హలో నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు నా ప్రియ కుమారుడు జెడెన్‌తో మీ ముందుకు వచ్చియున్నాను. మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు అని మిమ్మును ప్రోత్సహించడానికి మీ ముందుకు వచ్చియున్నాను. ఎప్పుడు మీకు ఒంటరిగా అనిపించిన ప్రభువు మీ ప్రక్కనే ఉన్నాడు అని మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఒక చిన్న బిడ్డ తన తల్లిని ఏలాగున ప్రేమించుచున్నాడని మీలో ఎంతో మంది చూచియుంటారు కదా! అవును, నా ప్రియులారా, ఒక ప్రక్కన తన తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుందని మనకు తెలుసు. మరొక ప్రక్కన ఆ చిన్న బిడ్డ తన తల్లిని ఎంతగానో అంటుకట్టుకొని ఉంటుంది. కనుకనే, దేవుని ప్రేమ కూడా ఆలాగుననే, ఉంటుంది.

ఆలాగుననే, జెడెన్ ఇప్పుడిప్పుడే, నేలపై చక్కగా ప్రాకడము మొదలు పెట్టాడు. నేను తనను గదిలో విడిచిపెట్టి, బాత్రుముకు వెళ్లినప్పుడు కూడా తన చిన్న చేతులతోను మరియు కాళ్లతోను ప్రాకుచున్న శబ్దము నాకు వినబడుతుంది. అవును, ప్రభువు కూడా మనకు అతి సమీపముగా ఉండాలని మన పట్ల కోరుకుంటున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు మీలో ఒంటరిగా ఉన్నాను అను భావన కలుగుతుందేమో! కానీ, ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడని మీరు మరువకండి.

నా ప్రియులారా, కొన్నిసార్లు మన స్నేహితులు మరియు మన కుటుంబ సభ్యులతోను మరియు అందరితోను మనము చుట్టుబడి ఉంటాము. అయినప్పటికిని, మనము ఒంటరిగా ఉన్నామని భావిస్తుంటాము. అందుకే బైబిల్ నుండి నిర్గమకాండము 6:7వ వచనములో చూచినట్లయితే, "మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు'' అని చెప్పబడిన ప్రకారము అవును, ప్రభువే మనకు దేవుడై యున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు తోడుగా ఎవరున్నా, లేకపోయినను సరే, ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఈ రోజు ఈ సత్యమును నమ్మి, దేవునికి వందనములు చెల్లించి, ప్రార్థించండి. ప్రభువు మిమ్మును తన బిడ్డలుగా ఉండడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి, మీరు ఎప్పుడు కూడా ఒంటరివారు కాదు. ఆయన మీతో కూడా ఉన్నాడు. కనుకనే, నిశ్చయముగా, దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనము. యేసయ్య, మేము ఒంటరిగా ఉన్నామని భావించే మాకు , మేము ఎప్పుడూ ఒంటరిగా లేమని నీవు మాతో ఉన్నావని మాకు గుర్తు చేసినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ సన్నిధానముతో మమ్మును నింపుము. దేవా, నీ యొక్క సమాధానమును మా హృదయముతో నింపునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా హృదయం ఒంటరిగా అనిపించినప్పుడు కూడా, నీవు ఎల్లప్పుడూ మా ప్రక్కన ఉన్నారని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీకు సమీపముగా వచ్చునట్లుగాను మరియు ఒక బిడ్డ తల్లికి సమీపముగా ఉన్నట్లుగా మేము నిన్ను హత్తుకొని ఉండునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, దయచేసి మా హృదయాన్ని నీ సన్నిధి యొక్క ఓదార్పుతో నింపుము. దేవా, మా యొక్క ప్రతి ఒంటరి భావనను తొలగించి, దానిని నీ సమాధానముతో సరిచేయుము. ప్రభువా, నీవు ప్రతి క్షణం మాతో నడుస్తున్నావని విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును సొత్తు అని పిలిచినందుకు మరియు నీవు మా దేవుడవుగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ రోజు మరియు ఎల్లప్పుడూ నీ యొక్క ప్రేమ మమ్మును చుట్టుముట్టునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.