు మాకు గుర్తు చేయుము. దేవా, మమ్మును ఎన్నటికిని, ఒంటరిగా విడిచిపెట్టను, ఎడబాయను అనే ఎన్నటికి విఫలం కాని నీ యొక్క వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా ప్రతి అవసరాన్ని తీర్చుము, మా ఆత్మను రక్షించుము, మా కుటుంబాన్ని కాపాడుము, మరియు నీవు మాకు అప్పగించినవన్నీ భద్రముగా కాపాడుము. ప్రభువా, మా హృదయం ఎల్లప్పుడూ నీవు మా చుట్టూ మరియు మా ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడుము. యేసయ్యా, నీవు మా జీవితంలో నమ్మకమైన గొర్రెల కాపరివి అనే హామీలో విశ్రాంతి తీసుకోనునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.