నా ప్రియమైన స్నేహితులారా, మిమ్మును కలుసుకోవడము నిజముగా నాకు చాలా ఆనందముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హగ్గయి 2:9వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును...'' అని చెప్పబడిన ప్రకారము ఈ కడవరి దినములలో యేసుక్రీస్తు ప్రభువు వలన మనము గొప్ప మహిమను పొందుకొనగలము. మునుపటి మందిరము యొక్క మహిమ అనగా అర్థము ఏమైయున్నది? సొలొమోను భక్తుడు కట్టించినటువంటి మందిరములో మునుపటి మహిమ నివసించేది. సొలొమోను భక్తుడు కట్టించినటువంటి మందిరములో దేవుడు తన హృదయమును, కళ్లను, చెవులను తెరచి అక్కడ నివసించుచుండేవాడు. రెండవ మందిరములో దేవుని యొక్క కడవరి మహిమ నివసించేది. యేసుప్రభువు ఈ లోకమునకు వచ్చిన తర్వాత, తన సన్నిధితో రెండవ మందిరములోనికి ప్రవేశించినప్పుడు ప్రజలు గొప్ప మహిమను అనుభూతి చెందియున్నారు. రెండవ మందిరములో యేసయ్యా, ప్రజలకు దేవుని వాక్యమును బోధించుచు, వారికి నేర్పించుచు, పరిచర్య చేసేవారు. ఆయన అనేకమంది ప్రజలను స్వస్థపరచేవాడు కూడా. అవును, యేసయ్య సన్నిధానములో మనము గొప్ప మహిమను అనుభూతి చెందుతాము.
అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 3:3,4వ వచనములో చూచినట్లయితే, ఈ మాటలను సెలవిచ్చుచున్నది, "ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను'' ప్రకారము "ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లుగానే,'' ఆ విధముగానే, యేసయ్య, ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని మందిరమైన మన గృహమును నిర్మించినవాడు యేసు ప్రభువు మాత్రమే, మోషేకంటె అధికమైనటువంటి మహిమను పొందుకొనుటకు ఆయనే అర్హుడు. దేవుని యొక్క సన్నిధానము ఏ స్థలమునైనను మహిమవంతముగా మార్చివేయుచున్నది. మేము యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములకు ఎప్పుడు వెళ్లినను కూడా, దేవుని సన్నిధానమును గొప్ప రీతిలో అక్కడగా మేము అనుభూతి చెందుతాము. మరిముఖ్యముగా, ఇశ్రాయేలు ప్రార్థన గోపురమును మేము అక్కడ ప్రతిష్టించినప్పుడు, అక్కడ గొప్ప దేవుని సన్నిధానమును పొందుకొనియున్నాము. నా భర్తగారు అక్కడ వాక్య పరిచర్య చేయుచు ప్రార్థించుచున్న సమయములో, ఒక కిటికి తలుపు తెరుచుకొనబడినది. బలమైనటువంటి గాలులు వీచుచు, ఆ కిటికిలలో నుండి ప్రవేశించినది, నా భర్తగారి యొక్క జుట్టు కూడా కదులుటకు ప్రారంభించినది. అంతమాత్రమేకాదు, మేమందరము ప్రార్థన గోపురము లోపల బలమైన గాలులును వీచుట మేము అనుభూతి చెందియున్నాము. ఆ ప్రార్థన గోపురములో యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నాడని మేము గుర్తెరిగియున్నాము.
ఆ తర్వాత, నా భర్తగారు ప్రజల కొరకు ప్రార్థన చేయుచున్నప్పుడు, అనేకమైన అద్భుతములు జరిగియున్నవి. క్యాన్సర్ స్వస్థత నొందినది. దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థపరచబడినవి. దేవుని యొక్క అద్భుతమైన, ఆశ్చర్యకరమైన హస్తము పనిచేయడము మేము అక్కడ చూడగలిగాము. మోషేకంటె ఎక్కువగా ఘనతను పొందుకొనుటకు అర్హుడుగా ఎంచబడియున్నాడు. ఇశ్రాయేలు ప్రార్థన గోపురములో మాత్రమే కాదు గానీ, ప్రపంచములో ఉన్న ప్రతి ప్రార్థన గోపురములలో అద్భుతవిధముగా, దేవుని యొక్క మహిమను మరియు ఆయన సన్నిధిని అనుభూతి చెందుతాము. ఒకసారి మేము బేతెస్ద ప్రార్థన కేంద్రములో ఉన్నప్పుడు, నేను మరియు మా చిన్న తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మా తండ్రిగారు మరణించిన వెంటనే ఇది జరిగియున్నది. బేతెస్దలో మా చిన్న తమ్ముడు గురించి ప్రార్థించుచూ, తాను పరిచర్య చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను అక్కడ, 'ప్రభువా, ఏవిధము చేతనైనను సరే, మా చిన్న తమ్ముడు పరిచర్యలో నీ కొరకు వాడబడాలి అని చెప్పాను.' అదేవిధంగా, ఈ రోజు మా తమ్ముడు పరిచర్యలో వాడబడుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మనము ఆయనను మహిమపరచు స్థలములలో మాత్రమే ప్రభువు ఉండడము కాదు గానీ, ఆయన మన ప్రార్థనలన్నిటికి కూడా నిశ్చయముగా జవాబును అనుగ్రహిస్తాడు. ఎంతటి ప్రేమ కలిగిన ప్రభువును మనము కలిగియున్నాము కదా! కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు కూడా ఆ కడవరి మందిరము యొక్క మహిమ మీ మీదికి దిగివచ్చునట్లుగా ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క సజీవమైన మందిరముగా మీరు ఉండుటకు పిలువబడియున్నారు. దేవుని యొక్క సన్నిధానమును మోయునటువంటి వారు మీరై యున్నారు. ఇంకను దేవుని మహిమతో మీరు నింపబడుదురు గాక. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రేమగల తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీ బలమైన హస్తమును మా మీదికి చాచుము. తండ్రీ, మా జీవితంలో నీ మహిమగల సన్నిధి ఉంచినందుకై నీకు వందనములు. దేవా, నీ సన్నిధానము ఇప్పుడే మా మీదికి దిగివచ్చునట్లుగా మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, ఇంకను నీ మహిమను మా మీదికి వచ్చునట్లుగా, ఇప్పుడే మమ్మును తాకి స్వస్థపరచుము. ప్రభువైన యేసయ్యా, నీ సన్నిధానములో ఎటువంటి కీడు మరియు అపాయము మరియు ఎటువంటి అనారోగ్యము నిలువజాలకుండా చేయుము. దేవా, మా జీవితాలను నిర్మించినవాడవు నీవే, కనుకనే, మా జీవితములో నీ యొక్క సర్వ మహిమ నీకే చెందును గాక. దేవా, నీ చివరి మహిమ మా మీద నిలిచి, మా హృదయాన్ని నింపునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతిదినం నీ సన్నిధి మాలో సమృద్ధిగా నివసించునట్లుగాను మరియు మా జీవితంలో మునుపెన్నడూ లేనంత గొప్ప కార్యాలను జరిగించుము. దేవా, ఇతరులకు నీ మహిమను బయలుపరచ డానికి మమ్మును ఒక పాత్రగా ఉపయోగించుకొనుము. ప్రభువా, మమ్మును మేము నీ హస్తములకు సంపూర్ణముగా సమర్పించుకుంటున్నాము, మాలో నీ నామం మాత్రమే మహిమపరచబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


