నా ప్రియ స్నేహితులారా, నేడు పొంగిపొర్లుచున్న దేవుని యొక్క అత్యధికమైన సమృద్ధిని మనము అనుభూతిని ఆనందించబోవుచున్నాము. ఎందుకనగా, మీరు ఆయనను ఎంపిక చేసుకొనియున్నారు కనుకనే, ప్రవాహము వలె దేవుని ఆశీర్వాదములు మిమ్మును వెంబడించును. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 14:27వ వచనమును మనము ధ్యానించడానికి ఎంపిక చేసుకొనబడియున్నది. ఆ వచనము, "...యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును'' అని చెప్పబడినట్లుగానే, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట సమస్తమునకు ప్రారంభము. ఇంకను బైబిల్ చెబుతుందిలా, 'యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము.' అక్కడ జీవము ప్రవాహముగా ఊటవలె వచ్చుచున్నది. అది ఒక వ్యక్తిని మరణ పాశములో నుండి విడిపించునని ఇక్కడ చెప్పబడియున్నది. తద్వారా, మనము ఈ లోకములో మరణమునకు చేరవేయుచున్న సంగతుల నుండి తప్పించబడుచున్నాము. కనుకనే, దేవుని యందు భయభక్తులు కలిగియుండుటకు ఆయనకు వందనములు.

భారత దేశములో వివిధ ప్రాంతములలో ట్రాఫిక్‌ను మనము గమనించినట్లయితే, కొన్ని నగరములలో ట్రాఫిక్ నియమాలను పోలీసు వారిని గౌరవించి, క్రమముగా నడుస్తూ ఉంటాయి. ట్రాఫిక్ ప్రయాణ సరళి, చాలా క్రమబద్ధంగా వెళ్లవలసిన విధంగా ఆ వాహనములన్నియు కూడా వెళ్తూ ఉంటాయి. కానీ, ట్రాఫిక్‌ను నియమాలను గౌరవించని ప్రాంతములలోనైతే, వాహనములు వెళ్లుచున్న అదే దారిలో ఒక వైపున ఒక కారు ఈ వైపు నుండి వస్తుంది. ఇంకొక కారు అదే లైన్‌లో వ్యతిరిక్తమైన మార్గములో నుండి ఎదురుగా వస్తుంది. ఎక్కడ చూచినను, ట్రాఫిక్‌లో గందరగోళంగా ఉంటుంది. నా ప్రియులారా, మన జీవితము కూడా ఆలాగుననే ఉంటుంది. మనము ఆయనను ఎంతగానో గౌరవించియున్నప్పుడు, ఆయన మన జీవితాలను గమనించుచున్నాడు, మన జీవితాలను బట్టి మనము సంతోషించాలని భావించినప్పుడు, ఆయన మనలను గమనించుచున్నాడు అని మనము ఎరిగియున్నప్పుడు, ఆయనకు మనము విధేయులము కావాలి, ఆయనను ఆనందపరచాలి అని మనము భావించినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించు ఊటను మనము పొందుకుంటాము. దాని భావము, పవిత్రతలోను, దేవుని యొక్క చిత్తములోను మనలను మనము భద్రపరచుకుంటాము మరియు కాపాడుకుంటాము, అప్పుడు ప్రభువు మనలను బట్టి ఆనందిస్తాడు.

మనము బైబిల్‌లో యోసేపును చూచినట్లయితే, యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. యోసేపు ఆలాగున చేశాడు. అతని యజమానుని భార్య తనతో అక్రమ సంబంధ బాంధవ్యము కలిగియుండునట్లుగా, అతనిని శోధించియున్నప్పుడు, అది దేవుని నుండి ప్రక్కకు లాగునచున్న మరణపు ఉరిగా ఉండెను. అయితే, యోసేపు అది 'కాదని' చెప్పడానికి ఎంపిక చేసుకున్నాడు. అతడు గనుక 'అవును' అని చెప్పియున్నట్లయితే, యోసేపు వారి దృష్టిలో తన యొక్క యథార్థతను కోల్పోయి ఉండేవాడు. అతడు తన ప్రత్యేకతను కోల్పోయి ఉండేవాడు. అతడు తాను కలిగియున్న ఏకాగ్రతను కోల్పోయి ఉండేవాడు. అతడు తన యజమానుని యింట పొందిన నమ్మకత్వమును కోల్పోయి ఉండేవాడు. తన యజమానుని భార్య యొక్క రాజకీయపు సాలె గూటిలో చిక్కుబడిపోయి ఉండేవాడు. తన యజమానుని భార్య, అతనిని బెదిరించి, అనేక కార్యములను చేయించి ఉండి ఉండవచ్చును. ఐగుప్తులో రాజు యొక్క తదుపరి స్థానమునకు అతడు ఎప్పటికిని లేవనెత్తబడువాడు కాదు. అయితే, యోసేపు దేవునియందు భయభక్తులు కలిగియుండుటకు ఎంపిక చేసుకొనియున్నాడు. అది చెరసాల గుండా వెళ్లవలసిన మార్గము అయినప్పటికిని, అతని యజమానుని భార్య అతనిని అక్రమముగా చెరసాలలో పడునట్లుగా చేసినను, అతడు చెరసాలను దాటి రాజును చేరుకొనులాగున, దేవుడు అతని పట్ల గొప్ప కార్యమును చేసియున్నాడు. అంతమాత్రమే కాదు, ఆ దేశమును పరిపాలన చేయునట్లుగా చేసియున్నాడు. అవును, నా ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట అది మీ జీవితానికి జీవపు ఊటయై యున్నది. అది మిమ్మును మరణపాశముల నుండి తప్పించుకొనునట్లుగా చేయుచున్నది. మిమ్మును గొప్ప ఔన్నత్యమునకు లేవనెత్తబడునట్లుగా చేయుచున్నది. నా ప్రియులారా, నేడు మనము ఇటువంటి దేవుని యందలి భయభక్తులను స్వీకరించునట్లుగా మిమ్మును మీరు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా హృదయములలో నీ భయమును ఉంచుము. ప్రభువా, మా హృదయపు లోతులలో నుంచుము. దేవా, మా జీవితము దేవుని యందలి భయభక్తులలో ఎదుగునట్లుగాను, ఆలాగున నీ యందలి భయభక్తులు మాకు పునాది వలె ఉండునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీవు మమ్మును గమనించుచున్నావన్న భావమును మేము గుర్తెరిగి, మా పట్ల కార్యములను జరిగించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవు మమ్మును చేయగోరుచున్న కార్యములలో నీ చిత్తమును నెరవేర్చడానికి మా యొక్క పవిత్రతను కాపాడుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మాకు ఆజ్ఞాపించిన పనులన్నిటిలో మేము నమ్మకముగా ఉండునట్లుగా మాకు కృపను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క బాహుమానమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితాన్ని నీకు సమర్పించుకొని ప్రతిష్టించుకొనునట్లుగా మా హృదయాలను తెరువుము. దేవా, నీ చిత్తప్రకారము జీవించునట్లుగాను, మమ్మును ఘనపరచి, మమ్మును పైకి లేవనెత్తుము. ప్రభువా, నీ యందు భయము మా జీవితాలలో ఆశీర్వాదపు ఊటగా ఉండునట్లు చేయుము. దేవా, నీ యొక్క జీవపు ఊట మాలో నుండి ప్రవహించు అనుభూతి మాలో కలుగునట్లుగా చేయుము. ప్రభువా, ఎటువంటి మరణపాశము మరియు ఏ కీడుకరమైన వల మాలో ఉండకుండ చేయుము. దేవా, నీ యందలి భయభక్తులతోను, నీ యొక్క జీవముతోను, సంతోషముతోను మేము నింపబడునట్లుగా చేయుము. దేవా, మేము నీ హస్తమును నుండి వర్థిల్లతను పొందుకొనునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.