నా స్నేహితులారా, ఈ రోజు మన ప్రభువైన యేసు పలికిన ఈ మాటలను గురించి మనము ధ్యానించుకుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి సువార్త 5:3వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది'' అని చెప్పబడినట్లుగానే, మీరు యేసు ప్రభువువలె దీనత్వము కలిగియుండాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. మనకు పరలోకము స్వంతము కావాలంటే, మనము దీనత్వమును కలిగియుండాలి. అవును, పరలోక రాజ్యమును మీరు పొందుకోవాలన్నను, అది మీ సొంతం కావాలన్నను మరియు పరలోక ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడవలెనన్నను సరే, మీరు ఆత్మలో దీనులై ఉండాలని ప్రభువైన యేసు సెలవిచ్చుచున్నాడు. నా విషయంలోనైనను సరే, మీ విషయంలోనైనను సరే, ఇదే వర్తించుచున్నది. అవును, నా ప్రియులారా, మనము ఆత్మలో దీనులమై ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదములను పొందుకుంటాము? ప్రభువు చిత్తమును నెరవేర్చడానికి, దీనత్వముతో మనలను మనము అప్పగించుకున్నప్పుడు, ఎలాంటి ఆశీర్వాదములను పొందుకుంటాము? అని మనము చూడగలము.
మొట్టమొదటగా, ఇటువంటి దీనత్వము వలన దీనులకు కృప దొరుకుతుంది. అందుకే బైబిల్ నుండి యాకోబు 4:6వ వచనములో చూచినట్లయితే, "కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.'' దీనత్వముగలవారిని చూచినట్లయితే, ఆత్మలో దీనులైన వారికి ఆయన కృపను అనుగ్రహించుచున్నాడు. ఈ కృప ద్వారా, మనము నిర్మూలముకాకుండా కాపాడబడుచున్నాము. అపవాది క్రియలు విస్తరించవచ్చును, దుష్టులు మీ మీదికి రావచ్చును. ద్రోహము చేయువారు మీకు విరోధముగా తలెత్తవచ్చును, నష్టాలు, వ్యాధులు మరియు మోసములు విస్తరించువచ్చును. కానీ, వాటన్నిటి మధ్యలో, ప్రభువు కృప కూడా మన జీవితములో సమృద్ధిగా విస్తరించుచున్నది. ఆ కృప మనలను అభివృద్ధి పొందునట్లుగా చేయుచున్నది మరియు మనలను ఆశీర్వదించుచున్నది. ప్రభువు ఈ రోజు మీకు ఆ ఆశీర్వాదమును అనుగ్రహించును గాక.
రెండవదిగా, దేశమునకు మరియు మన కుటుంబములకు సమృద్ధి కలుగజేయుచున్నది. అయితే, మనము ప్రార్థించి, మన పాపములను ఒప్పుకొని, క్షమించమని ప్రభువును అడిగినప్పుడు, ఆయన ఆ దేశమునకు మరియు మన కుటుంబములకు కూడా సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆయన దేశమును క్షేమముతో నింపుతాడు. ఆయన దేశమును కాపాడతాడు. దేశము పట్ల యేసు చిత్తమును నెరవేర్చడంలో ఆటంకములను కలిగించు శక్తులను ఆయన తొలగించి, ఆయనే సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అవును, ఆయన నామముతో పిలువబడుచున్నటువంటి మనము కూడా ఆయన వలె దీనమనస్సుతో ప్రార్థించి, ప్రభువు సన్నిధిని వెదకినప్పుడు దేశమునకు క్షేమము మరియు సమృద్ధి కలుగుతుంది. ఇటువంటి ఉన్నత కార్యమును మనము బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనములో మనము చదివినట్లయితే, " నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన పేరు పెట్టబడిన మనలను మనము ఆయనకు సమర్పించుకుందా ము. దేశములో సమృద్ధిని అనుగ్రహించమని ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన మన కుటుంబములకు కూడా దానిని అనుగ్రహిస్తాడు మరియు ఆశీర్వాదములను తీసుకొనివస్తాడు.
మూడవదిగా, తమ్మును తాము తగ్గించుకొనువారిని ప్రభువు హెచ్చిస్తాడు. కనుకనే, నేడు మనము, మనలను తగ్గించుకుని, ప్రభువు చిత్తమును నెరవేర్చడానికి మనలను మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ప్రభువు మనలను హెచ్చిస్తాడు; ఆయన మనలను ఉన్నత స్థానములకు హెచ్చిస్తాడు. అందుకే బైబిల్ నుండి లూకా 14:11వ వచనములో మనము చదివినట్లయితే, "తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.'' కాబట్టి, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడును. ప్రభువు యెదుట, ప్రజల యెదుట తనను తాను తగ్గించుకుని, వారు ఏదో ఒక విధంగా ఆశీర్వాదమును పొందుకొనునట్లుగా సేవ చేయువారు, అలాగే క్షమించేవారు మరియు ధారాళముగా ఇచ్చు స్వభావం గలవారు, ఇట్టి వారందరు కూడా మరియు మీరు కూడా ఉన్నత స్థితికి హెచ్చించబడతారు. మీ పిల్లలు కూడా ఉన్నత స్థానములకు ఎదుగుతారు; వారు భూమిమీద బలవంతులుగా ఉంటారు. ప్రభువు మీకు ఈ ఆశీర్వాదమును అనుగ్రహించును గాక.
నాల్గవదిగా, తమను తాము తగ్గించుకునేవారు జ్ఞానమును పొందుకుంటారు. అందుకే బైబిల్ నుండి సామెతలు 11:2 వ వచనములో చూచినట్లయితే, "అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారి యొద్ద జ్ఞానమున్నది'' అని చెప్పబడినట్లుగానే, అహంకారము ద్వారా అవమానము కలుగుతుంది. కానీ, దీన్వతముగలవారికి జ్ఞానము కలుగుతుంది. గర్విష్టులలో అహంకారం ఉండవచ్చును. కానీ, వారిలో జ్ఞానము ఉండదు. వారి పని విజయవంతమైన వెంటనే, ఆ గర్వము వారి తలకెక్కుతుంది. ఒకరోజు, వారు సమస్తమును కోల్పోవుదురు. తాము చేయుచున్నది సరైనదని వారు చెప్పుదురు. కానీ, దేవుని యందు భయభక్తులు కలిగి, పవిత్రంగా మరియు దీనత్వముగల హృదయంతో జీవించువారిని వారు హేళన చేయుదురు. అయితే, దేవుని పాదముల చెంత విధేయతతో ఉంటూ, ఆయన చిత్తమును నెరవేరుస్తూ, శ్రమల మధ్యలోనూ చక్కని మార్గములో నడుచుకునే ప్రతివారు జ్ఞానమును పొందుకొనెదరు. ఆ జ్ఞానముతో, సొలొమోనువలె వారు అందరి ద్వారా ఘనతను పొందుకుంటారు. వారు తమ గృహములను నిర్మించుకుంటారు, ప్రభువు కొరకు వారు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు మరియు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువు మీకు మరియు మీ పిల్లలకు అటువంటి జ్ఞానమును అనగా, ప్రభువు యొక్క జ్ఞానమును, ప్రభువు నుండి వచ్చు జ్ఞానమును అనుగ్రహించును గాక. ఆ జ్ఞానము ఇప్పుడు మీ మీద కూడా కుమ్మరించబడును గాక.
ఐదవదిగా, దీనత్వము కలిగియున్న వారికి ప్రభువు ఐశ్వర్యమును, ఘనతను మరియు జీవమును అనుగ్రహించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 22:4వ వచనములో చూచినట్లయితే, "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని యందలి భయభక్తులు కలిగియున్నప్పుడు, అందుకు తగిన ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును పొందుకుంటారు. ప్రభువు మీకు ఇటువంటి కృపను అనుగ్రహించును గాక. యేసు నామములో, దీనత్వమును మీకు ఐశ్వర్యమును మరియు మీకు బలమును చేకూర్చును గాక.
అటుతరువాత, దీనత్వముగలవారికి విజయం కలుగుతుంది. నిశ్చయముగా, మీరు విజయమును పొందుకుంటారు. నా ప్రియులారా, ఇప్పుడు మీరు వైఫల్యాలు మరియు నష్టాలు ఎదుర్కొనవచ్చును. అందుకే బైబిల్ నుండి కీర్తన 149:4 వ వచనములో చూచినట్లయితే, "యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించు ను'' అని చెప్పబడినట్లుగానే, ఆయన దీనులకు రక్షణతో కిరీటమును ధరింపజేయుచున్నాడు. ఆయన వారికి విజయమను కిరీటమును ధరింపజేస్తాడు. ప్రభువు మిమ్మల్ని సంరక్షించి, కాపాడుతాడు మరియు మీ కుటుంబమును కూడా కాపాడుతాడు.
అంతేకాకుండా, నా ప్రియులారా, దీనత్వముగలవారు కృపను మరియు బలమును పొందుకుంటారు. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 12:9-10వ వచనములలో చూచినట్లయితే, "అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగు చున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, మీ బలహీనతలో దేవుని బలం పరిపూర్ణమవుతుంది. కనుకనే, నేడు మీ హృదయములను కలవరపడకండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియ ప్రభువైన యేసూ, నిన్ను మా పూర్ణ హృదయముతో వెదకడానికి మరియు నీ చిత్తమును నెరవేర్చడానికి మాకు దీనత్వముగల హృదయమును మాకు దయచేయుము. ప్రభువా, నీ కృప మమ్మును మరియు మా కుటుంబమును కాపాడునట్లుగా చేయుటకు సహాయము చేయుము. దేవా, మా జీవితములో క్షేమము, జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతను మరియు జీవమును తీసుకొని వచ్చునట్లుగా చేయుము. యేసయ్యా, మమ్మును నీ పిల్లలనుగా మార్చి, మేము ఉన్నత స్థితికి హెచ్చింపబడునట్లుగాను, భూమి మీద మమ్మును బలవంతులుగా చేయుము. దేవా, మేము నీ యందలి కలిగియున్న భయభక్తులకు ప్రతిఫలముగా మాకు విజయమును మరియు రక్షణను అనుగ్రహించుము. యేసయ్యా, మాలోను మరియు మా పాపపు అలవాట్ల నుండి మరియు ప్రతి భారం నుండి మమ్మును విడిపించుము. దేవా, మా బలహీనతలలో నీ బలమును పరిపూర్ణం చేసి, మాలో ఉన్న ప్రతి నొప్పి, వ్యాధులను, బాధలను, చింతలను మరియు నిద్రలేమిని నీ హస్తము చేత తాకి, వాటన్నిటిని మా యొద్ద నుండి తొలగించి, మమ్మును స్వస్థపరచుము. యేసయ్యా, మా జీవితమును అలుముకొనియున్న ప్రతి చీకటి తొలగిపోవునట్లుగాను, ప్రతి అవయవములు చక్కగా పనిచేయునట్లుగా కృపను చూపుము. ప్రభువా, నీ కృప ద్వారా నీవు మమ్మును ఆనంద తైలంతో నింపి, మా జీవితముల ద్వారా నీ రాజ్యాన్ని స్థాపించుటకును మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


