నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన గొప్ప నామమున మీకందరికి శుభములు. అందుకే నేడు బైబిల్ నుండి సామెతలు 9:10-11వ వచనములు మనకు వాగ్దానముగా ఇవ్వబడినవి. ఆ వచనములు, "యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును'' అని చెప్పబడినట్లుగానే, మీకు దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు.
అవును, నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు అని చూడండి. కనుకనే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియున్నప్పుడు, మీరు జీవించు సంవత్సరములు అధికములగుతాయి. మీ మన బిడ్డలకు కూడా చిన్న వయస్సులో ఉన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులను వారికి నేర్పించాలి. అవును, నా స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని చూడండి! మీరు ప్రభువునకు ఎంత ఎక్కువగా భయపడతారో, అంత ఎక్కువగా ఆయన తన వాగ్దానం ప్రకారం మీరు జీవించు సంవత్సరములను అధికమగునట్లుగా చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు అనగా, కేవలం దేవునికి భయపడటం మాత్రమే కాదు; అది లోతైన భయభక్తులు కలిగి జీవించడం, ఆయనను ఘనపరచడం, ఆయన వాక్యమునకు విధేయత చూపడం మరియు ఆయన చిత్తానుసారంగా నడవడం. అటువంటి జీవితం దేవుని జ్ఞానమును, దయను మరియు దీర్ఘాయువును అనుగ్రహించుచున్నది. కనుకనే, మనము మన పిల్లలకు చిన్న వయస్సు నుండే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటకు నేర్పించినప్పుడు, వారు పెద్దవారైనప్పటికిని దానిని నుండి తొలగిపోకుండా, వారిని మంచి నడిపిస్తూ, వారికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించుచున్నది.
ఒక రోజు, మా పాస్టర్‌గారు బోధించుచుండగా, ప్రభువు, బైబిల్ నుండి సామెతలు 31:30 అను ఈ వచనము ద్వారా నాతో మాట్లాడాడు. ఆ వచ వచనము, "అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును'' అని చెప్పబడినట్లుగానే, ప్రియ స్నేహితులారా, ఈ వచనము నాకివ్వబడినది. అప్పుడు నేను ఒక యౌవనస్థురాలను. కనుకనే, దేవుడు, తన భయభక్తులు కలిగియుండాలనియు, అందము మోసకరమైనదనియు మాట్లాడినట్లుగా ఉండెను. అందమైన జీవితము కొరకు కష్టపడకూడదు. సౌందర్యము వ్యర్థము. అయితే, 'యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది' అని చెప్పబడియున్నది. అవును, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగియుండాలని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బైబిల్‌లో దైవజనుడైన అబ్రాహాము దేవుని యందు భయభక్తులను కలిగియున్నాడు. ప్రభువు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికిని విధేయత చూపించియున్నాడు. అందువలననే, అతడు దీర్ఘాయువు కలిగి వృద్ధాప్యములో మరణించాడు. నా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి యుంటూ, ఆయన మార్గములలో నడవండి. అప్పుడు దేవుడు ఇచ్చు వాగ్దానము చొప్పున మీరు ఈ లోకములో జీవించు సంవత్సరములు అధికమవుతాయి. ఆలాగుననే, పరిశుద్ధాత్ముడు మనకు బోధించిన కార్యములన్నిటికి విధేయత చూపెట్టుచూ, భయభక్తులతో మనము జీవించినప్పుడు, ఆయన మార్గములలో మనము నడుచునట్లుగాను, మన మీద ఆయన ఆశీర్వాదములను కుమ్మరించునని అబ్రాహాము జీవితమునకు తెలియజేయుచున్నది.
నా ప్రియులారా, ఈ రోజు మన జీవితములను పరీక్షించుకుందాము. మీరు చిన్న బిడ్డలైన లేక యౌవనస్థులైన, పెద్దవారైన సరే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియుండవలెను. మనము ఏమి మాట్లాడిన, ఏమి చేసినను, భయభక్తులతో చేయవలెను. అప్పుడు ప్రభువు ఏ విధంగా మిమ్మల్ని దీవిస్తాడు? అని చూచినట్లయితే, మీకు రోజులను అధికము చేస్తాడు. మీకు దీర్ఘాయుష్షును ఇస్తాడు. మీరు అధికకాలము జీవించునట్లుగా మీరు జీవించు సంవత్సరములు అధికమగును. నా ప్రియులారా, మీ మాటలు, కార్యములు, నిర్ణయములు మరియు మీ అనుదిన జీవితములో దేవుడు మిమ్మును గమనించుచున్నాడన్న విషయమును మీరు ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనవలెను. పరిశుద్ధాత్మ మీకు నిత్యము బోధిస్తూ, మిమ్మును నడిపిస్తుంటాడు; కాబట్టి, మీరు ఆయన స్వరాన్ని వెంబడించవలెను. కనుకనే, నా ప్రియులారా, మీరు దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఈ భూమిపై ఆయనను మహిమపరచడం కొనసాగించునట్లుగా, ఆయన మీరు జీవించు సంవత్సరములను అధికముగా చేసి, మీకు దీర్ఘాష్షుయును ఆయుష్కలమును పొడిగించి, ప్రభువు మీలో ప్రతిఒక్కరిని ఆలాగుననే ఆశీర్వదించును. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు నీ మార్గమును నేర్పించి, చెడు మార్గములో వెళ్లుచున్న మమ్మును గానీ, లేక మా ప్రియులనుగానీ, తిరిగి నీ యొద్దకు వచ్చునట్లుగా సహాయము చేయుము. దేవా, నీ మార్గములో నడిచే కృపను, శక్తిని మాకు దయచేయుము. దేవా, ఇప్పుడు మమ్మును దీవించి, ఈ లోకములో నీ మార్గములో నడిచే కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమును మూలము మరియు నీ మార్గములలో నడుచుకొనువారికి నీవు ఆయుష్షును ఇస్తావని మాకు గుర్తు చేసినందుకు నీకు వందనములు. దేవా, ప్రతిరోజూ నీ యందు భయభక్తులతో, విధేయతతో, మరియు దీనత్వముతో జీవించడానికి మాకు నేర్పుము. ప్రభువా, బాహ్య సౌందర్యం, లోక విజయం, లేదా మానవ బలం మీద ఆధారపడకుండా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించునట్లుగా మాకు సహాయం చేయుము. దేవా, మేము చేయు ప్రతి పనిలో నిన్ను ఘనపరచునట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా, మా మాటలను, ఆలోచనలను మరియు క్రియలను చక్కగా నడిపించుము. యేసయ్యా, మా కుటుంబమును మరియు మా పిల్లలను వారి చిన్నతనం నుండి నీ యందు భయభక్తులు కలిగి జీవించునట్లుగా కృపను చూపుము. దేవా, నీ యందు దారి తప్పిన మాలో ప్రతి ఒక్కరినీ నీ వైపుకు తిప్పి, మా యొక్క ప్రతి పాపమును క్షమించుము. ప్రభువా, నీ వాగ్దానము ప్రకారం మా దినములు అధికములగునట్లుగా చేయుము. దేవా, మా జీవితములను నీ జ్ఞానంతో నింపుము మరియు నీ పరిశుద్ధ నామము మహిమపరచడానికి మేము దీర్ఘకాలం జీవించునట్లుగా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


