నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందముగా ఉన్నది. నేడు మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ రోజు మా తాతగారు, డాక్టరు. డి.జి.యస్. దినకరన్‌గారు దైవరాజ్య ప్రాప్తిని పొందిన ఆయన స్మారక దినము. వారు కూడా దైవ రాజ్యములో నిత్యత్వములో యేసుతో కూడా ఉండే జీవితాన్ని మరియు ఆనందమును అనుభూతి చెందుచున్నారు. మనము కూడా ఒక రోజున ఆయనతో కూడా ఉండెదము. ఈ రోజు మేము ఆయనను జ్ఞాపకము చేసుకొనుచుండగా, మీరు మా కుటుంబము నిమిత్తము ప్రార్థించండి. నేడు నూతనమైన బలము మీకు ప్రభువు చెంత నుండి వచ్చుచున్నది. ఆయన వాక్కు మనకు బలమై యున్నది. ఆయన వాక్కు మన యొద్దకు వచ్చుచున్నది. ఆ వాక్కు నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 6:8వ వచనమును తీసుకొనబడినది. ఆయన వాక్కును చూడండి, " ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును'' అని చెప్పబడిన ప్రకారము నిత్యమైన జీవమును మనము చూచినప్పుడు, పరలోకమందున్న నిత్యజీవము అను పంటను మనము కోయుచున్నాము. ఒక చిన్న పిల్లవానికి తన యొక్క వృద్ధాప్యము కోసము ధనము దాచుకోవడము అంటే ఏమిటో వానికి అర్థము కాదు. వృద్ధాప్యములో ధనము ఎంతగా అవసరమవుతుందో కదా! మనము చిన్న వయస్సులో ఉన్నప్పుడు, కనీసము దానిని గురించి యోచించము. ఆ రీతిగానే, మనము కూడా నిత్యజీవమునకు సంబంధించిన మహిమను మనము దృశ్యరూపకంగా చూడలేము. ఈ లోకములో మనము జీవించుచున్నప్పుడు, పరలోకమందున్న మనము జీవించే మన జీవితమును మనము ఊహించలేము మరియు మనము దానిని చూడలేము. కనుకనే, భూపరమైన ప్రయోజనములన్నియు కూడా ఈ లోకములో సంపాదించడాని కొరకే ఈ భూమి మీద మనము జీవిస్తుంటాము.
కానీ, నా ప్రియులారా, నిత్యజీవమునకు సంబంధించిన మహిమ ఎంతో సౌందర్యవంతమైనది. 'పరలోకమందు నివాస భవనములను సిద్ధము చేయుచున్నాను ' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. పరలోకములో విచారము ఉండదు, బ్రద్ధలైన విధానము ఉండదు. ఏ విధమైన రోగము మరియు ఎటువంటి రోధన కూడా ఉండదు. నిత్యమైన ఆనందము పరలోకమందు ఉంటుంది. ఆ నిత్యజీవము భూమి మీద మన జీవితకాలమంతయు నిరంతరాయముగా కొనసాగుతుంది. అయితే, మన మనస్సు మాత్రమే ఈ భూమి మీద జీవించే డెబ్బై మరియు ఎనబై, తొంబై సంవత్సరముల వయస్సు మీద మాత్రమే ఉంటుంది. కానీ, పై వచనములో చెప్పబడినట్లుగానే, ఆత్మను ఆనందింపజేయుటకు మాత్రమే మనము విత్తినట్లయితే, ఆత్మ మీకు నిత్యజీవమును అనుగ్రహించును. మనము పరిశుద్ధాత్మను ఆనందింపజేసినప్పుడు, ఈ లోక శ్రమలను సహించి దేవుని ఏ మాత్రము విడువకుండ ఉండియున్నప్పుడు, ఆయన జవాబు కొరకు వేచియున్నప్పుడు, ఆయన నిత్యజీవము కొరకు వేచియున్నప్పుడు, పరిశుద్ధాత్మను ఆనందింపజేయుట కొరకై మన పరధ్యానములన్నిటిని విడిచిపెట్టినప్పుడు, త్యాగపూరితముగా పరిశుద్ధాత్మ కొరకు మనము ఉండియున్నట్లయితే, మనము పరలోకమును పొందడానికి, ఆయన ఉపదేశములను ఆలకించుట ద్వారా, తప్పు ఆలవాట్లను మరియు తప్పు మార్గములను విడిచిపెట్టుట తద్వారా, మనము ఆయనకు ఆనందము కలుగజేయుచున్నాము. నా స్నేహితులారా, మరి ఎక్కువ పొందుకొనగలము. పరలోకమందున్న నిత్యత్వమును మనము పొందుకొనగలము.
స్తెఫను ఆ గొప్ప నిత్యత్వమును పొందుకొనియున్నాడు. ఎందుకనగా, మీరు పరలోక దేవునికి అత్యంత సమీపస్థులైనప్పుడు, మరి ఎక్కువగా పరలోకమును మీరు ఈ భూమి మీద అనుభూతి చెందుతారు. ఈ లోకములో మీరు పరలోకమునకు చేరువైన వారుగా ఉంటారు. బైబిల్‌లో స్తెఫెను మీద ప్రజలు రాళ్లు విసరడానికి సిద్ధముగా ఉన్నప్పుడు, ఇంకను అతనిని చంపడాని కొరకై ఎందుకనగా, అతడు యేసును గురించి మాట్లాడుచున్నాడు. గనుకనే, స్తెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడియున్నాడు. అతని కన్నులు పరలోకము వైపునకు తెరువబడ్డాయి. పరలోకమందున్న యేసు వైపు అతని కన్నులు తెరువబడ్డాయి. అతడు ఈలాగున అంటున్నాడు, 'ప్రభువా, నా ఆత్మ స్వీకరించండి, నన్ను రాళ్లతో కొట్టి చంపుచున్న ఈ ప్రజలను నీవు క్షమించుము' అని చెప్పాడు. అవును, అతడు దేవునితో ఎంతగానో నీతిగలవానిగా ఉండియున్నాడు. అతడు ఈ లోకములో ఉండగానే, పరలోకమునకు అత్యంత చేరువుగా ఉండెను. అదే కృపను నేడు మనము కూడా స్వీకరిద్దామా? నా ప్రియులారా, నేడు మీరు మీ జీవితములను దేవునికి సమర్పించినట్లయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, ఈనాటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నిత్యజీవము ఈ బహుమానమునకై నీకు వందనములు. యేసయ్యా, నీవు మాకు అత్యంత సమీపస్ధుడువుగా ఉండుమని కోరుచున్నాము. దేవా, పరిశుద్ధాత్మను ఆనందింపజేయులాగున మరియు పరిశుద్ధాత్మకు మేము విధేయులగుటకును, మమ్మును మేము ఆయనకు లోబపరచుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ కొరకు వేచియుండునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, మా ఆత్మను నీకు లోబపరచుకొనుచున్నాము మరియు మమ్మును నీ హస్తములలోనికి తీసుకొనుము. దేవా, పరలోకమును మరియు నిత్యజీవమును మా కొరకు తెరవజేయుము. ప్రభు వా, మేము ఎంతో బాధలగుండా వెళ్లుచున్నాము, నీ నిమిత్తము మేము ఈ లోక కార్యములను త్యజించుటకు మాకు కృపను దయచేయుము. ప్రభువా, మా పనులన్నిటిలోనూ, మాటలలోనూ పరిశుద్ధాత్మను సంతోషపెట్టడానికి మరియు ఆయనకు విధేయత చూపడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఈ భూమి మీద ఉన్నప్పుడే, పరలోకపు ఆనందమును అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ యొక్క సంతోషముతో మమ్మును నింపుము, ఇంకను పరసంబంధమైన సమాధానము,ఈ భూమి మీద నిత్యజీవములో నీతో కూడా నడుచునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


