నా ప్రియ స్నేహితులారా, ఇది క్రిస్మస్ తర్వాత రోజు. కాబట్టి, ఈ క్రిస్మస్‌ను మీరు ఎలా జరుపుకున్నారు. మీరు కేక్ తిన్నారా? మీకు బహుమతులు లభించాయా? అయితే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:15వ వచనములో ఈలాగున సెలవిచ్చుచున్నది. ఆ వచనము, "క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి... '' ప్రకారము కేక్ మరియు బహుమానములు కాదు. కానీ, క్రీస్తు తన సమాధానముతో మీ హృదయములను నింపబోవుచున్నాడు. ఈ లోకములో మనము జీవించడానికి దేవుని సమాధానము ఎంతో ప్రాముఖ్యమైనది. అంతమాత్రమే కాదు, మన చుట్టు అనేక విషయాలు జరుగుచుంటాయి. మన ఫోన్ తెరచిన ప్రతిసారి లేక మనము వార్తలు విన్న ప్రతిసారి, ఏదో ఒక చెడు వార్త చూస్తుంటాము లేకపోతే వింటుంటాము. ప్రజలు హింసించబడడము మరియు ఆత్మహత్యలు చేసుకోవడము మనము చూస్తూ ఉంటాము. అది మనలో ఎంతో వేదనను కలుగజేస్తుంది. కానీ, ఇవన్నీయు మనకు వేదనలు కలుగజేయుచున్నవి. అయితే, మనలను తన సమాధానముతో ప్రభువు నింపుతానని ప్రభువు మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఈ విషయాలన్నియు మనకు వేదనను కలుగజేస్తాయని నాకు తెలుసు. కానీ, క్రీస్తు సమాధానముతో మనము నింపబడినప్పుడు, ప్రభువు మనలను మరియు మన కుటుంబాలను కాపాడతాడు.

అదేవిధంగా, క్రిస్మస్ కేక్‌ను ఎలా తయారు చేయబడుతుందో ఒక కథ ఉన్నది. ఇప్పటికి కూడా ఆలాగుననే చేస్తూ ఉంటారు. మీలో అనేకులు కృతజ్ఞతా విందును గురించి వినియుంటారు. పాశ్చత్య దేశములలో ఇది జరుపుకుంటా రు. వేరే సమయములలో కుటుంబాలలో గొడవలు పడుచున్నప్పటికిని, కృతజ్ఞతా కూడిక రోజున అందరు కలిసి వస్తారు. వారందరు కలిసి భోజనము చేస్తారు. మరియు కుటుంబముగా కలిసి ఉంటారు. మరుసటి రోజు మరల కొట్లాడుకుంటారు. వారి స్వంత అన్నదమ్ములతో మాట్లాడరు. ఒకరి నుండి ఒకరు దూరముగా ఉంటారు. అయితే, ప్రభువు ఈ రోజు అంటున్నాడు, 'నా సమాధానముతో నింపుతాను' అని సెలవిచ్చుచున్నాడు. మనమందరము ఆయన సమాధానములో ఐక్యముగా కలిసి ఉంటాము. క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము మాత్రమే కాదు, జీవితమంతయు కూడా. ఈ సమాధానముతో మీరు నింపబడినప్పుడు, ప్రభువు మిమ్మును కాపాడతాడు మరియు మీరు దీవింపబడతారు.

కొన్నిసార్లు, వార్తలలో ఈ విషయాలన్నిటిని గురించి నేను చూచినప్పుడు ఎంతగానో చింతిస్తాను. నా మనస్సులో అవి పనిచేస్తుంటాయి. క్యేటి బయటకు వెళ్లినప్పుడు క్షేమముగా ఉంటుందా? జేడెన్‌ను ఎవ్వరైన తీసుకొని వెళ్లిపోతారేమో? నా తల్లిదండ్రులు దూరముగా ఉన్నారు, వారు క్షేమముగా ఉంటారా? అని ఇలాగున భయపడడము సర్వసాధారణముగా నాలో కలుగుతుంది. అయితే, నేను కూర్చుని, ' ప్రభువా, నేను ఎంతగానో చింతించుచున్నాను, నన్ను నీ యొక్క సమాధానముతో నింపుము 'అని అడుగుతాను. నేను ఆలాగున చేసినప్పుడు, యేసయ్య అన్నిటిని చూచుకుంటాడు. అవును, నా ప్రియులారా, మన భారములన్నిటిని ఆయన మీద మోపినప్పుడు, ఆయన మన జీవితాలను పట్టించుకుంటాడు. మన పట్ల శ్రద్ధ వహిస్తాడు. కనుకనే, ఈ రోజు మన భారములన్నిటిని యేసయ్య మీద మోపుదామా? అంతమాత్రమే కాదు, మనము కలిసి ప్రార్థిద్దాము. కాబట్టి, ప్రభువు తన సమాధానముతో మిమ్మును నింపబోవుచున్నాడు. కనుకనే నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా కుటుంబాలను బట్టి, మా తల్లిదండ్రులతోను, మా బిడ్డలతోను, మా ప్రియులతోను దీవించినందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు నీ యొక్క సమాధానము మా కుటుంబాలపై దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబాలన్నియు ఎల్లప్పుడు కలిసి ఒక్కటిగా జీవించుటకు సహాయము చేయుము. దేవా, అపవాది మా గృహములలోనికి ప్రవేశించాలని అనుకున్నప్పుడు, నీవు దానిని గద్దించి, మేమందరము సమాధానమును, ఐక్యతను కలిగి జీవించునట్లుగా చేయుము. యేసయ్యా, ఈ యొక్క సమాధానము, ఐక్యతను మా జీవితాలలో క్రిస్మస్ బహుమానముగా మాకు దయచేయుము. దేవా, నీవు మాతో ఉండి రాబోవు దినములలో కూడా మమ్మును నడిపించుము. యేసు ప్రభువా, ఈ రోజు మేము మా చింతలు మరియు భయాలతో నీ దగ్గరకు వచ్చుచున్నాము. దేవా, మా చుట్టూ ఉన్న ఎన్నో విషయాలు ఆందోళన మరియు అశాంతిని కలిగించుచున్నవి, కానీ, ప్రభువా, నీ శాంతి మా హృదయాన్ని ఏలునని నీవు వాగ్దానం చేసినట్లుగానే, ఇప్పుడు మమ్మును నీ పరిపూర్ణ శాంతిసమాధానముతో నింపుము, అది సమస్త జ్ఞానమునకు మించినదిగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మమ్మును మరియు మా కుటుంబాన్ని రక్షించుము. దేవా, మ