నా ప్రియమైన స్నేహితులారా, ఈ మార్చి 14వ తారీఖున మా తండ్రిగారైన డాక్టర్. పాల్ దినకరన్ దివ్య దర్శన అనుభవమును పొందిన ఒక దినము. ఆ రోజున, దేవుడు తనను మరియు తన పరిచర్యను నడిపించబోవుచున్న ఒక నూతన ప్రవచనాత్మక యుగాన్ని ప్రభువు ఆయనకు బయలుపరచారు. ఆ రోజు నుండి దేవుని యొక్క అద్భుతమైన, శక్తివంతమైన కార్యములలోనికి నడిపించుచున్నాడు; ఇది ప్రపంచ దేశాలకు కూడా ఒక ప్రవచనాత్మకమైన ముందడుగుగా ఒక గొప్ప చర్యగా నిలిచింది. కాబట్టి ఈ పరిచర్య కొరకు మరియు దేవుడు తన రాకడ వరకు ప్రవచనాత్మక కార్యములను సంపూర్ణంగా నెరవేర్చునట్లుగా నిరంతరము ప్రార్థించండి. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 సమూయేలు 7:9వ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "...నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసియున్నాను'' అని చెప్పబడిన ప్రకారము నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు సంపూర్ణమైన విశ్రాంతిని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మీ శత్రువులందరి అణచివేతను మీ యొద్ద నుండి తొలగిస్తాడు. కనుకనే, మీరు ఈ వాగ్దానమును హత్తుకొనండి. ఆయన ఇలా అంటున్నాడు, 'ఆయన ఇప్పటికే దానిని జరిగించియున్నాడు. కనుకనే, ఆయన మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయుచున్న దేవుడుగా మీతో కూడా మరియు మీకు రక్షణ కేడెముగా ఉంటాడు.
నా ప్రియులారా, దేవుడు మనలను వాడుకుంటున్నప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, దేవుని న్యాయమైన మరియు పవిత్రమైన మార్గాలను అనుసరించుచున్నప్పుడు, అప్పుడే ప్రజలు మనలను చూసి ఎక్కువగా అసూయపడతారు. అంతమాత్రమే కాదు, వారు ఇలాగున చెబుతారు, 'ఓహ్, ఏంటి ఇలా ఉన్నావు? నీవెందుకు అంత పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావు? ఎందుకు భిన్నంగా జీవించుచున్నావు? నీవు మా వలె ఉండలేవా? నీవు ఎంతో గొప్పవానిగా ఎదగాలని అనుకుంటున్నావా? ప్రభువు మనలను ఆశీర్వదించి, మనలను వృద్ధి చేసినప్పుడు, ప్రజలలో అసూయ పుడుతుంది; అప్పుడు ప్రజలు మనకు వ్యతిరేకంగా దుష్టకార్యములు జరిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ నా ప్రియ స్నేహితులారా, మీరు అటువంటి స్థితిలో ఉన్నారా? ప్రభువు మీతో ఉండి మిమ్మును ఆశీర్వదించి, మిమ్మును వాడుకోవాలని కోరుచున్నాడు కాబట్టి, ఈ శత్రువులందరూ మీ మీదికి వస్తున్నారని గుర్తించండి. అయితే, దేనిని గురించి చింతించకండి. దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఏ శత్రువు కూడా మిమ్మల్ని తాకజాలడు. ప్రభువు మిమ్మును వారికంటే, వారి కఠినమైన మాటలకంటే మరియు వారి విధ్వంసక చర్యలకంటే అత్యధికముగా ఆయన మిమ్మును పైకి లేవనెత్తుతాడు.
నా ప్రియులారా, అటువంటి చర్యలేవియు కూడా మిమ్మును తాకజాలవు, అయినను మీరు పైకి లేవనెత్తబడుదురు. ప్రవక్తయైన ఏలీయా పట్ల దేవుడు అదేవిధముగా కార్యమును జరిగించియున్నాడు. అతడు ఆకాశమును నుండి దేవుని అగ్నిని ఒక అద్భుతంగా తీసుకువచ్చియున్నాడు. అయితే, యెజెబెలు రాణి ఎంతో కోపముతో మరియు అసూయతో, ఏలీయాను నశింపజేయుదును అని వాగ్దానం చేసెను. అయితే, అతడు, మరణాపేక్షగలవాడై, 'యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము' అని ప్రార్థన చేసెను. అప్పుడు ప్రభువు దూత వచ్చి అతనిని బలపరచెను. అప్పుడు ఒక దేవదూత వచ్చి, ' ఏలీయా, ఒక గొప్ప పరిచర్యను నీ ముందు ఉంచియున్నానని చెప్పి, అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై యున్నది, నీవు లేచి భోజనము చేయుము, ధైర్యము తెచ్చుకొనుము' అని చెప్పెను. అవును, నా ప్రియ స్నేహితులారా, ఆయన మనలను అదేవిధంగా గొప్ప అభిషేకమునకు మరియు గొప్ప పరిచర్యకు నడిపిస్త్తాడు మరియు ఆయన మనలను ఉపయోగించుకుంటాడు. ప్రస్తుతం, దేవుడు మన జీవితములను తాకి మనలను కాపాడి సంరక్షించుచున్నాడు. నా ప్రియులారా, ఆయనను మీ పక్షమున ఉంచుకొనండి. ప్రభువు మిమ్మును ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడో అక్కడికి నడిపిస్తాడు. మీ జీవితమును ఆయన ప్రణాళికలోనికి మరియు ఆయన దర్శనంలోనికి విడిచిపెట్టండి. అంతమాత్రమే కాదు, మీరు ఆయనను మీలోనికి అంగీకరించి, దేవుని శక్తిని పొందండి, పరిశుద్ధాత్మతో నింపబడండి మరియు ప్రభువు మిమ్మును గొప్ప పరిచర్యకు మరియు గొప్ప విజయముల వైపు నడిపించనివ్వండి. అప్పుడు మీ శత్రువులనందరిని మీ యెదుట నిలువకుండ నిర్మూలము చేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు మీకు కలుగజేస్తాడు. దేవుడు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా ముందున్న శత్రువులను నీవు ఇప్పటికే నిర్మూలించినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవే మా రక్షణ మరియు మా వెనుక కాపల కాయువాడవుగా ఉన్నందుకై నీకు వందనములు. దేవా, మాకు విరోధముగా లేచు శత్రువులను మరియు ప్రజలు మాకు విరోధముగా మాట్లాడినప్పుడు కూడా, మా జీవితానికి నీ వాగ్దానములు నమ్మదగినవని మేము గుర్తెరుగునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మా జీవితములో ప్రతి విధ్వంసక మాట మరియు ప్రతి దుష్ట చర్యకంటె మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మేము భయపడిన సమయములో నీవు ఏలీయాను బలపరచినట్లుగానే, మమ్మును కూడా బలపరచుము. తండ్రి, నీ భక్తుడైన ఏలీయాను ధైర్యపరచినట్లుగానే, మమ్మును ధైర్యముతో నింపి, మేము వెళ్లవలసిన మార్గమును మాకు చూపుము. దేవా, మమ్మును నీ సన్నిధితో మా ఆత్మను పునరుద్ధరించుము. ప్రభువా, మా జీవితములో నీవు సిద్ధపరచిన గొప్ప పరిచర్యలోనికి మమ్మును నడిపించుము. దేవా, మా శత్రువులందరు మా యెదుట నిలువకుండా ఉండునట్లుగాను, నీవు మాకు విజయము వెంబడి విజయమును దయచేసి, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు మాకు కలుగజేసి, నీ సేవలో మమ్మును వాడుకొనుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


