యేసు పిలుచుచున్నాడు పరిచర్య అనేది కులం, జాతి, మతం అని ఏ బేధము లేకుండా ప్రజల కోసం ప్రార్థించే ఒక గొప్ప పరిచర్య. డాక్టర్. డి.జి.యస్. దినకరన్‌గారిచే ఈ పధకము స్థాపించబడినది మరియు డాక్టర్. పాల్ దినకరన్‌గారి ద్వారా మరియు దినకరన్ కుటుంబము ద్వారా ఈ పరిచర్య 4 తరాలుగా కొనసాగుతుంది. ప్రేమ మరియు కనికరముతో నింపబడిన ఈ పరిచర్య లక్షలాది మంది ప్రజల కన్నీళ్లను ప్రార్థనల ద్వారా పూర్తిగా తుడుచుచున్నది. దినకరన్ కుటుంబము మరియు ప్రార్థన యోధుల ప్రవచనాత్మక మాటల ద్వారా ప్రజల ప్రార్థనలు నెరవేర్చబడుచున్నవి.

"యేసు పిలుచుచున్నాడు పరిచర్య'' యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, "విరిగినలిగిన హృదయం'' గల ప్రజలందరు ఓదార్పు పొందుట కొరకే ప్రార్థించుచున్నది (యెషయా 61:7), సంరక్షణ, కాపుదల (మత్తయి 9:35,36), ప్రార్థన మరియు ప్రభువైన యేసు యొక్క త్యాగం మరియు విజయంను గురించి దేవుని వాగ్దానం ద్వారా మరియు ఆయన ప్రేమ ద్వారా ఆయన చేసిన అద్భుతాలకు సాక్ష్యాలు ద్వారా ప్రోత్సహించుటయే (ప్రకటన 12: 10,11).

టి.వి. కార్యక్రమములు, టి.వి. ఛానల్, ఆన్‌లైన్ వేదికలు, కావలసిన వీడియోలు, బహిరంగ ప్రార్థన పండుగలు, ఏడాది పొడవునా 24 X7 టెలిఫోన్ ప్రార్థన గోపురములు 12 భాషల్లో (ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, సింహళ, ఒరియా, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ), ఇ-మెయిల్, ఫీల్డ్ అంబాసిడర్ల్లు, ఇళ్ళను దర్శించుట ద్వారా, ఉత్తరముల ద్వారా, ప్రార్థన విన్నపములకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఆశీర్వాదకరమైన పరిచర్యలలో దినకరన్ కుటుంబము వారి వ్యక్తిగత ప్రార్థనలలో ఇది ఒకటి. ప్రార్థన గోపురము మరియు భాగస్థుల కూటములు, పేదలకు ఆహారం పంచండం, గ్రామాలలో చర్చిలను నిర్మించటానికి మరియు పేద పాస్టరు పిల్లలను పరామర్శించడానికి మరియు వారి అనారోగ్య సమయాలలో, పేద పిల్లలకు దుస్తులు ఇవ్వడం, వృద్ధులకు సంరక్షణ గృహం ద్వారా వృద్ధులను పరామర్శించడం, పేద పిల్లలకు ట్యూషన్ కేంద్రాలు, హిజ్రాల కొరకు నైపుణ్య శిక్షణ యొక్క పునరావాస పధకం మరియు పేద మహిళలకు డ్రైవింగ్ శిక్షణ మరియు పేద యువతకు ఉద్యోగ నియామకాలు, ఇళ్లు లేని పేదలకు స్వచ్ఛమైన నీరు, రోడ్లు మరియు సొంత వ్యాపారంతో గృహాలు నిర్మించుట, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్య సంరక్షణ హాస్పిటల్ మరియు మెడికల్ మిషన్లు, వికలాంగులైన పిల్లలకు చికిత్స ద్వారా వివిధ సేవలను అందించుచున్నాము..

ఈ సేవలన్నియు ఉచితంగా అందించబడుచున్నవి. ప్రార్థన యోధులు 24 గంటలు ప్రజల కోసం ప్రార్థన చేయడానికి అందుబాటులో ఉంటారు.

వీటన్నిటి ద్వారా, ప్రతి సంవత్సరం భారతదేశం అంతటా మరియు ఇతర దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచరులతో భాగస్థులను చేయడం ద్వారా అనేక లక్షలాది మందికి సేవలు అందించబడుచున్నాయి. ఎంతమంది ఆశీర్వదించబడ్డారో పరలోకములో మాత్రమే గుర్తించబడుతుంది. మేము ప్రజలకు సేవ చేయుచున్నాము. కానీ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించుచున్నాడు.

కనుకనే, ప్రతినెలా అనేక వందలాది మంది సిబ్బందికి జీతాలు చెల్లించడానికి మరియు వివిధ వాణిజ్య నెట్‌వర్క్‌లలో టి.వి. ప్రసారం ద్వారా ప్రజలకు సేవలను అందించుటకును మరియు వారిని పరామర్శించుటకును, కేబుల్ ప్లాట్‌ఫాంలు, తపాలా, ఐటి వ్యవస్థలు ఫోన్ ద్వారా మౌలిక సదుపాయాలు మరియు 120 ప్రార్థన గోపురములను వ్యవహరించడానికి కంప్యూటర్లు, ప్రార్థన గోపుర భవనాలకు అద్దెలు మరియు లక్షలాది మంది తరతరములు ఆశీర్వదించబడడానికి వీడియోలు, ఆడియోలు మరియు డేటాను భద్రపరచబడుటకును, 100 చర్చిలు మరియు ఇళ్ళు నిర్మించుట మొదలైన ఖర్చులకు యేసు పిలుచుచున్నాడు పరిచర్య ఎంతో బాధ్యత వహిస్తుంది. అలాగే, అనేక వేలాదిమంది పేదలకు, ఆహారం, విద్య, దుస్తులు, నైపుణ్యాలపై శిక్షణ మరియు గృహాలు నిర్మించడం మరియు నిరాశ్రయులకు వ్యాపారాలు ప్రారంభించడానికి సహాయాన్ని అందించుట కొరకే దినకరన్ కుటుంబము వారు శ్రమించుచున్నారు.

ఈ అత్యంత సహకారము ఇండియా మరియు శ్రీలంక, ఇంకను ఇతర దేశముల నుండి అందించబడుచున్నది. యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు (జెసిపి మరియు వైపిపి, ఎప్‌బిపి, బిబిపి, ప్రార్థన గోపురము నిర్మాణ నిధి, మ్యాగజైన్, మొదలైనవి) అంశముల ద్వారా కృతజ్ఞత కానుకగా పంపించే మొత్తం డబ్బును మీలాంటి భాగస్థుల యొద్ద నుండి పొందుకొంటున్నాము.

ఈ పరిచర్యకు సహాయమందించాలనుకున్నట్లయితే లేక యౌవనస్థులైన పిల్లలను ఆదరించుటకు, మీ పిల్లలను యౌవన భాగస్థుల పధకములో భాగస్థులనుగా చేర్చినప్పుడు, 1 దినవృత్తాంతములు 4:10 ప్రకారం యబ్చేజు ప్రార్థన ఆశీర్వదింపబడినట్లుగానే, మీ పిల్లలు కూడ ఆశీర్వదింపబడునట్లుగా ప్రభువు వాగ్దానము చేసియున్నాడు.

  • బుద్ది మరియు జ్ఞానం యొక్క ఆశీర్వాదం అందించడం

  • ప్రపంచంలోని సమస్త కీడుల నుండి సంరక్షణ కల్పించడం

  • ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అందించడం.

ప్రార్థన గోపురములలో ఉన్న ప్రార్థన యోధులు ప్రతి రోజు, ప్రతి ఒక్క యౌవన భాగస్థుని కొరకు ఈ వాగ్దాన వచనమును దేవుడు వారి జీవితాలలో నెరవేర్చవలెనని ప్రార్థించుచున్నారు. అదేవిధంగా, దినకరన్ కుటుంబము వారు కూడ యౌవన భాగస్థులు ఆశీర్వదింపబడవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నారు.

ఆలీషా, మహారాష్ట్రకు చెందిన ఒక యౌవన భాగస్థురాలి యొక్క సాక్ష్యమును మీతో పంచుకొనుచున్నాను!

"నేను నాగ్‌పూర్‌కు చెందినదానను, నా బాల్యంలో నా చదువులో నేను చాలా బలహీనంగా ఉండేదానను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు నన్ను యౌవన భాగస్థుల పధకములో భాగస్థురాలినిగా చేర్చారు. తద్వారా, దీని తరువాత, నేను నా చదువులపై పూర్తిగా ఆసక్తిని చూపడానికి ప్రభువు నాకు కృపను చూపించాడు. మరియు నా సబ్జెక్టులను సులభంగా గ్రహించగలుగుటకును మరియు జ్ఞాపకశక్తి కలిగియుండుటకు ప్రభువు ఎంతో సహాయపడుచుండెను. మరియు నా చదువులలో జ్ఞానము అభివృద్ధి చెందినది. తత్ఫలితంగా, నేను చక్కగా చదువుటకు ప్రారంభించాను. తద్వారా, ప్రార్థన గోపురములో ప్రార్థన యోధులు ప్రతి రోజు నా కోసం ప్రార్థిస్తున్నారని అప్పుడు నేను గ్రహించగలిగాను. నా 10 వ తరగతి బోర్డు పరీక్షలు రాబోతున్న సమయములో, నా కోసం ప్రార్థన చేయమని డాక్టర్. పాల్ దినకరన్ అంకుల్‌గారికి ఒక ఉత్తరం వ్రాశాను. నన్ను ప్రోత్సహించిన ఆయనగారి ద్వారా నాలో మార్పు రావడం నాకు ఆశ్చర్యంను కలిగించింది మరియు దేవుడు నన్ను మంచి మార్కులతో ఆశీర్వదిస్తాడని ఆయన మాటలు నాలో నమ్మకమును కలిగించాయి. ప్రభువు వాగ్దానం చేసినట్లుగానే, నేను 98% మార్కులను సాధించాను మరియు నా మొత్తం మైనారిటీ సమాజంలో 10 వ తరగతిలో అగ్రస్థానంను పొందుకున్నాను. నేను పొందుకున్న విజయానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక."

ఇది ఒక చక్కటి సాక్ష్యము కాదా? మీరు కూడ యౌవన భాగస్థులుగా చేరుట ద్వారా ఆలీషా వలె ఆశీర్వదించబడవచ్చును.

పిల్లలు పుట్టిన తేదిన నుండి మరియు వివాహమయ్యే వరకు, యౌవన భాగస్థుల పధకములో మీరు కూడ భాగస్థులుగా చేరవచ్చును.

ఈ దిగువ ఇవ్వబడిన ప్రకారము మీరు కానీ లేక మీ పిల్లలు కాని యౌవన భాగస్థుల పధకములో చేరవచ్చును:

  • మీ ప్రాంతంలో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము

  • ఈమెయిల్: [email protected]

  • ఫోన్ నెంబరు. 044 23456677.

  • మా చిరునామా: ప్రార్థన గోపురము, 16, డి.జి.యస్. దినకరన్ రోడ్డు, చెన్నై - 600 028