నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 27:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను, ప్రతినిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను'' ప్రకారము నేడు మనము మన పరలోకపు తండ్రి యొద్ద నుండి ఎంతటి గొప్ప వాగ్దానమును కలిగియున్నాము కదా! మన దేవుడు గమనించువాడు, కాపు చేయువాడుగాను, మిమ్మును వర్థిల్లింపజేయునట్లుగా ఆయన మీకు పోషణయై యున్నాడు. అవును, అది ఆయన హృదయమై యున్నది. ఈ రోజు లోకములో ఉన్నటువంటి స్థితిగతులను మరియు పరిస్థితులను చూచినట్లయితే, బైబిల్ గ్రంథములో తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును అది దాడి చేయుచున్న సందర్భములో మనకు ఆయన ఈలాగున చేయుచున్నాడు అని తెలియజేయుచున్నది. బైబిల్ నుండి యెషయా 27:1 వ వచనములో ఈలాగున తెలియజేయుచున్నది. "ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును'' ప్రకారం ఈ యొక్క సర్పము మరియు ఏదియు కాదు కానీ, అది అపవాదియే, అది సాతానుయై యున్నది. ఈ అపవాది హవ్వను శోధించినవాడు. దేవునికి విరోధముగా పాపము చేయునట్లుగా, హవ్వను శోధించెను. సాతాను హవ్వ ఆదామును దేవునికి అవిధేయత చూపునట్లుగా నడిపించాడు. అవును, అట్టి సర్పమును నేను నాశనమును చేయుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, దేవుడు, ' మిమ్మును శోధించి, నా యొద్ద నుండి దూరము చేయు మకరమైన అట్టి సర్పమును మీ యొద్ద నుండి నేను నాశనము చేయుదును అని సెలవిచ్చుచున్నాడు. అట్టి సాతానును మీ నుండి నేను తొలగించివేయుదును. '' ఆలాగుననే, "ఆయన గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును '' ప్రకారం ఆయన తన గట్టిదైన గొప్పదై, బలమైన తన ఖడ్గమును పట్టుకొని, దానిని వధించునని వ్రాయబడియున్నది. కనుకనే, మీరు ఏ మాత్రము కూడా భయపడకండి. ఆయన మిమ్మును కనిపెట్టుకొని చూచుచున్నాడు మరియు మిమ్మును భద్రపరుచువాడై యున్నాడు.

నా ప్రియులారా, మన ప్రభువు శత్రువును నాశనం చేయడమే కాకుండా తన పిల్లలను కూడా సురక్షితంగా నడిపిస్తాడు. బైబిల్ నుండి నిర్గమకాండము 23:20వ వచనములో ప్రభువు ఏమని సెలవిచ్చుచున్నాడనగా, "ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారం ఆయన మనకు ముందుగా వెళ్లి, మన మార్గమంతటిలో మనలను భద్రపరుస్తాడు. మనము ఎంతటి భద్రత గల దేవుని మనము కలిగియున్నాము కదా! అందుకే ఆయన, మనలను చూచి, 'నేను మీకు సంసిద్ధము చేసియున్న పాలు తేనెలు ప్రవహించు, ఆహారము, నీళ్లు మీ కొరకై సిద్ధముగా ఉన్న ప్రాంతమునకు మిమ్మును తీసుకొని వెళ్లతానని సెలవిచ్చుచున్నాడు.'' కాబట్టి, ఆయన మిమ్మును కాపాడును. బైబిల్ నుండి కీర్తనలు 121:3,4వ వచనములను చూచినట్లయితే, "ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు'' ప్రకారం నేడు ప్రభువు సకల దుష్టత్వము నుండి మిమ్మును కాపాడును. ఆయన మీ ప్రాణమును కూడా కాపాడును. కనుకనే, మీరు భయపడకండి. బైబిల్ నుండి కీర్తనలు 32:8 వచనములో చూచినట్లయితే, "నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను '' ప్రకారము, ఆయన తన ప్రేమగల దృష్టి యుంచి, మిమ్మును కాపాడును. ఆయన మీ ఉద్యోగమును భద్రపరచును, మీ కుటుంబమును, మీ పేరును, మీ ఆరోగ్యమును భద్రపరచును. దేవునితోను మరియు ఇతరులతోను మీరు కలిగియున్న మీ యొక్క బాంధవ్యమును ఆయన భద్రపరచును. ఆయన మీ యొక్క ఆర్థికమును, గృహమును భద్రపరచును. భయపడకండి, అది దేవుని హృదయమై యున్నది. మిమ్మును భద్రపరచువాడైన యేసునందు మీరు నమ్మికయుంచి, మీ ప్రాణాత్మ, దేహములను మీరు ఆయన పరిశుద్ధ హస్తములకు అప్పగించినప్పుడు, ఆయన తన పరిశుద్ధాత్మ చేత మిమ్మును భద్రపరచును.

నా ప్రియులారా, నేడు బైబిల్ నుండి యోహాను 7:38,39వ వచనములలో మనము చూచినట్లయితే, యేసు ఏమని చెప్పాడనగా, " నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను.'' ఆ ప్రకారముగానే, మీరు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీలో నుండి జీవజలనదులు పారునట్లుగా చేస్తాడు. ప్రతి ఆశీర్వాదమును మీలోనికి ప్రవహించును. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అట్టి కృప మీ మీదికి దిగివస్తుంది. ఈ రోజు ఆయన మిమ్మును జలముల చెంత నడిపించును. అందుకే, కీర్తనలు 23:2వ వచనములో చూచినట్లయితే, " పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు'' ప్రకారము మిమ్మును జలముల చెంతకు నడిపించు, దేవుని ఆశీర్వాదములన్ని యు కూడా ఈ రోజునే ప్రవాహముగా మీ చెంతకు వచ్చుచున్నవి. ఆ ఆశీర్వాదములన్నియు మీరు స్వతంత్రించుకొనునట్లుగా నేను ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. మీ ప్రాణము యొక్క జీవితమునకు సంబంధించిన దైవీకమైన భద్రత అంతయు ఈ రోజు మీ యొద్దకు వచ్చుచున్నది. దైవీకమైన భద్రత కలిగియున్న దేవుని యొక్క మార్గములో ప్రయాణించబడుచూ, దేవుని ఆత్మ ద్వారా, ఆ జలములు ఈ రోజు మీ యొద్దకు వచ్చును. ఆయన మిమ్మును నిశ్చల జలాల ప్రక్కన నడిపిస్తాడు మరియు మీ ఆత్మను పునరుద్ధరిస్తాడు. నా ప్రియమైన స్నేహితులారా, భయపడకండి. నేడు మీ శరీరం, మనస్సు మరియు ఆత్మను నీ రక్షకుడైన యేసు ప్రభువు హస్తములకు సమర్పించండి, నేడు, ఆయన మీకు దైవీక కాపుదల, ఆయన నడిపింపు మరియు ఆయన వర్థిల్లతను మీ మీదికి దిగివస్తాయి. ఎందుకంటే, దేవుడు మీ కొరకు ఉద్దేశమును కలిగియున్న ఏ ఆశీర్వాదమైనా ఖచ్చితంగా ఆయన జీవ జలాల ద్వారా మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. కనుకనే, ఆయనను నమ్మండి, మరియు ఆయన చేయి ప్రతి అడుగులోనూ మిమ్మును కాపాడుచుండట మీరు చూచెదరు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు భద్రతను మరియు కాపుదలనిచ్చి, మిమ్మును నడిపించి, దీవించును గాక.

ప్రార్థన:
కరుణగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మా రక్షకుడిగా మరియు పోషకుడిగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు నిత్యము మమ్మును కాపాడుము మరియు ఏ కీడు మమ్మును తాకకుండా మమ్మును నీ కౌగిటిలో భద్రపరచుకొనుము. దేవా, నీవు మాతో కూడా ఉన్నావు. నీ ప్రేమగల రొమ్మున మమ్మును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ కౌగిలలో మమ్మును భద్రపరచుకొని, నీ కాపుదలలో మమ్మును ఉంచుము. యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును నిశ్చలమైన జలముల ప్రక్కన నడిపించుము మరియు మమ్మును శాంతితో నింపుము. దేవా, మా కుటుంబాన్ని, వారి పనిని మరియు మా యొక్క మరియు మా ప్రియుల యొక్క భవిష్యత్తును నీ దైవీకమైన కాపుదలతో దీవించుము. ప్రభువా, మమ్మును నీ ఆశీర్వాదంలోనికి నడిపించుము. దేవా, మేము కోల్పోయిన భద్రతను మేము మరల పొందుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మును సమాధానముతో నింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.