నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీతో కూడా కలిసి దేవుని వాక్యమును ధ్యానించడం నాకు చాలా ఆనందముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 34:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు.
నేను చిన్నవయస్సులో ఉన్నప్పుడు నా యొక్క చిన్ననాటి ఒక సంఘటనను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ ప్రార్థన సమయంలో, మా చెల్లెలు షారోన్ మరియు నేను, మేమిద్దరము కలిసి, మా తల్లిదండ్రుల ప్రక్కన ఎంతో భయభక్తులతో మోకరించి, చేతులు జోడించి, పూర్ణహృదయముతో ప్రార్థించేవారము. కానీ, ప్రార్థన సమయములో, మా తాతయ్యగారు మమ్మును ప్రార్థనలో నడిపించుచుండగా, మా దృష్టి మరల్చబడుట ద్వారా ఒకరితో ఒకరు ఆడుకోవడం మొదలుపెట్టాము. మా నాన్నగారు, ఆ శబ్దమును విని, ప్రార్థన జరుగుచుండగానే, మా నాన్నగారు వెంటనే మమ్మల్ని గద్దించారు.
ప్రార్థన ముగిసిన తర్వాత, ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనను చూడని మా తాతగారు, మా తల్లిదండ్రులను చూచి, "మీరు, వీరిద్దరిని కొట్టారా?'' అని అడిగారు. మా నాన్నగారు ఆశ్చర్యపోయి, ఈ విషయము మీకెలాగున తెలిసినదని మా తాతయ్యను అడిగారు. అందుకు, మా నాన్నగారు మరియు మా తాతయ్యగారు, ప్రభువు, 'మా ప్రక్కన నిలువబడి ఉన్న ఇద్దరు దేవదూతలను ఆయనకు కనుపరచియున్నాడు.' మేము వారిని గద్దించినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలు పరుగెత్తుకుంటూ మా యొద్దకు వచ్చి, మా ప్రక్కన నిలువబడియుండు నేను చూచియున్నాను ' అని జవాబిచ్చారు.
నా ప్రియులారా, దేవుడు తన దేవదూతలను ఎందుకు మా యొద్దకు పంపించియున్నాడు? అని చూచినట్లయితే. ఎందుకంనగా, పిల్లలుగా మనము దేవునియందు భయభక్తులు కలిగియుంటూ, మన తల్లిదండ్రులకు విధేయులుగా జీవించుచూ, ఆయన సన్నిధిలో పాటలు పాడి, టెలివిజన్‌లో బైబిల్ కథలను పంచుకుని, ఆయన చిత్తమును నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. మనలను కాపాడటానికి మరియు రక్షించడానికి ప్రభువు తన దేవదూతలను మన చుట్టూ కావలి ఉంచియున్నాడు. అది దేవుని ప్రేమపూర్వకమైన సంరక్షణకు ఒక మరపురాని గుర్తింపుగా ఉన్నది.
నా ప్రియ స్నేహితులారా, అదే వాగ్దానమును నేడు మీ జీవితములో అద్భుతకార్యములను జరిగించాలని నేను కోరుచున్నాను. ప్రియులారా, దేవుడు మిమ్మును వ్యక్తిగతంగా కాపాడటానికి ప్రభువు తన దూతలను మీ కొరకు నియమించియున్నాడు. దేవదూతలు మిమ్మును, ప్రతి కీడు నుండి మరియు ప్రమాదము మరియు శత్రువు యొక్క దుష్ట పన్నాగముల నుండి రక్షిస్తాడు. కనుకనే, ప్రియులారా, మీరు ఎన్నటికిని ఒంటరివారు కాదు. కనుకనే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ, ఆయనకు లోబడి నడుచుకుంటూ, విశ్వాసంతో ఆయనను సేవించినట్లయితే, ఆయన యొక్క దృష్టి మీ మీద ఉంటుంది. అంతమాత్రమే కాదు, ఆయన మీ జీవితమునకు ఎటువంటి కీడు రాకుండా, కాపాడి సంరక్షిస్తాడు. కారణము, ఆయనయందు విశ్వాసముంచినవారిని ఆయన కాపాడి రక్షిస్తాడు. నా ప్రియులారా, ఈ వాగ్దానమును ధైర్యముతో గట్టిగా పట్టుకొని, ఆయనకు మీ జీవితములను సమర్పించుకున్నప్పుడు, మీ కొరకు నియమించిన తన దూతలకు ఆజ్ఞాపించు దేవుడు మిమ్మును కాపాడి, విడిపించి, ప్రతి సవాళ్ల మధ్యలో మిమ్మును సురక్షితంగా కాపాడి సంరక్షిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మేము నీ యందు భయభక్తులుగలిగి జీవించునట్లుగా మాకు సహాయము చేయుము, దేవా, మా యొక్క ప్రతి కీడు మరియు ప్రమాదమును నుండి తప్పించుట కొరకు నీ యొక్క దూతలు మమ్మును కాయుటకు మా యొద్దకు పంపించి, మా యొక్క సమస్యల నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, ప్రతిరోజు నీ యెదుట మేము భయభక్తులతోను, విధేయతతోను మరియు విశ్వాసంతోను జీవించడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క పరిశుద్ధ దూతలతో మమ్మును మరియు మా కుటుంబమును చుట్టుముట్టి, ప్రతి అపవాది దాడుల నుండి, ప్రమాదము మరియు కీడు నుండి అనారోగ్యం, భయము, మరియు శత్రువు యొక్క ప్రతి తంత్రముల నుండి నీ దూతల ద్వారా మమ్మును కాపాడుము. దేవా, మా అభివృద్ధికి ఆటంకము కలిగించు ప్రతి బంధకముల నుండి నీ అద్భుతమైన శక్తితో మాకు సంపూర్ణ విడుదలను అనుగ్రహించుము. దేవా, మా హృదయములను నీ యొక్క సమాధానముతోను, ధైర్యముతోను మరియు ఆనందంతోను నింపుము. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మేము ధైర్యంగా నడుచుకొనునట్లుగాను నిన్ను విశ్వాసముతో సేవించునట్లుగాను, మేము చేయు ప్రతి పనిలో నీ నామము మహిమపరచబడునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ యొక్క సంరక్షణ మరియు కాపుదల మా మీద మరియు మా కుటుంబము మీద ఎల్లప్పుడు నిలిచియుండునట్లుగా చేయుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


