నా ప్రశస్తమైన స్నేహితులారా, దేవుడు ఈ రోజు మిమ్మును స్వస్థపరుస్తానని సెలవిచ్చుచున్నాడు. అవును, ఆయన నేటి వాగ్దానము ద్వారా దానిని మీకు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 57:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును'' అని చెప్పబడిన ప్రకారము నేడు మీలో ఎటువంటి వ్యాధులున్నను సరే, దేవుడు మిమ్మును స్వస్థపరచి, దుఃఖములో ఉన్న మిమ్మును ఓదారుస్తాడు. నా ప్రియులారా, ఒకవేళ మీరు, 'మా జీవితంలో అంతా అయిపోయిందని మీరు అంటున్నారా?' అయితే, దేవుడు, 'నేను నిన్ను స్వస్థపరచుదును' అని సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మనలను స్వస్థపరచే దేవుడు మనకు ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 15:26వ వచనములో చూచినట్లయితే, ఆయన ఇలాగున అంటున్నాడు, "మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.'' అవును, నా ప్రియులారా, ఈ లోకములో మనలను స్వస్థపరచువాడు దేవుడు మాత్రమే. బహుశా! మీ జీవితంలో సమస్తమును విఫలమై ఉండవచ్చును. బహుశా! మీ అవయవాలు పాడైపోయి ఉండవచ్చును. కానీ, యేసు తన గాయముల ద్వారా మిమ్మును పునరుద్ధరించి ఇప్పుడే స్వస్థపరుస్తాడు.
అందుకే బైబిల్ నుండి యిర్మీయా 30:17వ వచనములో చూచినట్లయితే, ఆయన ఇలాగు న ప్రకటించుచున్నాడు, " వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదని యు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయము లను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడిన ప్రకారముగా మిమ్మును వెలివేయబడియున్నారని అంటుండవచ్చును. ఇంకను మిమ్మును చూచి, మీరు అనాథలు' అని అంటుండవచ్చును. లేదు, నా ప్రియులారా, అటువంటి మిమ్మును చూచి, దేవుడు, ' నేను నిన్ను ఇకపై ఆ స్థితిలో ఉండటానికి అనుమతించను. నేను నిన్ను పునరుద్ధరిస్తాను. నేను నీ గౌరవాన్ని పునరుద్ధరిస్తాను. నేను నీ జీవిత ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాను. నేను నీ కుటుంబ ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాను. నేను నీ ఆత్మ ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాను' అని తెలియజేయుచున్నాడు.
అవును, నా ప్రియులారా, నేడు మీ విద్య యొక్క ఆరోగ్యాన్ని నేను పునరుద్ధరిస్తాను మరియు మిమ్మును ఉన్నత స్థానములకు నడిపిస్తాను, మీ గాయములన్నిటిని నేను బాగు చేస్తాను మరియు దుష్టుల వలన కలిగించుచున్న గాయములను నేను మాన్పివేస్తాను. ఆలాగుననే, మీ జీవిత సమస్యల వలన మీరు ఎదుర్కొనే గాయలను మరియు దుష్ట సాతాను వలన కలిగే గాయాలు, ఇంకను పాపం వలన కలుగు గాయాలన్నిటిని నేను స్వస్థపరుస్తాను' అని వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు, యేసు మీ జీవితములో సమస్తమును బాగు చేయుచున్నాడు. కాబట్టి, మీరు మీ యొక్క తీరని వ్యాధులు మరియు మీ సమస్యలను గురించి మీరు చింతించుచుండవచ్చును? అయితే, దుఃఖపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ వారి ప్రవర్తనను చూచియున్నాడు, ఇక నుండి మిమ్మును స్వస్థపరచి, మిమ్మును నడిపించి, దుఃఖించుచున్న మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఓదార్చి, మిమ్మును పరవశింపజేసి, దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, మా జీవితంలోని సమస్తమును స్వస్థపరచుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును స్వస్థపరచే దేవుడవు నీవే అని నమ్మి ఈ రోజు మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. యేసయ్యా, మా ఆరోగ్యమును పునరుద్ధరించి, మా గాయములన్నిటిని బాగుచేస్తానని నీవు చేసిన వాగ్దానానికై నీకు వందనములు. ప్రభువా, ప్రజల వలన, సమస్యల వలన, పాపం వలన, శత్రువు దాడుల వలన కలుగుచున్న ప్రతి బాధను, దయచేసి ఈరోజే దానిని స్వస్థపరచుము. దేవా, మా శరీరం, మా మనస్సు, మా ఆత్మ మరియు మా జీవితంలోని ప్రతి భాగాన్ని నీవు స్వస్థపరచుము. ప్రభువా, మేము కోల్పోయిన సమాధానమును పునరుద్ధరించుము మరియు మా కుటుంబాన్ని, మా భవిష్యత్తును మరియు మేము చేయుచున్న ప్రతిదానిని నీ స్వస్థత స్పర్శతో మమ్మును బాగు చేసి, మమ్మును ఆశీర్వదించుము. దేవా, నీ వాక్యంలో నీవు వాగ్దానం చేసినట్లుగానే, నీ స్వస్థత మా ద్వారా ప్రవహించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


