నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 22:27వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు'' ప్రకారము మనకు ప్రార్థనలకు జవాబు ఇచ్చు దేవుని మనము కలిగియున్నాము; ఆయన మీ ప్రార్థన ఆలకించడానికి వేచి ఉన్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 65:2వ వచనములో చూచినట్లయితే, "ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు'' అని చెప్పబడినట్లుగానే, మన దేవుడు ప్రార్థనను ఆలకించు దేవుడై యున్నాడు. ఇంకను బైబిల్ నుండి 1 యోహాను 5:14 వ వచనములో మనము చూచినట్లయితే, "మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము'' ప్రకారము మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని నమ్మవలెనని ఈ వచనము మనకు ధైర్యమును కలుగజేయుచున్నది. అవును, నా ప్రియులారా, యేసు నామములో మనం ఏదైనా అడిగినా, ఆయన మన మనవి తప్పకుండా ఆలకిస్తాడు. మరియు యెషయా 65:24 వ వచనములో చూచినట్లయితే, " వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనము వేడుకొనక ముందుగానే, ఆయన మనకు ఉత్తరమిస్తాడు.
మొదటిదిగా, ఆయన మనము మన శ్రమలను గురించి ఆలోచించుచుండగానే, మన ప్రార్థన లు ఆయన ఆలకించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:17వ వచనములో చూచినట్లయితే, " నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును'' అని చెప్పబడిన ప్రకారముగానే, మీరు భయపడకండి. నా ప్రియులారా, మీరు దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు, ఆయన మీ శ్రమలన్నిటిలో నుండి మిమ్మును విడిపిస్తాడు మరియు ఆయన ఈరోజే మీ మొఱ్ఱలను ఆలకించి, మీకు జవాబును ఇస్తాడు. కనుకనే, ఈరోజే మీరు మీ శ్రమల నుండి బయటకు రాబోవుచున్నారని నమ్మండి. శ్రమలలో దేవుడు మీకు న్యాయమును జరిగిస్తాడు!
రెండవదిగా, పాపము. నా ప్రియులారా, ఈ రోజు మీరు మీ పాపమును గురించి ప్రార్థించినప్పుడు మీరు మీ పాపము నుండి బయటకు వచ్చెదరు. మరియు మనకు స్వస్థత పొందుకొనునట్లుగా దేవుడు మన ప్రార్థనలను ఆలకించి మనలను స్వస్థపరుస్తాడు. అందుకే నేడు బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనములో చూచినట్లయితే, " నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును'' అని చెప్పబడిన ప్రకారము ఈ రోజు నా ప్రియులారా, మీరు ప్రార్థించి, దేవుని క్షమాపణను కోరినప్పుడు, మీరు పాపం నుండి బయటకు వచ్చెదరు మరియు మన దేశం స్వస్థత పొంది, సుసంపన్నతను మరియు సమాధానమును పొందుకుంటుంది. మూడవదిగా, దేవుడు అనారోగ్యమును గురించిన మనము ఆలోచించినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఇంకను బైబిల్ నుండి 2 రాజులు 20:5వ వచనములో చూచినట్లయితే, "నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు'' ప్రకారము అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, నా ప్రియులారా, మనం మన స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు, ఆయన మన వ్యాధుల నుండి మనలను స్వస్థపరుస్తాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి! కనుకనే మీరు భయపడకండి, మీరు దేవుని సన్నిధికి వచ్చి, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మీ మొఱ్ఱను ఆలకించి, మీకు జవాబును అనుగ్రహించి నేటి వాగ్దానము నుండి మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఇప్పుడు కూడా, మా యొక్క శ్రమలన్నింటి నుండి, మా పాపముల నుండియు, మా యొక్క అనారోగ్యములను మేము నీ సన్నిధికి తీసుకొని వచ్చుచున్నాము. యేసయ్యా, నీ యొక్క రక్తము ద్వారా మా వ్యాధులను స్వస్థపరచుము. దేవా, మా జీవితములో మమ్మును కష్టపెట్టుచున్న ప్రతిదాని నుండి మమ్మును విడిపించుము. యేసయ్యా, నేడు మా పాపములను క్షమించు, మమ్మును కడిగి పరిశుద్ధపరచుము. యేసయ్య, నీ గాయముల ద్వారా మా వ్యాధులను ముట్టి సంపూర్ణముగా స్వస్థపరచుము. ప్రభువా, మా ప్రార్థనలోని ప్రతి మాటను నీవు ఆలకించుచున్నావనియు మరియు మా జీవితంలో న్యాయం జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము వేడుకొనక ముందుగానే, నీవు ప్రార్థనలకు జవాబును ఇచ్చి, మా దుఃఖమును సంతోషముగా మార్చుమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


