హలో నా ప్రియ స్నేహితులారా, మీ కొరకు మరియు మీ తరముల కొరకు ఈ రోజు వాగ్దానము అనుగ్రహింపబడియున్నది. కనుకనే, మనం విశ్వాసముగా ఉన్నప్పుడు, ప్రభువు మనలను మరియు మన తరము వారిని కూడా ఫలభరితముగా ఉండునట్లుగా ఆశీర్వదిస్తాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 27:6 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు'' అని చెప్పబడియున్నట్లుగానే, మీరు ఫలభరితముగా చేయబడుదురు. ఇది ఎంత చక్కటి వాగ్దానం కదా. ఈ వాగ్దాన వచనంలో మనము రెండు భాగములను చూడగలము: మొదటిదిగా, యాకోబు వేరు పారును. యాకోబు వేరు పారినప్పుడు మాత్రమే, ఇశ్రాయేలు చిగురించి పూయును. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, మీరు ప్రభువునకు మరియు ఆయన పిలుపునకు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే, మీ తరములు ఆశీర్వదింపబడును. అది జరగాలంటే, మనం ప్రభువునకు ఎంతో సన్నిహితంగా ఉండవలెను. అందుకే బైబిల్‌లో ఇలాగున చెప్పబడియున్నది, "దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును'' ప్రకారము మీరు దేవునికి సమీపముగా ఉన్నప్పుడు, ఆయన మీకు దగ్గరవుతాడు. నా ప్రియులారా, కాబట్టి ఈ రోజు, మీరు యేసుకు దూరంగా ఉన్నట్లయితే, ఆయన వద్దకు తిరిగి రావడానికి ఎప్పుడూ ఆలస్యము చేయకండి. మీరు ఆయన యొద్దకు రావాలంటే, ప్రతిరోజు మీరు క్రమము తప్పకుండా బైబిల్‌ను చదవండి మరియు మీకు ఆయన ఇచ్చిన వాగ్దానములన్నింటిని వ్రాసుకొని, ధ్యానించండి మరియు మీరు ప్రభువునకు అత్యంత సన్నిహితంగా ఉండండి. ఇంకను ఆయనలో మీరు వేరుపారవలెను. మీరు అలాగున చేసినప్పుడు, నిశ్చయముగా మీ తరములన్నియు ఆశీర్వదించబడుచున్నవి మరియు వారు కూడా ఫలించుటకు ప్రారంభించెదరు.
నా ప్రియులారా, ఒక వృక్షము ఎదిగి వర్థిల్లుతుంది అని మనకు తెలుసు. అదేవిధంగా, ఈ లోకములో మనం ఫలించే ఫలము. కనుకనే, మనం చేయునది ఏదైనప్పటికిని ప్రభువు దృష్టిలో అది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మరియు ప్రభువు మిమ్మును, మీ తరము వారిని కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. కనుకనే, మనము మాట్లాడే ప్రతి అనవసరమైన మాటకు ఆయనకు జవాబు చెప్పవలసి ఉంటుందని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, మనము మన సమయమును ఎలా గడుపుచున్నామనే విషయంలో జాగ్రత్తగా ఉందాము, అలాగే ఆ సమయమును ఆధ్యాత్మిక సేవలలో వెచ్చించుదాము. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువా, నీవు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానమునకై నీకు వందనములు. దేవా, మా జీవితంలోని ప్రతిరోజు క్రీస్తులో లోతుగా వేరుపారునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును నీకు మరింత సమీపముగా వచ్చునట్లుగాను మరియు నీ హృదయానికి దగ్గరగా ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీవిచ్చిన పిలుపులో విశ్వాసంగా మేము నడవడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీలో మేము వేరుపారినప్పుడు, మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చుము. దేవా, మా కుటుంబమును ఆశీర్వదించి, వారిని నీ యొక్క దైవీకమైన కృపతో కప్పి మరియు నీ సన్నిధితో ఆవరించునట్లుగా చేయుము. ప్రభువా, నీకు ప్రీతికరమైన మంచి ఫలములను మేము ఎల్లప్పుడు ఫలించునట్లుగా మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


