నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హగ్గయి 2:23వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " ...నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు'' అని సర్వశక్తిమంతుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది మీ కొరకు ఇవ్వబడిన దేవుని వాగ్దానమై యున్నది. దేవుడు మిమ్మును సూచక క్రియగాను మరియు అద్భుత కార్యములు జరిగించువారినిగా చేయుచున్నాడు. ఆయన హస్తము మరియు ఆయన ముద్ర మీ మీద కనుపరచుకుంటున్నాడు. ఆయన మిమ్మును ఏర్పరచుకొనియున్నాడని చూపించుచున్నాడు. మీరు ఆయనచేత ఏర్పరచబడియున్న పాత్రయై ఉన్నారు. " ఆయన మిమ్మును ఏర్పరచుకొనియున్నానని సెలవిచ్చుచున్నాడు, మీరు కాదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను. ఫలములు ఫలించుటకును మరియు ఆ యొక్క ఫలములు నిత్యము నిలిచి ఉండులాగున నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను. తద్వారా నా నామమున మీరు నన్ను పిలిచినప్పుడు, నా తండ్రి, ఆలకిస్తాడు, సకల ఆశీర్వాదాలను మీరు కలిగియుంటారని '' సెలవిచ్చుచున్నాడు. మీరు అడిగినవాటన్నిటిని ఆయన మీకు అనుగ్రహించును. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. కనుకనే, ప్రభువునందు ఆనందించండి. మీరు ఆయనతో ఈలాగున అని చెప్పండి, ' యేసయ్యా, నీవే మా జీవితానికి సూచనగా ఉన్నావు, నిన్ను ఈ లోకమునకు మోసుకొని వెళ్లుటకు నేను సూచనగా ఉన్నాను. అందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను'' అని ప్రార్థించండి.

ఇక్కడ ఒక చక్కటి సాక్ష్యము కలదు. శ్రీమతి అజి అలెక్స్ కారుణ్య విశ్వవిద్యాలయంలో బి.ఇ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజెనీరింగ్ ప్రోగ్రామ్‌లో చేరి విద్యను అభ్యసించుచుండెను. అక్కడ చేరిన ఆరంభములో తను ఎంతగానో బాధపడుచుండెను. తగినంత రీతిలో తను అక్కడ ఉండలేనట్లుగా ఆమెకు అనుభూతి కలిగినది. ఎన్నో సందేహములు ఆమె హృదయములో మెదిలినవి. తన ఎంపికలను ప్రశ్నించుకొనుచుండెను. విద్యలో చాలా బాగా రాణించాలని ఉన్నతంగా ప్రయత్నించెను. కానీ, తక్కువై పోవుచూ, ఇంకను క్రింది దిగజారిపోవుచుండెను. కానీ, కారుణ్యలో అందించబడే ప్రతి సందేశము ద్వారా దేవుడు తన హృదయములో పనిచేయుచుండెను. అక్కడ అందించబడుచున్న వర్తమానముల ద్వారా సహనమును ప్రతి విషయములో దేవుని యందలి నిరీక్షణను ఆమె నేర్చుకొనెను. దేవుని యెదుట తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి ఆమె తనను తాను సమర్పించుకొనెను. అంతమాత్రమే కాదు, 'నా అవగాహన మరియు సామర్థ్యము మీద కాదు. ప్రభువా, నీ నడిపింపు మీద మరియు నీ ప్రణాళిక మీద నేను ఆధారపడతాను' అని ఆయన సన్నిధిలో విన్నవించుకొనెను. ఆమె కారుణ్యలో తన యొక్క విద్యలో సఫలీకృతురాలైనది.

ఆమె ఆస్ట్రేలియా దేశమునకు సంబంధించిన రాష్ట్ర స్థాయి చట్టాలు అమలుకు సంబంధించిన సాంకేతి విభాగమునకు ఆమె అధ్యక్షురాలుగా నియమితురాలైనది. ఎంతగొప్ప ఆశ్చర్యము కదా. దేవుడు ఆమెను ఎంత గొప్పగా ఘనపరచి, వృద్ధిపొందింపజేశాడు కదా! అట్టి గొప్ప ప్రతిభ గల స్త్రీల యాజమాన్యపు విభాగములో ఆమె ఫోటీ దారురాలుగా ఉండెను. ఆమె ఆ్రస్టేలియా దేశములో అత్యుత్తమ మహిళా నిర్వాహకురాలిగా 'ఉమెన్ అండ్ పోలీసింగ్ ఎక్సలెన్స్' అవార్డుకు నామినేట్ చేయబడినది మరియు వికలాంగులకు ఆమె చేసిన అత్యుత్తమ పోలీసు సేవకు ప్రత్యేక పురస్కారాలను ఆమె పొందుకొనగలిగెను. కారుణ్యలో విద్యను అభ్యసించిన ప్రతివారికి కారుణ్య సామర్థ్యమును ఈ విధంగా అలవరుస్తుంది. కారుణ్యలో విద్యను అభ్యసించువారు మానవాళి సమస్యల పరిష్కారాల కొరకైౖ లేవనెత్తబడుచున్నవారిగా ఉంటున్నారు. నా ప్రియులారా, మీరు కూడా ఇలాగుననే ఆశీర్వదింపబడవచ్చును. కనుకనే, మీరు కారుణ్యకు రండి. మీరు జాతీయ మరియు అంతర్జాతీయ నాయకులు అవుతారు. ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి స్వాధీనపరచుకొనెను. కనుకనే, దేవుడు ఆమెను మానవాళి యొక్క ప్రేమకు సూచనగా చేసియున్నాడు. నా స్నేహితులారా, ఈ రోజున మిమ్మును కూడా యేసు ద్వారా మానవాళి కొరకైన తన ప్రేమకు సూచనగా చేసియున్నాడు. ఈ రోజు మీరు కూడా యేసు ద్వారా మానవాళి కొరకు ఆలాగున జాగ్రత్త వహించేవారిగా ఉండగలుగుతారు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక!

ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ ముద్ర ఉంగరంలా, నీ అధికారం, నీ అనుగ్రహం మరియు నీ ప్రేమకు చిహ్నంగా చేస్తానని నీవు చేసిన వాగ్దానానికి కృతజ్ఞతలు. ప్రభువా, మేము చేసిన దేని వలన కాదు, నీ కృప వల్లననే నీవు మమ్మును ఏర్పరచుకున్నావని మేము తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మును ముద్రించు మరియు మా జీవితంపై నీ చేయి ఉండునట్లుగాను, తద్వారా మేము నిత్యము ఫలములను ఫలించునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీ మహిమ మరియు ప్రేమను వెల్లడించడానికి మమ్మును లోకానికి ఒక సూచనగాను మరియు అద్భుతంగా ఉపయోగించుకొనుము. దేవా, మమ్మును నీ యందు ఆశీర్వాదకరమైన పాత్రగా, నీ శక్తి మరియు దయతో జీవముగల సూచనగా మమ్మును మార్చుము. ప్రభువా, నీవు మమ్మును ఏర్పరచుకొని, అనేకులకు ఆశీర్వాదకరమైన వారినిగా మమ్మును మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.