నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున కూడా దేవునిలో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనలను బలపరచి, నడిపించుటకు ఆయనే స్వయముగా దిగివచ్చియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 91:4 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన నమ్మకత్వము మనకు సత్యము, కేడెమును డాలునై యున్నది. చూడండి ఒక పెద్ద పక్షి యొక్క రెక్కల క్రింద ఎంతో గొప్ప వెచ్చదనమును మరియు ఆశ్రయమును పొందియున్నట్లుగా, మనకు అనుభూతి కలుగడము జరుగుతుంది. ఆ రీతిగానే, ఒక తల్లి పక్షి తన బిడ్డలను రక్షిస్తుంది. అత్యంత ప్రఛండమైన కీడుకరమైన సమయములలో కూడా తన రెక్కలు చాపి, తన బిడ్డలను తన బిడ్డలను రక్షిస్తుంది. నా ప్రియులారా, ఆ రీతిగా ప్రభువు తన బిడ్డలైన మనలను తన రెక్కలతో కప్పుచున్నాడు. ఆయన నమ్మకత్వము మనకు సత్యము, కేడెమును డాలుగా ఉన్నదని వ్రాయబడియున్నది. అవును, మనము ఎరిగియున్నట్లుగానే, ఆయన మనకు సత్యము కేడెము డాలుగా ఉంటూ, మన హృదయమును భద్రపరుస్తుంది. కనుకనే, దిగులుపడకండి.

నా జీవితములలో చూచినట్లయితే, మా ఆంటీ మరియు అంకుల్‌గారు ఎప్పుడు ఈ రీతిగా తెలియజేస్తుంటారు. వారి దేహములో ఉన్న భయంకరమైన వ్యాధి సందర్భములలో కూడా, వారి యొక్క అత్యంత కుటుంబ సమస్యలలో కూడా మరియు వారి జీవితములలో వారు ఎదుర్కొంటున్న సమస్యలలో కూడా వారు ఎల్లప్పుడు చెబుతుంటారు, "ప్రభువును స్తుతించండి, ఆయన కృపా కనికరము నిరంతరముండును.'' అంతమాత్రమే కాదు, వారు నా యొద్దకు వచ్చి, 'శ్యామ్, ఆయన కృపా కనికరము నిరంతరముండును గనుకనే, నీవు ఎల్లప్పుడు ఆయనను స్తుతించుచూ ఉండవలెను మరియు నీవు దేనిని గురించి చింతించనవసరము లేదు ' అని చెబుతుంటారు. ఆలాగుననే, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి నాకు చెబుతున్నప్పుడు, నా గుండె బ్రద్దలైపోతున్నట్లుగా ఉంటుంది. అయినప్పటికిని, 'దేవా, నీ కృపా కనికరము నిరంతరము నిలిచియున్నది గనుకనే, ప్రభువా, మేము నిన్ను స్తుతించుచున్నాము' అని అంటారు.

అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మనము కూడా ఆ రీతిగానే చెప్పాలి. ఆయన ప్రేమ మన పక్షముగా ఎల్లప్పుడు నిలిచి ఉంటుందని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఆయన మన ప్రక్కన ఉండడానికి ఎప్పటికిని నమ్మదగినవాడుగా ఉన్నాడు. ఆయన కనికరమును బట్టి, మనకు అవసరమైన దానిని బట్టి మనకు సమృద్ధిగా అనుగ్రహించి మనలను ఆశీర్వదించుచున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును గాక. అందుచేత గొప్ప యుద్ధాలు పోరాటల సమయములలో కూడా ఇశ్రాయేలీయులు కేవలము ఆయనను స్తుతించుచూ ఉంటారు. అవును, నా ప్రియులారా, ప్రభువును స్తుతించుట మనకు కేడెముగా ఉంటుంది. ఆయన మన హృదయములను భద్రపరుస్తాడు. యేసును మనలో ఉంచుతాడు. ఆయన ద్వారా మనకు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు. మనము ఇప్పుడు కూడా అట్టి కేడెము మోయుదమా? ఆలాగుననే, నా స్నేహితులారా, ఇప్పుడు మీరు, నాతో కలిసి చెప్పండి, 'దేవా, నీ కృప మా జీవితములో నిరంతరము నిలిచి ఉండును గాక.' ఈ యొక్క భయంకరమైన స్థితిగతులలో కూడా, ఈ గొప్ప వ్యతిరిక్తుల మధ్యలో కూడా, నేను ఏమని చెబుతానంటే, 'దేవా, నీ కృప నిరంతరము నా యెడల నిలుచును.' కనుకనే, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులలో కూడా మీరు దేవునిని స్తుతించినప్పుడు, ఆయన సత్యము, కేడెమును డాలు మిమ్మును ఎల్లప్పుడు కప్పుతుంది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవు నమ్మదగినవాడవు, గనుకనే, ఎల్లప్పుడు నిన్ను స్తుతించుటకు మాకు సహాయము చేయుము. యేసయ్య, ఎల్లప్పుడు నిన్ను స్తుతించుట ద్వారా నీ కృపా కనికరము మా యందు నిలిచియుండునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా, మా హృదయాలు నీ యొక్క నమ్మకత్వమును పొందుకొనుటకు నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, నీ యొక్క బలమైన శక్తిని మా పరిస్థితులలోనికి తీసుకొని వచ్చి, మమ్మును నీ కేడెము మరియు డాలుతో కప్పుము. ప్రభువా, ఇప్పుడే, మా జీవితములో నీ యొక్క అద్భుతములతో నింపుము. దేవా, తెరవబడలేని, ద్వారములు ఇప్పుడు తెరవబడునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మాకు విరోధముగా ఉన్న ప్రతి శత్రుత్వము కూలిపోవునట్లుగాను, ఇప్పుడే ప్రతి వనరులు మా యొద్దకు వచ్చునట్లుగా నీ కృపను మా పట్ల కనుపరచుము. దేవా, నీ నమ్మకత్వము గొప్పదిగా మా పట్ల ఉండునట్లుగాను, నీ కనికరము నిరంతరము మా పట్ల నిలిచి ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, వ్యతిరేకత మరియు ప్రతి కష్టమైన పరిస్థితి మధ్యలో కూడా, నీ విశ్వసనీయతపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు నామమున అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.