హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 23:30వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొను వరకు క్రమక్రమముగా వారిని నీ యెదుట నుండి వెళ్లగొట్టెదను'' అని చెప్పబడిన ప్రకారము అవును, మీ శత్రువులను గురించి ప్రభువు ఈ వాగ్దానమును ఇచ్చుచున్నాడు. వారిని క్రమక్రమముగా ప్రభువు వెళ్లగొట్టి వేస్తాడు. అది వెంటనే జరుగకపోవచ్చును. ఒక రాత్రిలోనే అది ఒకవేళ జరుగక పోవచ్చును. అయితే, క్రమక్రమముగా అది జరిగి వారు పూర్తిగా అదృశ్యమైపోతారు లేక కనిపించకుండా పోతారు అని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు.

ఆలాగుననే, కారుణ్యకు కూడా ప్రభువు అదే వాగ్దానము చేసియున్నాడు. కారుణ్యను ప్రారంభించినప్పుడు, అది చాలా చిన్న స్థలము. అక్కడ కొన్ని భవనములు మాత్రడ ఉండెను. అక్కడ మేము కారుణ్యాను నిర్మించడము వారికి ఇష్టము లేని ప్రజలు అనేకమంది అక్కడ ఉండేవారు. మేము ఆ స్థలములో విస్తరించడము అక్కడ ఉన్న వారికి ఇష్టము లేదు. అయితే, కారుణ్య ఉన్నత శిఖరములకు విస్తరించాలని ప్రభువు గొప్ప దర్శనమును ఇచ్చియున్నాడు. కనుకనే, 'శత్రువులందరిని క్రమక్రమముగా వెళ్లగొడతానని' ప్రభువు ఈ వాగ్దానమును అప్పుడు మాకు ఇచ్చియున్నాడు. అది ఒక రాత్రిలో జరుగలేదండి. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఆ స్థలమునువిడిచి వెళ్లిపోవునట్లుగా ప్రభువు కృపను అనుగ్రహించాడు. తద్వారా, కారుణ్య, ఆ స్థలమును పొందుకొని, అక్కడ గొప్ప భవనములు నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఆ స్థలము వందలాదిమంది పిల్లలకు దీవెనకరముగా ఉన్నది. అందుకే బైబిల్ నుండి యెషయా 54:3వ వచనములో చూచినట్లయితే, " కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును'' ప్రకారము మీరు మరియు మీ కుటుంబమును, మీరు కలిగియున్న సమస్తమును కుడికిని, ఎడమకు కూడా వ్యాపించెదరు అని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు.

నా ప్రియులారా, ఒకవేళ, మా పొరుగు యింటివారు మాకు అనేకులు శత్రువులుగా ఉన్నారు అని మీలో అనేకులు చెప్పవచ్చును. మేము ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాము అని అంటున్నారా? అయితే, మీరు అన్నివైపుల వ్యాపింపబోవుచున్నారు అని ప్రభువు మీకు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీ జీవితములో నుండి మీ శత్రువులను తొలగిస్తాడు, మీ శత్రువులందరు మీకు స్నేహితులుగా మారిపోతారు. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానము కదా! కనుకనే, ఒకవేళ, నా ప్రియులారా, మీరు, 'మేము ఎక్కడికి వెళ్లినను, శత్రువులు మమ్మును చుట్టుముట్టుచున్నారు అని అంటుండవచ్చును, మేము నివసించుచున్న స్థలములో ప్రశాంతంగా ఉండలేకపోవుచున్నాము అని అంటున్నారా?' అయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ శత్రువులను క్రమక్రమముగా మీ యొద్ద నుండి తొలగించి, ప్రభువు మీ శత్రువులను మీకు మిత్రులనుగా మార్చి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, మా జీవితములో పోరాడుచున్న శత్రువులను మా నుండి తొలగించుము. దేవా, మా శత్రువులను ఈ రోజే క్రమక్రమముగా తొలగించి, మాకు సమాధానమును అనుగ్రహించుము. ప్రభువా, ఇప్పుడే నీ వాగ్దానము మా మీదికి దిగివచ్చునట్లుగా చేసి, మా శత్రువులను ఇప్పుడే మాకు మిత్రులనుగా మార్చుము. ప్రభువా, మా శత్రువులను క్రమక్రమముగా తరిమివేస్తానని వాగ్దానం చేసినందుకు వందనములు. దేవా, మేము వెంటనే, మార్పులను చూడకపోయినను సరే, నీ వాగ్దానమును నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము గొప్ప ఆశీర్వాదాలను పొందుకొనుటకు మమ్మును సిద్ధపరచి, ఉన్నత స్థాయికి మమ్మును హెచ్చించుము. దేవా, మా జీవితం నుండి ప్రతి వ్యతిరేకతను తొలగించుము. యేసయ్యా, మా శత్రువులను మాకు మిత్రులనుగా చేయుము. దేవా, మమ్మును కుడికి మరియు ఎడమ వైపుకు వ్యాపింపజేయుము. ప్రభువా, మా కుటుంబాన్ని శాంతిసమాధానముతోను మరియు భద్రతతోను కాపాడి స్థిరపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.