నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 15:1వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములో దేవుడు అబ్రాహాముతో ఇలాగున సెలవిచ్చుచున్నాడు, "...భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును...'' అని చెప్ప్బడిన ప్రకారము, దేవుడు మనకు కేడెముగా ఉన్నాడు. అంతమాత్రమే కాదు, మరొక అనువాదములో ఇలాగున చెబుతుంది, "నేనే నీకు అత్యంత గొప్ప బహుమానము.'' అవును, మనం అడుగువాటికంటెను దేవుడు మనకు ఎంతో అత్యధికంగా అనుగ్రహించును. ఇంకను మనం అడుగువాటన్నిటికంటెను మరియు ఊహించువాటన్నిటికంటెను ఆయన ఎంతో గొప్ప కార్యములను మన పట్ల జరిగిస్తాడు. అదియే దేవుని హృదయం. ఆయన ఆకాశపు వాకిళ్లు తెరచి, మనకు పట్టజాలనంతగా సమృద్ధియైన దీవెనలను ఆయన మన మీద కుమ్మరిస్తాడు. అదేనండి, ఆయన హృదయం. ఆయన మనకు అనుగ్రహించి, ఆయనే దానిని కాపాడి సంరక్షిస్తాడు. నా ప్రియులారా, అబ్రాహాము జీవితంలో అదే జరిగిందని మనము చూడగలము. అబ్రాహాము జీవితంలో, దేవుడు తనను చేయమని కోరిన కార్యములను జరిగించుటలో అతడు కేవలం నమ్మకం ఉంచియున్నాడు. దేవుడు తాను వెళ్లాలని కోరుకున్న స్థలమునకు అతనిని నడిపించాడు మరియు దేవుడు తనను నడిపించిన ప్రతి దేశంలోని ప్రజలతోనూ నీతివంతమైన కార్యములను కొనసాగించియున్నాడు.
నా ప్రియులారా, ప్రభువు అతనికి ఒక కుమారుని ఇచ్చినప్పుడు, తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రాహామును కోరెను. అయితే, అబ్రాహాము దానిని చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ, చివరి క్షణంలో దేవుడు అతనిని అడ్డుకుని, 'ఇప్పుడు నీవు నాకు భయపడుచున్నావని నాకు తెలుసు. అందుకే నేను నీ కుమారుని ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధిపరచెదను. కొలతలేకుండా లేని, అత్యంత గొప్ప బహుమానంగా నేను నీకు ఉంటాను.' నా ప్రియులారా, దేవుడు మీ కొరకు చేయబోవునది కూడా ఇదియే. మీరు విధేయత చూపి, మీరు దేవుని విశ్వసించి, దేవుడు మిమ్మల్ని వెళ్లమని కోరిన చోటికి, మీరు విశ్వాసంతో అడుగులు వేసినట్లయితే, దేవుడే మీకు అత్యంత గొప్ప బహుమానముగా ఉంటాడు, మరియు ఆయనే మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు.
మొదటిగా, బైబిల్ నుండి కొలొస్సయులకు 3:23-24 వచనములలో మనము చూచినట్లయితే, "ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు'' అని చెప్పబడిన ప్రకారముగా, దేవుడు కోరుకొనిన దానిని చేయువారికి - కేవలం మనుష్యులను సంతోషపెట్టడానికి, తమ స్వప్రయోజనాల కోసం, తమ పేరు ప్రఖ్యాతుల కొరకు, లేదా లౌకిక ప్రయోజనములను పొందుకొను ఉద్దేశంతో ప్రభువును సేవించువారికి ఆయన ఇటువంటి అత్యంత గొప్ప బహుమానమును అనుగ్రహిస్తాడు. అయితే, యేసు నామమున చిన్నలను, నిరుపేదలను, బా«ధింపబడినవారిని, వెలివేయబడినవారిని ఆదరించే వారికి - ప్రభువు యొద్ద నుండి గొప్ప, అత్యధిక బహుమానము, దేవుని సన్నిధి మరియు ఆయన నుండి ఆనందమును అనుగ్రహింపబడుతుంది. రెండవదిగా, బైబిల్ నుండి హెబ్రీయులకు 11:6వ వచనములో చూచినట్లయితే, " విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా'' అని చెప్పబడిన ప్రకారము తమ జీవితాలను నమ్మి ఆయనకు అప్పగించుకొనువారికి ఆయన ఈ బహుమానమును తప్పకుండా అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, సమస్త దాడుల మరియు దుష్టత్వముల మధ్య, 'దేవుడు మమ్మును నిరాశపరచడు' అని విశ్వసిస్తూ ప్రభువును నమ్ముకునేవారు, ఈ అత్యంత గొప్ప బహుమానమును పొందుతారు. మూడవదిగా, బైబిల్ నుండి గలతీయులకు 6:9వ వచనములో చూచినట్లయితే, "మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము'' అని చెప్పినట్లుగానే, మనము మేలు చేయడంలో ఎన్నడూ విసుకక ఉన్నట్లయితే, అట్టి మనకు ఈ అత్యంత గొప్ప బహుమానము పొందుకుంటారు. వారి శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోయినా, ప్రభువు నామమున వారు చేయుచున్న కార్యములన్నిటిని ప్రజలు అర్థం చేసుకొనలేకపోయినను లేదా అభినందించకపోయినను సరే, మేలు చేయడంలో ఎన్నడూ విసుకక ఉన్నట్లయితే, అట్టి వారు తమ కృషిని కొనసాగించుచున్నంత కాలం-వారికి అత్యంత గొప్ప బహుమానము పొందుకొనెదరు. ఆ కార్యమును దేవుడు మీకు నేడే అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీవే మా కేడెము మరియు మా అత్యంత గొప్ప బహుమానము. దేవా, అబ్రాహాము చేసినట్లుగా, నీ యందు నమ్మకంగా విధేయత చూపడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు నడిపించు స్థలమునకు నడవడానికి మరియు నీకు ఇష్టమైన దానిని చేయడానికి మాకు నేర్పుము. దేవా, పేరు ప్రఖ్యాతులు లేదా ఈ లోక ప్రయోజనములను కోరుకునే ప్రతి కోరికను తొలగించుము. ప్రభువా, పేదలు, బాధలు మరియు విరిగిన హృదయగలవారి పట్ల మా హృదయమును కనికరముతో నింపుము. దేవా, శోధనలు మరియు దాడుల మధ్య కూడా నీ యందు నమ్మికను, నీ యందు విశ్వాసమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేలు చేయడంలో మేము ఎన్నడును విసుకక ఉండునట్లుగా మమ్మును బలపరచుము. దేవా, నీ సన్నిధిని మరియు నీ ఆనందం మా గొప్ప బహుమానముగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు అత్యంత గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


